Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 01 Nov Today Episode : హనీని లాస్య, రత్నప్రభకు అప్పగించిన నందు.. ఈ విషయం తెలిసి తులసి ఏం చేస్తుంది? హనీని వాళ్లు ఏం చేస్తారు?

Intinti Gruhalakshmi 01 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. నవంబర్ 1, 2023 బుధవారం ఎపిసోడ్ 1090 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్ను అలా అన్నందుకు సారీ అని హనీతో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు నందు. తులసి రాకముందే ఎలాగైనా హనీని లాస్యకు అప్పగించాలని ప్లాన్ వేస్తాడు. దీంతో హనీతో సరదాగా మాట్లాడుతున్నట్టు నాటకం ఆడుతాడు. మనం బయటికి వెళ్దామా అంటాడు. నిన్ను ఒక ప్లేస్ కు తీసుకెళ్తాను అంటాడు. సర్ ప్రైజ్ అంటాడు నందు. దీంతో మీరు నా ఫ్రెండ్ కదా.. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.. పదండి వెళ్దాం అంటుంది హనీ. దీంతో హనీని తీసుకొని కారులో బయలుదేరుతాడు నందు. కారులో వెళ్తుండగా ఏంటి అంకుల్ ఇంట్లో ఉన్నంత సేపు హుషారుగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడటం లేదు అంటుంది హనీ. ఏం లేదు అంటాడు నందు. మరోవైపు లాస్య నందుకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అసలు దివ్యను కిడ్నాప్ చేసినా వీళ్లకు భయం లేదా అని అనుకుంటుంది లాస్య. తులసి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. నందు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు అంటుంది రత్నప్రభ.

నందు రెస్పాన్స్ ఇచ్చే వరకు వదిలిపెట్టేదే లేదు అంటుంది లాస్య. కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉంటుంది లాస్య. హనీ పక్కన ఉండటంతో ఏం మాట్లాడాలో అర్థం కాదు నందుకు. దీంతో కారు ఒక చోట ఆపి.. బయటికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నందు. ఎన్నిసార్లు కాల్ చేయాలి అంటుంది లాస్య. దివ్యకు ఏమైనా అయితే నా బాధ్యత కాదు అంటే చంపేస్తాను అంటాడు నందు. నువ్వేంటో తెలిసి కూడా నీ మాటకు తలవంచుతోంది కేవలం దివ్య ప్రమాదంలో ఉంది అనే. దివ్యకు ఏమైనా అయితే మాత్రం నీకు సమాధి కడతాను. హనీని తీసుకొని నీ దగ్గరికే బయలుదేరాను. పక్కన హనీ ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్థమయిందా అంటే సరే.. అర్థమయింది అంటుంది లాస్య. సరే.. జాగ్రత్తగా తీసుకొనిరా అంటుంది లాస్య. ఫోన్ కట్ చేసి మళ్లీ కారులోకి వెళ్తాడు నందు. ఇంకెంత దూరం.. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటుంది హనీ. ఇంతలో తులసి కాల్ చేస్తుంది నందుకు. హనీని బయటికి తీసుకెళ్లినట్టు తులసికి తెలిసినట్టుంది అని కాల్ లిఫ్ట్ చేయడు నందు.

Intinti Gruhalakshmi 01 Nov Today Episode : దివ్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిన విక్రమ్, తులసి

మరోవైపు దివ్యను ఆసుపత్రిలో చేర్పిస్తారు. దివ్యకు మెళుకువ వస్తుంది. నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని అడుగుతుంది. దీంతో అవన్నీ ఇప్పుడు ఎందుకు. నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది తులసి. నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అంటుంది తులసి. నాకు నాన్నను చూడాలని ఉంది అంటుంది దివ్య. దీంతో సరే.. ఫోన్ చేస్తా అని చెబుతుంది తులసి.

దివ్య బాగయ్యాక.. తనను ఇంటికి తీసుకొస్తాడు విక్రమ్. చచ్చి శవం అయి వస్తుందనుకుంటే అదేంటి ఇలా తీసుకొస్తున్నాడు అని జాను తల్లిదండ్రులు అనుకుంటారు. అక్కయ్య ప్లాన్ మళ్లీ ఫెయిల్ అయిందా అని అనుకుంటాడు. ఇంతలో ఆగండి అంటుంది జాను. దిష్టి తీస్తుంది. అమ్మా మీరు ఇలా రండి అని చెప్పి తన అమ్మను పిలిచి దిష్టి తీయిస్తుంది. దివ్య మీద నీకు ఉన్న ప్రేమ, అభిమానం వాళ్ల అమ్మకు ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అంటాడు జాను తండ్రి.

అమ్మ ఉంటే అసలు ఊరుకునేదా.. ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని విక్రమ్ అన్న కూడా అంటాడు. లోపలికి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా బాబాయి అని విక్రమ్ వదిన అంటుంది. ఈ ఇంటి కోడలుకు జరిగిన ప్రమాదం గురించి ఇంతమందిమి చించుకుంటున్నాం కానీ.. ఆ పెద్దావిడ మాత్రం ఏం మాట్లాడటం లేదు అంటాడు జాను తండ్రి. దిష్టి తీయమంటారా? అంటే తీయి.. కుండెడు నీళ్లతో దిష్టి తీసినా ఈ ఇంటి పెద్ద కోడలుకు ఆ మహాతల్లి ఉన్నంత వరకు దిష్టి పోదు అంటాడు.

దీంతో బాబాయి అంటుంది దివ్య. హనీ వల్లనే నాకు ప్రమాదం వచ్చింది. ఎందుకు ఇంకా హనీని అప్పగించలేదు అని మీ అమ్మను ఒక్క మాట అయినా అడిగావా? అది మాత్రం అడగవు కదా అంటాడు జాను తండ్రి. ఈ విషయంలో ఎవరు అడిగినా నేను చెప్పే సమాధానం ఒక్కటే.. నేను తప్పు చేయలేదు.. చేయడం లేదు అంటుంది తులసి.

దివ్యను కిడ్నాప్ చేసిన ఇల్లు దొరకడం ఇంకొంచెం సేపు ఆలస్యం అయి ఉంటే ఏమై ఉండేదో ఆలోచించండి అత్తయ్య అని తులసిని ప్రశ్నిస్తాడు విక్రమ్. దివ్యను విడిపించగలను అనే నమ్మకం ఉంది కాబట్టే హనీని అప్పగించలేదు అంటుంది తులసి. దీంతో ఈసారికి సరే.. మరోసారి ఇలా జరగదు అని గ్యారెంటీ ఏంటి అంటాడు విక్రమ్. ఎంతకాలం ఇలా భయంతో బతకాలి అంటాడు విక్రమ్.

మీ అవసరానికి మించిన మంచితనం, దాన్ని ఆయుధంగా చూసుకొని మీ శత్రువు మీ ఫ్యామిలీని అటాక్ చేస్తున్నారు. మీ మంచితనాన్ని కాపాడుకోవడం కోసం మీ వాళ్ల జీవితాలను ప్రమాదంలో పెట్టకండి అంటాడు విక్రమ్. దీంతో ఇంకోసారి ఇలా జరగదు బాబు. నా వల్ల ఎవరూ ప్రమాదంలో పడరు అని నేను మాటిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

హనీని నందు ఎందుకు తీసుకెళ్లాడు అని పరందామయ్య, అనసూయ టెన్షన్ పడతారు. ఎక్కడికైనా సరదాకి తీసుకెళ్లాడేమో అని అంటుంది అనసూయ. మనం కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడు అంటాడు పరందామయ్య. తనను తీసుకెళ్లి లాస్యకు అప్పగిస్తాడేమో అని భయపడతారు. వాడు హనీని అప్పగిస్తే ఎలా? వెంటనే తులసికి ఈ విషయం ఫోన్ చేసి చెబుదాం అని అంటాడు పరందామయ్య.

మరోవైపు తులసి స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఒక చోట ఆగి నందుకు ఫోన్ చేస్తుంది. కానీ.. నందు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. కట్ చేస్తుంటాడు. దీంతో ఎందుకు ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతుంది తులసి.

మరోవైపు హనీని తీసుకెళ్లి రత్నప్రభకు అప్పగిస్తాడు నందు. వెంటనే అక్కడికి వెళ్లిన తులసి హనీని వాళ్ల దగ్గర్నుంచి లాక్కుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago