Guppedantha Manasu 22 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 22 నవంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 927 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహీంద్రా.. అనుపమ మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. రిషి అక్కడికి వెళ్లి ఏంటి డాడ్ ఏం ఆలోచిస్తున్నారు అంటాడు. దీంతో ఏం లేదు అంటాడు. అనుపమ మేడమ్ ను ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు. తనతో వెళ్లి మాట్లాడండి అంటే.. నేను మాట్లాడలేను అంటాడు మహీంద్రా. అయితే.. వెళ్లిపోమని చెప్పండి అంటే.. వద్దు వద్దు అంటాడు మహీంద్రా. మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నారు అంటే.. అవును రిషి.. మాది మాములు ఫ్రెండ్ షిప్ కాదు. ఆ రోజు మళ్లీ రావులే అంటాడు మహీంద్రా. తనతో మాట్లాడాలని ఉంది కానీ.. తను అడిగే ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేను అంటాడు మహీంద్రా. ఆవిడ అమ్మ బతికి ఉన్నప్పుడే మన జీవితాల్లోకి వస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి అంటాడు రిషి. కొంచెం నార్మల్ అవ్వండి డాడ్. ఆమెతో నార్మల్ గా మాట్లాడండి. మనల్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్లను ఎందుకు దూరం చేయాలి చెప్పండి అంటాడు రిషి. తను ఏం చేస్తుంది అంటే.. వెళ్లి మీరే చూడండి అంటాడు రిషి. ఆ తర్వాత వసుధారతో మాట్లాడుతుంది అనుపమ. నువ్వు జగతి ప్రియ శిష్యురాలివా అంటే అవును మేడమ్ అంటుంది. డీబీఎస్టీ కాలేజీకి నువ్వు ఎండీవి అట కదా. ఇంత చిన్న వయసులోనే ఆ స్టేటస్ కు వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది అనుపమ.
దీంతో నేను రాలేదు మేడమ్.. ఎండీ సీటులో నన్ను రిషి సార్ కూర్చోబెట్టారు అంటుంది వసుధార. నీకంటే ముందు ఆ ఎండీ సీటులో ఎవరు కూర్చున్నారు అంటే.. జగతి మేడమ్ అంటుంది వసుధార. నేను జగతి మేడమ్ ప్లేస్ ను భర్తీ చేయలేను మేడమ్ అంటుంది వసుధార. దీంతో అవును.. జగతి ప్లేస్ ను నువ్వు కాదు.. ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అంటుంది వసుధార. అవును.. నువ్వు డబ్బు, హోదా ఈ రెండింట్లో దేనికి ప్రాముఖ్యత ఇస్తావు అంటే.. ఆ రెండింటి కంటే ప్రేమకు ప్రాముఖ్యత ఇస్తాను మేడమ్ అంటుంది వసుధార. మేడమ్ మీరు నా గురించి ఏం అనుకున్నా పర్వాలేదు కానీ.. మీరు మా జగతి మేడమ్ ఫ్రెండ్ కాబట్టి జగతి మేడమ్ ను ఎలా చూస్తానో.. మిమ్మల్ని కూడా అలాగే చూస్తాను అంటుంది వసుధార. ఇంతలో మహీంద్రా వచ్చి వసుధార.. భోజనానికి అన్నీ సిద్ధం చేయండి అంటాడు మహీంద్రా. దోసకాయ పచ్చడి చేయి.. అనుపమకు చాలా ఇష్టం అంటాడు. మిరపకాయ బజ్జీలు చేయి అవి మీ మామయ్యకు చాలా ఇష్టం అంటుంది అనుపమ.
కట్ చేస్తే ధరణి ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన శైలేంద్ర.. ఇంకా పని అయిపోలేదా అని అడుగుతాడు. దీంతో లేదండి అంటుంది. టైమ్ చూసుకున్నావా అంటే టైమ్ తో నాకేం పని అంటుంది ధరణి. నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ధరణి. నాకు చాలా బాధగా ఉంది. నిన్ను చాలా కష్టపెడుతున్నాను కదా అంటాడు శైలేంద్ర. మీరేం బాధపడకండి.. ఈ పనులన్నీ నాకు అలవాటే అంటుంది ధరణి. తనకు ఏదో గిఫ్ట్ తీసుకొస్తాడు. శైలేంద్ర తనకు గిఫ్ట్ తీసుకురావడం చూసి షాక్ అవుతుంది ధరణి. అసలు శైలేంద్ర చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోతుంది ధరణి.
అనుపమ, మహీంద్రా ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ జగతిని గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ల చిన్ననాటి మెమోరీస్ ను గుర్తు చేసుకుంటారు. రిషి.. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు. సరే మీరు తినండి అంటాడు మహీంద్రా. అందరూ కలిసి సరదాగా కూర్చొని భోం చేస్తుంటారు.
ఆ తర్వాత తాను ఒంటరిగానే ఉన్నానని.. పెళ్లి చేసుకోలేదని చెబుతుంది అనుపమ. కానీ.. మీ మేడమ్ పెళ్లి చేసుకొని ఒంటరిగా ఉంది అని చెబుతుంది అనుపమ. దీంతో మహీంద్రాకు కోపం వస్తుంది. అనుపమ నువ్వు మళ్లీ రాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మేడమ్.. డాడ్ అలాగే అంటాడు. కానీ మీరు మాత్రం వస్తూనే ఉండండి అంటే.. నేను ఎవ్వరు వద్దన్నా వస్తూనే ఉంటాను. నువ్వు అన్నావు కదా.. మీ డాడీని ఆ బాధల్లో నుంచి బయటికి తీసుకురమ్మని. ఖచ్చితంగా ఆ పని చేస్తాను.. అని చెప్పి అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.