Categories: NewsTV Shows

Guppedantha Manasu 2 Nov Today Episode : మహీంద్రాకు కాల్ చేసిన అనుపమ.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను చూసి శైలేంద్ర, దేవయాని షాక్.. జగతిని ఎవరు చంపారో రిషికి తెలిసిపోతుందా?

Advertisement
Advertisement

Guppedantha Manasu 2 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 2 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 910 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నా గతంలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నా జీవితం అక్కడే ఆగిపోయింది. ఇన్ని సంవత్సరాలు వాళ్లకు దూరంగా ఉన్నానన్న మాటే కానీ… ఒక్క క్షణం కూడా వాళ్లతో గడిపిన క్షణాలను మరిచిపోలేకపోతున్నాను అని చెబుతుంది అనుపమ. దీంతో నువ్వు ఒక పని చేయి అనుపమ అని చెబుతుంది పెద్దమ్మ. నువ్వు మళ్లీ వెనక్కి వెళ్లాలి అంటుంది. నీ గతంలోకి వెళ్లాలి అంటుంది. దీంతో లేదు పెద్దమ్మ. నేను వెళ్లను. నా వల్ల కాదు అంటుంది. దీంతో లేదు అనుపమ ఇలా నువ్వు వాళ్లకు దూరంగా ఉంటే ఏదేదో ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటున్నావు. నువ్వు కోపం తగ్గించుకోవాలి. నీ గురించి నాకు బాగా తెలుసు. నీది కల్మషం లేని మనసు. నువ్వు ఎవరిని అయితే ఎక్కువగా ఇష్టపడతావో.. వాళ్ల మీదే నీకు కోపం ఎక్కువగా వస్తుంది. నీకు ఈ వయసులో ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కానీ.. చెప్పకుండా ఉండలేకపోతున్నాను. కోపం వల్ల సమస్యలు పరిష్కారం కావు. నువ్వు ఇది దృష్టిలో పెట్టుకొని నీ కోపం తగ్గించుకో. నార్మల్ గా ఉండేందుకు ప్రయత్నించు. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయావు. ఎవరినైతే వదిలేశావో వాళ్లను ఇప్పుడు కలువు. ఎవరి గురించి ఆరాటపడుతున్నావో ఇప్పుడు నువ్వు వాళ్లతో కలిసి సాగితేనే వాళ్లు హ్యాపీగా ఉంటారు. నువ్వు హ్యాపీగా ఉంటావు అంటుంది పెద్దమ్మ.

Advertisement

దీంతో వాళ్ల ముందు నేను నిలకడగా ఉండలేను. అందుకే నేను వెళ్లలేను అంటుంది అనుపమ. దీంతో ఇప్పుడు మాత్రం నిలకడగా ఉంటున్నావా? ఇది నీ లైఫ్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఎక్కడైతే నువ్వు నీ ఆనందాన్ని పోగొట్టుకున్నవో అక్కడే వెతుక్కునేలా చేసుకో అంటుంది. కోల్పోయిన జీవితాన్ని ఎలాగూ పొందలేవు. కొత్త జీవితాన్ని పొందేందుకు ప్రయత్నించు. నువ్వు నువ్వులా ఉండలేకపోతున్నావు. నిన్ను చూస్తుంటే నీకు ఏమౌతుందో ఏమో అని నాకు చాలా భయమేస్తోంది. కాబట్టి ఒక అడుగు ముందు వేయడానికే ప్రయత్నించు అంటుంది పెద్దమ్మ. ఇక్కడే ఆగిపోకమ్మా అంటుంది. దీంతో మహీంద్రతో మాట్లాడి తన దగ్గర అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడే మహీంద్రతో మాట్లాడుతా అని అనుకుంటుంది. మరోవైపు రిషి, మహీంద్రా భోజనం తింటూ ఉంటారు. వసుధార వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తిను అంటే నేను తర్వాత తింటాను అంటుంది వసు. దీంతో ముగ్గురం కలిసి భోం చేద్దాం రా కూర్చో అంటాడు మహీంద్రా. రిషి… ఈ కర్రీ చాలా బాగుంది. కొంచెం వేసుకో నాన్న అంటాడు మహీంద్రా. దీంతో రిషి ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు. తిను.. అంటే ఓకే అంటాడు రిషి. ఎలా ఉంది అంటే బాగుంది డాడ్ అంటాడు. బాగా చేశావమ్మా. నువ్వు కూడా కొంచెం ఈ కర్రీ తిను అంటాడు. ఇంతలో అనుపమ నుంచి మహీంద్రాకు కాల్ వస్తుంది. దీంతో మహీంద్రాకు ఏం చేయాలో అర్థం కాదు. కాల్ కల్ చేసి ఫోన్ పక్కన పెడతాడు. దీంతో మరోసారి ఫోన్ చేస్తుంది అనుపమ. డాడ్.. లిఫ్ట్ చేసి మాట్లాడండి అంటే పర్లేదు. అంత ముఖ్యమైన కాల్ కాదు అంటాడు మహీంద్రా.

Advertisement

Guppedantha Manasu 2 Nov Today Episode : అనుపమ నుంచి ఫోన్ రాగానే షాక్ అయిన మహీంద్రా

ఇంకొంచెం వేసుకోండి మామయ్య అంటే నాకు సరిపోయింది. మీరు భోం చేయండి అని చెప్పి సరిగ్గా తినకుండానే వెళ్లిపోతాడు. ఫోన్ రాకముందు డాడ్ బాగానే ఉన్నారు కదా. ఫోన్ రాగానే ఎందుకు కంగారు పడిపోతున్నారు. అనుపమ అని ఉంది. మనకు అరుకులో కలిసిన ఆవిడే కదా. ఆవిడ ఎందుకు డాడ్ కు కాల్ చేసి ఉంటారు. ఆవిడ కాల్ చేస్తే డాడ్ ఎందుకు కల్ కట్ చేస్తున్నారు. ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు. అసలు వీళ్లిద్దరికీ పరిచయం ఉందా? ఉంటే.. మనకెందుకు డాడ్ చెప్పడం లేదు అని వసుతో అంటాడు రిషి. ఆవిడ నెంబర్ తీసుకొని విషయం ఏంటో కాల్ చేసి కనుక్కోనా అంటే వద్దు వసుధర. మనం ఆమెకు ఫోన్ చేసి డాడ్ గురించి అడిగితే బాగుండదు. డాడ్ చెప్పేంతవరకు మనం ఎదురు చూద్దాం అంటాడు రిషి.

వాళ్ల మధ్య ఏదైనా గతం ఉందా.. ఉంటే అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటుంది రిసి. దీంతో మనం ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు భోం చేయి అంటాడు రిషి. కట్ చేస్తే తెల్లవారుతుంది. మహీంద్రా పేపర్ చదువుతూ ఉంటాడు. మామయ్య కాఫీ అని ఇస్తుంది రిషి. రిషి ఏం చేస్తున్నాడు అని అడిగితే రెడీ అవుతున్నాడు. పెద్దమ్మను కలవడానికి వెళ్తున్నాడు అంటే రిషి ఇప్పుడు అక్కడికి వెళ్లాలా అంటాడు. ఆ శైలేంద్ర, వదినను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తోంది. జగతి చావుకు కారణం ఎవరో తెలియడం లేదు. కానీ.. ఈరోజు జగతి ఈ లోకంలో లేదంటే పరోక్షంగా వాళ్లే కారణం. జగతి.. రిషి వెళ్లిపోయినా శైలేంద్ర బెదిరింపులకు తొణకలేదు. రిషిని ఎప్పుడు ఏం చేస్తారో అని భయంగా ఉంది అంటాడు మహీంద్రా.

దీంతో సర్ ను వాళ్లు ఏం చేయలేరు అంటుంది వసు. రిషి సార్ అందుకే అక్కడికి ఒకసారి వెళ్లాలి. మనకు తెలిసిన నిజాలు సర్ కి చెప్పలేం. కనీసం సర్ అక్కడికి వెళ్తే అయినా అసలు నిజాలు తెలుస్తాయేమో చూద్దాం అంటుంది వసు. రిషి సర్ మనసులో వాళ్ల మీద ఉన్న ఆ నమ్మకమే వాళ్లను కాపాడుతోంది. రిషి సార్ నిజాలు గుర్తించే సమయం దగ్గరపడింది. శైలేంద్ర పదవి దక్కలేదని కోపంలో ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆ క్షణంలో రిషి సార్ అసలు నిజం తెలుసుకుంటారు. ఖచ్చితంగా నేరస్తులు ఎవరు అనేది రిషి సార్ కు తెలుస్తుంది. మీరేం భయపడకండి అంటుంది వసుధార.

నేరస్తులు ఎవరైనా సరే వాళ్లను క్షమించను అని నాకు రిషి చెప్పాడు. అందుకే నేను వాళ్ల పతనం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. నా కొడుకు చేతుల్లో వాళ్లు నరకం చూడాలి. ఆ విధంగా నా కొడుకు వాళ్లను దండించాలి. నేను రాక్షసుడిని కాదు. నాకు వాళ్ల మీద ఎలాంటి పగ, ప్రతీకారం లేదు. వాళ్ల గురించి తెలిసి వాళ్లను వదిలేస్తే మాత్రం ఆ భగవంతుడు రిషిని క్షమించడు అంటాడు.

మామయ్య.. మీరు ఆవేశపడకండి. సర్ కి అసలు నిజం తెలిసిన మరుక్షణమే వాళ్లకు సరైన శిక్ష వేస్తాడు అంటుంది వసు. మరోవైపు రిషి రెడీ అయి వస్తాడు. డాడ్.. నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్లి వస్తాను అంటాడు. దీంతో సరే అంటాడు మహీంద్రా. నేను కూడా వస్తాను అంటుంది వసు. మరి డాడ్ అంటే మామయ్య గురించి మీరేం టెన్షన్ పడకండి. ఆయన నార్మల్ గానే జాగ్రత్తగా ఉంటారు అంటుంది వసు.

ఈరోజు నేను తాగను. మీరు వచ్చేవరకు నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు వసుధారను తీసుకెళ్లు అంటాడు మహీంద్రా. దీంతో సరే అని వసుధారను తీసుకెళ్తాడు రిషి. రిషిని చూసి నటన స్టార్ట్ చేస్తుంది దేవయాని. రిషి బాగున్నావా? ఏంటి ఇలా చిక్కిపోయావు అంటుంది. దీంతో అదేం లేదు పెద్దమ్మ.. బాగానే ఉన్నాను అంటాడు రిషి.

మహీంద్రా ఎలా ఉన్నాడు బాగున్నాడా.. అంటుంది. మహీంద్రా అంటూ పిలుస్తుంది. దీంతో డాడ్ రాలేదు అంటుంది దేవయాని. నేను వచ్చాడేమో అనుకున్నా. క్షమించమని అడుగుదాం అని అనుకున్నా అంటుంది. వసుధార అయినా వచ్చి ఉంటే బాగుండేది అంటే.. నేను వచ్చాను మేడమ్. నా గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారు. ఎంత దిగులు పెట్టుకున్నారో ఏంటో. నేను రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటుంది వసు.

ఇంతలో శైలేంద్ర వస్తాడు. హాయ్ వసుధార బాగున్నావా అంటాడు శైలేంద్ర. బాగున్నా సార్ అంటుంది. బాబాయి రాలేదా అంటే రాలేదు అంటాడు రిషి. నువ్వు చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో అడుగుపెట్టావు. నువ్వు ఏం తింటావు చెప్పు అంటుంది దేవయాని. పెదనాన్న మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి అంటాడు. ఎవరు అని అడుగుతాడు రవీంద్ర.

ఇంతలో ముకుల్ కు ఫోన్ చేస్తాడు రిషి. త్వరగా రండి అంటాడు. దీంతో వస్తున్నా సార్ అంటాడు ముకుల్. ఇంటికి వస్తాడు. తను ముకుల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అమ్మ కేసును స్పెషల్ గా డీల్ చేయడానికి అపాయింట్ అయ్యారు అని చెబుతాడు రిషి. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు.

అసలు ఈ ఇంటి మీద నిఘా వేసిన వాళ్లు ఎవరో అర్థం కావడం లేదు. మనకు తెలియకుండానే ఇక్కడ ఏదో జరుగుతోంది అంటాడు రిషి. ఆ రోజు ఈ ఇంట్లో నుంచి అమ్మ బయలుదేరడం, నాకు అమ్మకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అమ్మ నాకు మాత్రమే కాల్ చేసింది. అలాంటిది బయటి వాళ్లకు ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు అంటాడు రిషి. దీంతో జగతి మేడమ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే తెలుస్తుంది అంటాడు ముకుల్. దీంతో కరెక్టే కానీ.. ముందు మనం మన చుట్టుపక్కన ఉన్న వాళ్లకు, మన అనుకున్న వాళ్లకు ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళ్తే బాగుంటుందేమో అంటుంది వసుధార. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.