Intinti Gruhalakshmi 22 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 22 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 1108 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి అన్నం తినకుండా ఉండటం, అది నావల్ల తినకుండా ఉండటం నేను చూస్తూ ఉండలేను అంటాడు నందు. దీంతో వద్దు నాన్న.. నువ్వు మళ్లీ అమ్మ దగ్గరికి వెళ్లకు అంటుంది దివ్య. నువ్వు కొన్ని రోజుల పాటు అమ్మకు దూరంగా ఉండు. అమ్మకు నేను తినిపిస్తాను అని చెప్పి భోజనం తీసుకెళ్తుంది దివ్య. మరోవైపు తులసి తన తల్లి ఫోటో చూస్తూ అలాగే కూర్చుంటుంది. లైట్ కూడా వేసుకోదు. దివ్య వెళ్లి లైట్ వేస్తుంది. దీంతో తులసికి చిరాకు వేస్తుంది. భోజనం చేయి అంటే వద్దు అంటుంది తులసి. ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా అన్నా కూడా పట్టించుకోదు. నేను తినకుండా ఉంటే ఊరుకుంటావా అంటే.. ఎలా ఊరుకుంటాను అమ్మను కదా.. బతిమాలి తినిపిస్తాను అంటుంది తులసి. నా గురించి ఎవ్వరూ ఆలోచించవద్దు. ఎవ్వరి పని వాళ్లు చూసుకోండి. వెళ్లు అమ్మ అంటుంది తులసి. ఇంతలో నందు తన రూమ్ లోకి వెళ్తాడు. పరందామయ్య కూడా తనతో పాటు వెళ్తాడు. దీంతో ఎందుకు వచ్చారు ఆయన నా గదిలోకి. మీ అందరి ముందే స్పష్టంగా చెప్పాను కదా. అయినా కూడా ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది తులసి. అమ్మ ఎందుకు అంత కోపం అంటే.. మీ అమ్మను ఎవరైనా చంపేస్తే నువ్వు వాళ్లతో మంచిగా మాట్లాడుతావా? సమర్ధిస్తావా? అని అడుగుతుంది తులసి. దీంతో ఎందుకు అమ్మ అలా మాట్లాడుతున్నావు అంటుంది దివ్య.
తులసి నా మీద నీకు కోపం ఉంది. నా మీద, నా విషయంలో ఏం చేయాలని అనుకుంటే అది చేయి. కానీ.. నా మీద కోపంతో నిన్ను నువ్వు హింసించుకోకు. అన్నం మీద ఎందుకు అలుగుతున్నావు అంటే.. ఆయనకు నాకు సంబంధం ఏంటి. అసలు ఆయన నా రూమ్ లోకి ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. దీంతో తులసి అంటే.. చచ్చిపోయింది. మా అమ్మతో పాటే తులసి కూడా చచ్చిపోయింది. మీ అందరి ముందు నిలబడింది.. బతికి ఉన్న శవం.. దాన్ని కూడా చంపేస్తారా అని ప్రశ్నిస్తుంది తులసి. పాపం వాడు చాలా బాధపడుతున్నాడు. జరిగిన దానికి నీ కాళ్లు కూడా పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అంటాడు పరందామయ్య. దీంతో ఆయన కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం కావడం ఇవాళేమీ కొత్త కాదు. ఆయన గత 30 ఏళ్ల నుంచి ఇలాగే చేస్తున్నారు. వంద ఏళ్లకు సరిపడ గుండెకోతను ఇచ్చారు. నేను ఎవ్వరి మాట వినను. నన్ను క్షమించండి మామయ్య. మా అమ్మను చంపిన ఆ హంతకుడిని సపోర్ట్ చేస్తూ ఎవరు ఏం చెప్పాలని చెప్పినా నేను వినను అంటుంది తులసి. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అంటే.. అదే నేను చేస్తున్న తప్పు. ఆ తప్పు వల్లే ఆ పెద్దమనిషికి నేను అలుసు అయిపోయాను. ఆ కారణంగానే ఈరోజు మా అమ్మను పోగొట్టుకున్నాను అంటుంది తులసి. ఇంత జరిగినా కూడా ఈ ఇల్లు వదిలి నేను ఎందుకు వెళ్లడం లేదు తెలుసా? అత్తయ్య కోసం, మీ కోసం. నా జీవితం ముగిసిపోతున్నా మిమ్మల్ని మాత్రం వదులుకోను మామయ్య అంటుంది తులసి.
మీరు కష్టకాలంలో నన్ను కన్నకూతురుగా చూసుకున్నారు. మీ రుణం తీర్చుకుంటాను మామయ్య అంటుంది తులసి. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తులసి దృష్టిలో ఎంతగా దిగజారిపోయావో అర్థమయిందా నందు. తన మనసులో నీ స్థానం ఏంటో తెలుసుకో. దాన్ని బట్టి మసులుకో. ఇది నా మాట మాత్రమే కాదు.. మీ అమ్మ మాట కూడా అని చెప్పి పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు.
కట్ చేస్తే రాజ్యలక్ష్మి దీనంగా కూర్చొని ఉంటుంది. అక్కడికి వెళ్లిన బసవయ్య, ఆయన భార్య మేము మీ ఇంట్లో కరివేపాకు లాంటి వాళ్లం. దివ్య గురించి తెలుసు కదా. ఆమె మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెబుతారు. ఆ విక్రమ్ గాడు నా వైపు ఉండాలి. చెప్పు కింద తేలులా పడి ఉండాలి అంటుంది రాజ్యలక్ష్మీ. విక్రమ్ జానులు కలిసి ఏడు అడుగులు ఎప్పుడు వేస్తారో అని అంటాడు బసవయ్య. నువ్వు ఇంటికి తిరిగి వచ్చావని విక్రమ్ కు తెలిసిందా అని అడిగితే.. దివ్యకు కాల్ చేశాను అని చెబుతుంది రాజ్యలక్ష్మి. మరి వాడు తిరిగి కాల్ చేయలేదా అంటే చేయలేదు అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో విక్రమ్ వస్తాడు. వచ్చావా అల్లుడు అంటారు.
విక్రమ్ రాగానే నాటకం స్టార్ట్ చేస్తుంది తులసి. ఏంటి నాన్న బక్కచిక్కిపోయావు.. నా మీద బెంగ పెట్టుకున్నావా? అంటే వాడికి టైమ్ ఎక్కడ ఉంది.. రిసార్ట్ లు తిరగడం అదే కదా అంటే… మామయ్య ఇప్పుడు అవన్నీ ఆపుతావా అంటాడు విక్రమ్.
నందు చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ నేను ఏం చేయను. నా కడుపు తీపి నన్ను వెనక్కి లాగేస్తోంది అని పరందామయ్యతో అంటుంది అనసూయ. మళ్లీ మనకు గడ్డు రోజులు మొదలయ్యాయి అంటుంది అనసూయ. మరోవైపు తులసి దగ్గరికి వెళ్లి తనను గట్టిగా హత్తుకుంటుంది దివ్య. ఇంతలో లాస్య తులసి ఇంటికి వస్తుంది. సీఈవో అయినప్పటి నుంచి తులసి రేంజ్ పెరిగిందట. తన మీద ఈగ కూడా వాలకుండా చేస్తున్నావట అని నందును అడుగుతుంది లాస్య. దీంతో తులసికి సాయం ఉండటం, కంపెనీ విషయాలను చూసుకోవడం నా బాధ్యత అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.