Guppedantha Manasu 5 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్ 5 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 938 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రాకు కంటిన్యూగా ఫోన్ చేస్తుంటుంది అనుపమ. దీంతో ఫోన్ కట్ చేస్తుంటాడు మహీంద్రా. మళ్లీ చేయడంతో ఎత్తుతాడు. మీరు హాస్పిటల్ కు ఎందుకు వెళ్లారు.. ఏం జరిగింది అంటే.. ఆ విషయం తెలిస్తే డైరెక్ట్ గానే అడిగేదాన్ని కదా అంటుంది. ఏం జరిగింది అని అడిగితే శైలేంద్ర మీద అటాక్ జరిగిందట అంటాడు మహీంద్రా. జరిగిందట అంటావేంటి అంటే.. అటాక్ జరిగినప్పుడు నేను లేను.. లైవ్ లో లేను. అందుకే జరిగిందంట అంటాడు మహీంద్రా. ఇంతకీ అటాక్ జరిగిందని ఎవరు చెప్పారు అంటే ధరణి చెప్పింది. ఆ టైమ్ లో ధరణి అక్కడే ఉంది అంటాడు మహీంద్రా. అవునా.. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారు అంటే ముకుల్ అని చెబుతాడు మహీంద్రా. ప్రాథమిక విచారణలో ఏం తేలింది అని అడిగితే నువ్వు నన్ను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకు అంటాడు మహీంద్రా. మరోవైపు శైలేంద్ర దగ్గర కూర్చుంటుంది దేవయాని. అతడు నిద్రపోతున్నట్టు ఉండటంతో బయటికి వెళ్లబోతుండగా.. తన చేయి పట్టుకుంటాడు. నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నా అంటే.. ఇది నిద్ర కాదు మామ్.. నటన. ప్రస్తుతానికి ఈ నటనే నన్ను కాపాడుతోంది అంటాడు శైలేంద్ర.
అసలు నీకు ఏం జరిగింది.. నీకు ఇన్ని గాయలవడం నేను చూడలేకపోతున్నాను. నువ్వు కళ్లు తెరిచి మాట్లాడాకే నాకు పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టుగా ఉంది. నీకు ఏమైనా అయితే నేను బతకలేను అంటాడు శైలేంద్ర. మామ్ నాకు ఏం కాదు. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. అందరి ముందు తొందరపడి నోరు జారకు. ఏదేదో మాట్లాడకు. నువ్వు ఇప్పుడు చేయాల్సింది కేవలం నాకోసం ఏడవడం తప్ప మరేం పని చేయకు అంటాడు శైలేంద్ర. దీంతో అలాగే నాన్న నేను జాగ్రత్తగా ఉంటాను కానీ.. నాకు బెంగగా ఉంది. నీకు ఇంత జరిగినా రిషి నిన్ను చూడటానికి కూడా రాలేదు అంటుంది దేవయాని. ఏదో పని మీద బయటికి వెళ్లాడట. మీ నాన్న అన్నాడు అంటుంది దేవయాని. వాడు వెళ్లింది ఆ వాయిస్ నీదో కాదో తెలుసుకోవడం కోసం వెళ్లాడేమో అనిపిస్తోంది అంటుంది దేవయాని. రిషి నీ వాయిస్ విన్నప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ వాయిస్ నీది అని తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. తన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. జగతిని చంపింది రిషికి నువ్వే అని తెలిస్తే నిన్ను చంపేస్తాడేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఇక మనకు రోజులు దగ్గరపడ్డాయేమో అనిపిస్తోంది నాన్న అంటుంది దేవయాని. దాంతో ప్రతి రోజు మన రోజే. మనకు బ్యాడ్ టైమ్ ఎదురవుతోందని మనకు అనిపిస్తే.. దాన్ని గుడ్ టైమ్ గా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు రిషి విషయంలోనే కాదు.. ఎవ్వరి విషయంలోనూ కంగారు పడకు. ధైర్యంగా ఉండు. ఏది ఏమైనా. చివరికి నువ్వు కోరుకున్నట్టే నేను ఆ ఎండీ సీటులో కూర్చొంటాను అంటాడు.
అసలు నీ మీద అటాక్ చేసింది ఎవరు అంటే.. ఉన్నాడులే మామ్ ఒకడు అంటాడు. వాడు నీకు తెలుసా అంటే.. నాకే కాదు.. నీకు కూడా బాగా తెలుసు అంటాడు శైలేంద్ర. వాడెవడో చెప్పు. నా కొడుకును హాస్పిటల్ పాలు చేసిన వాడెవడో చెప్పు. వాడిని వదిలిపెట్టను అంటే.. వాడి పేరు శైలేంద్ర. వాడి తల్లి పేరు దేవయాని అంటాడు శైలేంద్ర. దీంతో దేవయాని షాక్ అవుతుంది. అంటే ఇదంతా శైలేంద్రే ప్లాన్ చేశాడు. హోటల్ రూమ్ లోకి కొందరిని పిలిచి తనపై అటాక్ చేయించినట్టుగా చేస్తాడు శైలేంద్ర. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఊహించలేదండి అంటుంది ధరణి. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ధరణిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. తను పూర్తిగా నమ్మింది అని అనుకున్నాక తన ప్లాన్ ను అమలు చేస్తాడు.
ఇంతలో డోర్ కొడతారు. ఎవరో వచ్చినట్టున్నారు నేను చూసి వస్తాను అని వెళ్లి ధరని డోర్ తీస్తుంది. ముగ్గురు దొంగలు ముసుగు వేసుకొని వచ్చినట్టుగా వచ్చి ధరణిని కింద పడేస్తారు. శైలేంద్రను పట్టుకొని కొడుతూ ఉంటారు. చాక్ తీసి శైలేంద్ర కడుపులో పొడుస్తాడు. రెండు సార్లు పొడిచే సరికి కుప్పకూలిపోతాడు శైలేంద్ర. నీ ఫ్యామిలీలో ఎవ్వరినీ వదిలిపెట్టము అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ దొంగలు. ధరణి మీద స్పృహ తప్పి పడిపోతాడు శైలేంద్ర.
అంటే మనుషులను పెట్టి నిన్ను నువ్వే పొడిపించుకున్నావా అంటే.. అవును తప్పలేదు మామ్.. పరిస్థితులు బాగలేనప్పుడు తప్పదు అంటాడు. ఇంతలో ధరణి వచ్చి అవును అత్తయ్య అంటుంది. మీరు చెప్పింది వినడం కాదు.. చూశాను. ఆ రౌడీ వెధవలు ఆయన్ను పొడవడం నేను చూస్తూ ఉండిపోయాను అంటుంది ధరణి.
మరోవైపు ముకుల్ ను కలుస్తుంది అనుపమ. శైలేంద్ర మీద జరిగిన అటాక్ గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను అంటుంది అనుపమ. కేసు ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉన్నప్పుడు బయటి వాళ్లకు లీక్ చేయకూడదు అంటాడు ముకుల్. నేను కూడా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటున్నాను అంటుంది అనుపమ. మీరెందుకు చేయాలని అనుకుంటున్నారు అంటే.. నేను జర్నలిస్టును అంటుంది అనుపమ.
దీంతో మహీంద్రాకు ఫోన్ చేస్తాడు ముకుల్. అనుపమతో మాట్లాడమంటాడు. నీకెందుకు అనుపమ. నువ్వు ఈ విషయం వదిలేయ్ అంటాడు. ముకుల్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.