Categories: ExclusiveNewsTV Shows

Intinti Gruhalakshmi 2 Nov Today Episode : హనీని రత్నప్రభకు నందు అప్పగిస్తాడా? ఈ విషయం తెలిసి తులసి ఏం చేస్తుంది? నందును ఛీకొడుతుందా?

Intinti Gruhalakshmi 2 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి నవంబర్ 2, 2023 గురువారం ఎపిసోడ్ 1091 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ హనీని రత్న చేతుల్లో పెట్టను అని అనుకుంటుంది తులసి. ఇంతలో తులసికి ఫోన్ చేయబోతాడు పరందామయ్య. దీంతో వద్దు.. అంటుంది అనసూయ. హనీ విషయంలో నందు, తులసి గొడవ పెట్టుకుంటారు అంటుంది అనసూయ. మరోవైపు నంద గోపాల్ నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటుంది తులసి. తులసికి నమ్మకద్రోహం నేను చేయలేను అని చెప్పి పరందామయ్య తులసికి కాల్ చేస్తాడు. దారిలో ఉన్నా వస్తా మామయ్య. కంగారు పడాల్సింది ఏం లేదు. దివ్య  కూడా క్షేమంగా ఉంది అంటుంది తులసి. ఒకసారి హనీకి ఫోన్ ఇవ్వండి. నేను మాట్లాడుతాను అంటుంది తులసి. దీంతో పరందామయ్యకు ఏం చెప్పాలో అర్థం కాదు. హనీ ఇంట్లో లేదు అంటాడు. నందు తీసుకెళ్లాడు అని చెబుతాడు పరందామయ్య. ఎక్కడికి తీసుకెళ్లాడు అంటే.. నాకు చెప్పకుండా దొంగతనంగా తీసుకెళ్లాడు. వాళ్ల ఇంటికే అయి ఉంటుంది అంటాడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం అంటాడు పరందామయ్య. ఏం చేయాలో తులసికి అర్థం కాదు. హనీ పక్కనే ఉంటుంది కదా.. దానికి కాల్ చేస్తాను అని అనుకుంటుంది. వెంటనే హనీకి ఫోన్ చేస్తుంది. దీంతో అంకుల్ తులసి ఆంటి ఫోన్ చేస్తుంది అంటే.. వద్దు కట్ చేయ్ అంటాడు. దీంతో హనీ ఫోన్ కట్ చేస్తుంది.

ఒకసారి నందుకు ఫోన్ చేయి.. ఎంతవరకు వచ్చారో అని అంటుంది రత్నప్రభ. లాస్య మరోసారి నందుకు ఫోన్ చేస్తుంది. కట్ చేస్తాడు. ఇంతలో నందు కారు లాస్య ఇంటికి వచ్చి ఆగుతుంది. ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు నందు. అంకుల్ మీరు చీట్ చేశారు. మీరు మంచోళ్లు కాదు అంటుంది హనీ. వద్దు అంకుల్. నేను ఇక్కడ ఉండను. నేను ఇప్పుడే తులసి ఆంటికి ఫోన్ చేస్తాను అనడంతో ఫోన్ లాక్కుంటాడు. ప్లీజ్ అంకుల్.. నేను తులసి ఆంటితో మాట్లాడాలి అంటే హనీపై సీరియస్ అవుతాడు. నీ మీద నాకు కోపం లేదు. అంతా తులసి మీదనే. నువ్వు ఉండాల్సిన చోటుకే నేను తీసుకొచ్చాను. కారు దిగు అంటాడు నందు. తనను కారు నుంచి లాక్కొస్తాడు నందు. లాస్య, రత్నప్రభ.. హనీని చూసి సంతోషిస్తారు. ప్లీజ్ అంకుల్.. నా మాట వినండి అంకుల్ అంటే అస్సలు వినడు నందు. థాంక్స్ నందు.. మధ్యలోనే డ్రాప్ అవుతావు అనుకున్నాను అంటుంది లాస్య. తులసిని కాదని.. తులసిని పట్టించుకోకుండా, ఎదురించి నిలబడి హనీని తీసుకొచ్చావు. తులసి నిజ స్వరూపం తెలుసుకొని పౌరుషం ఉన్న మగాడిలా ప్రవర్తించావు అంటుంది లాస్య. డీల్ అంటే డీల్.. దివ్యను వదిలేస్తాం అంటుంది రత్నప్రభ. హనీ చేతిని రత్న చేతుల్లో పెట్టు.. ఒక పని అయిపోతుంది అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 2 Nov Today Episode : నేను ఇక్కడ ఉండను అని మారాం చేసిన హనీ

ప్లీజ్ అంకుల్ .. ఆ కొత్త ఆంటి మంచిది కాదు. ప్లీజ్ అంకుల్.. నాకు అన్నం పెట్టదు. స్కూల్ కు పంపదు. జైలులో పెట్టినట్టు రూమ్ లో బంధిస్తుంది. నా మాట వినండి అన్నా కూడా వినకుండా హనీని రత్నప్రభకు అందిస్తాడు. మరి దివ్య అంటే.. నువ్వు ఇంటికి వెళ్లేసరికి క్షేమంగా వస్తుంది అంటుంది రత్నప్రభ. కాకపోతే తులసిని ఈ ఇంటి వైపునకు చూడకుండా చూసుకో అంటుంది లాస్య.

హనీ మాత్రం నందును చాలా బతిమిలాడుతుంది. అయినా నందుకు కనికరం పుట్టదు. నన్ను ఇలా అన్యాయం చేస్తారా అంటూ హనీ ఏడుస్తుంది. ప్లీజ్ అంకుల్. నా మాట వినండి అంకుల్.. ప్లీజ్ అంకుల్ అంటుంది హనీ. నన్ను తీసుకెళ్లిపోండి అంకుల్. మీ కాళ్లు పట్టుకుంటా అంకుల్. నా మాట వినండి అంకుల్. అంటూ ఎంత బతిమిలాడినా నందుకు మాత్రం కనికరం రాదు.

ఇంతలో హనీ చేయిని ఎందుకో నందు పట్టుకుంటాడు. దీంతో లాస్య, రత్నప్రభ షాక్ అవుతారు. హనీని తన వైపునకు లాక్కుంటాడు. దీంతో నందు ఏంటి నువ్వు చేస్తున్న పని మర్యాదగా హనీని మాకు అప్పజెప్పు అంటే.. అప్పజెప్పను అంటాడు నందు. ఈ నిప్పుల కొలిమిలో నేను హనీని వదిలేయను. ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను. మీ ప్రవర్తన కళ్లారా చూశాక అది తెలుసుకున్నాను అంటాడు నందు.

అయితే దివ్య మీద ఆశ వదులుకో అంటుంది లాస్య. ఇంతలో తులసి వస్తుంది. దివ్య క్షేమంగా ఉంది అంటుంది. దీంతో లాస్య, రత్నప్రభ షాక్ అవుతారు. ఆంటి అంటూ తులసి దగ్గరికి వెళ్తుంది హనీ. దివ్యను క్షేమంగా విడిపించాను. తను క్షేమంగా ఉంది అంటుంది. దివ్య క్షేమంగా ఉన్నంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు అంటుంది లాస్య. దీంతో ఇక చాలు.. తులసికి నేను అండగా ఉంటాను అంటాడు నందు.

అన్యాయం కొద్ది రోజులు రాజ్యం ఏలొచ్చు కానీ.. చివరకు గెలిచేది న్యాయం మాత్రమే. ఇప్పటికైనా తెలుసుకో.. బుద్ధి తెచ్చుకో. రత్న లాంటి రాక్షసులకు అండగా నిలబడటం కరెక్ట్ కాదు. నువ్వే నష్టపోతావు అంటుంది తులసి. హనీ మాతోనే ఉంటుంది. ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి హనీని తీసుకెళ్తారు నందు, తులసి.

మరోవైపు దివ్య.. తన తల్లిని అన్ని మాటలు అనడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కన్నకూతురు కన్నా మీ అమ్మకు హనీనే ఎక్కువైందా అని అన్న మాటలే గుర్తొస్తుంటాయి. సారీ దివ్య.. మీ అమ్మను అన్ని మాటలు అన్నందుకు అని అంటాడు విక్రమ్. అమ్మ బాధపడుతూ వెళ్లింది అంటుంది దివ్య. హనీ కోసం వాళ్లు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి. అసలు ఈ హింస ఏంటి. వాళ్లు అసలు మనుషులేనా అంటూ విక్రమ్ సీరియస్ అవుతాడు. దీంతో కూర్చో విక్రమ్.. కూల్ అంటుంది దివ్య.

అత్తయ్యతో గట్టిగా మాట్లాడటానికి కారణం కూడా అదే. ఈ విషయంలో వాళ్లు దెబ్బతిన్నారు. పగతో ఇంకేదైనా చేస్తే. తెగించిన వాళ్లకు విచక్షణ ఉండదు దివ్య అంటాడు విక్రమ్. దీంతో అవన్నీ ఒకసారి వదిలేసి ప్రశాంతంగా ఉందాం అంటుంది దివ్య.

నేను సమయానికి వచ్చాను.. అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నిన్ను కాపాడగలిగాను. లేకపోతే నీ మొగుడు ఒక చేతకాని వాడు అయ్యేవాడు అంటాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా గడుపుతారు. ఇక ముందు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు అని అంటుంది దివ్య.

ఈరోజు నాకు ఎప్పుడూ లేనంత ధైర్యంగా ఉంది. మొదటిసారి మీరు నాకు అండగా నిలబడ్డారు అంటుంది తులసి. మరోవైపు రత్నప్రభ.. తులసి మీద కేసు వేస్తుంది. దానికి సంబంధించిన నోటీసులు తులసికి వస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

43 minutes ago

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

10 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

11 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

12 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

13 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

13 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

15 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

15 hours ago