Intinti Gruhalaxmi 28 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. నవంబర్ 28, 2023, మంగళవారం ఎపిసోడ్ 1113 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొంగను పట్టుకొని ఎక్కడుంది గోల్డ్ లాకెట్ అంటే.. కప్ బోర్డ్ లో అంటాడు దొంగ. దీంతో బసవయ్య, ఆయన భార్య షాక్ అవుతారు. అక్కడ ఏముంటుంది. మీకు శ్రమెందుకు నేను తెస్తాను అంటాడు బసవయ్య. కానీ.. దివ్య మాత్రం ఎందుకు అలా.. అందరి ముందే అందులో ఏముందో చూద్దామని చెప్పడంతో బసవయ్య బావ కప్ బోర్డ్ ను ఓపెన్ చేస్తాడు. అందులో కట్టలకు కట్టలుగా డబ్బులు ఉంటాయి. వాటిని చూసి ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. నీ రూమ్ లో ఇంత డబ్బు ఎక్కడిది అని అడుగుతాడు. దీంతో అక్కయ్య రూమ్ లో ప్లేస్ లేదని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంటాడు. కానీ.. విక్రమ్ అస్సలు వినడు. దొంగ లెక్కలు రాసి డబ్బులు నొక్కేశావా? అంటారు. దేవత లాంటి అత్తయ్య గారిని మోసం చేశారు మీరు. ఇలాంటి దగాకోరు మీ మేనమామ అంటే నాకే ఒళ్లు కంపరంగా ఉంది అంటుంది దివ్య. ఇక అత్తయ్య గారికి ఎలా ఉందో. ఒంటి మీద తేళ్లు, జర్రీలు పాకినట్టుగా ఉంది. అంతే కదా అత్తయ్య అంటుంది దివ్య. ఏం చేయాలన్నా మేనమామ అనే బంధం అడ్డొస్తుంది. అయినా కూడా ఇంట్లో నుంచి తరిమేయాల్సిందే. కానీ.. జాను ముఖం చూసి ఆగిపోతున్నా. రేపటి నుంచి మీరు ఇంటి పని, తోట పని చేయాలి అంటాడు విక్రమ్. ఆ తర్వాత అందరూ బయటికి వెళ్లిపోతారు.
కట్ చేస్తే తెల్లవారుతుంది. నందు లేస్తాడు. అసలు రాత్రి ఏం జరిగింది. నేను తాగిన తర్వాత రాత్రి ఏం జరిగింది అనుకుంటాడు. వెళ్లి తన తల్లిదండ్రులను అడుగుతాడు. దీంతో రాత్రి నువ్వు ఏం చేశావో నీకు తెలియదా అంటారు. ఏం చేశాను అంటే.. రాత్రి నందు చేసిన విషయం మొత్తం చెబుతారు పరందామయ్య, అనసూయ. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి అంటాడు నందు. వెళ్లి తులసి కాళ్ల మీద పడు అంటుంది అనసూయ. దీంతో నందు తులసి దగ్గరికి వెళ్తాడు. తులసి కూడా కూర్చొని నందు గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తులసికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి తులసి వెళ్లిపోబోతుండగా తులసి అని తన చేయి పట్టుకుంటాడు. దీంతో తులసికి కోపం వస్తుంది. మూడు రోజుల క్రితం వరకు మన మధ్య స్నేహం ఉండేది. నిన్నటి వరకు నీ మీద కొద్దో గొప్పో గౌరవం ఉండేది. ఈరోజుతో అది కూడా పోగొట్టుకున్నారు అంటుంది తులసి. ఇంత జరిగినా కూడా ధైర్యంతో నా ముందు ఎలా నిలబడగలుగుతున్నారు అని అడుగుతుంది. దీంతో ముందే చెబుతున్నాను. మీ అమ్మ గారి విషయంలో నేను చేసింది తప్పే అంటాడు నందు.
మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా బిహేవ్ చేయడం తప్పు కాదా. రాత్రి తాగి వాగారు కాబట్టి నాకు నిజం తెలిసింది. లేకపోతే నన్ను ఇంకెన్నాళ్లు మోసం చేసేవాళ్లు అంటే.. ఇందులో మోసం ఏముంది తులసి అంటాడు నందు. నేను చేసిన తప్పేంటంటే డైవర్స్ ఇఛ్చి కూడా నీతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం. దాని వల్లే ఈ తలనొప్పులన్నీ. నేను మంచితనాన్ని చంపుకొని బతికి ఉంటే బాగుండేది. పిచ్చిదానిలా మీ ప్రతి కష్టంలోనూ, ప్రతి అవసరంలోనూ వెనుక నిలబడ్డాను. మీరు సహాయం చేస్తున్నా అనుకున్నాను కానీ.. నాకు నేను నష్టం చేసుకుంటున్నా అనుకోలేదు.
నా బుద్ధి గడ్డి తిని, నా కర్మ కాలి ఇలా చేశాను. దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న పాపానికి నా జీవితంలో పాతిక సంవత్సరాలు నష్టపోయాను. అక్కడితో లెక్క తీరిపిపోయింది. నా పాపం ముగిసిపోయింది అనుకొన్నా కానీ.. అదంతా నా భ్రమ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పటికీ మీరు నన్ను పట్టి పీడిస్తున్నారు అంటుంది. దీంతో నన్ను పరాయివాడిని చేసి మాట్లాడకు అంటే.. ఎస్.. పరాయి వాళ్లే అంటుంది తులసి. అత్తయ్య మామయ్య వళ్ల నేను ఆ తప్పు దిద్దుకోలేని పరిస్థితుల్లో ఉన్నా. చూడండి నందగోపాల్ గారు.. ఇక పొరపాటున కూడా నా పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడకండి. ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మీకు నాకు మంచిది అంటుంది తులసి.
మరోవైపు బసవయ్య, ఆయన భార్య ఇద్దరూ గార్డెన్ లో పని చేస్తూ ఉంటారు. కానీ.. వాళ్ల వల్ల కాదు. దీంతో రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్లి మా వల్ల కాదు. మేము ఇక్కడ ఉండలేం అంటారు. దీంతో చేసింది ఎదవ పని. మళ్లీ ఇలా మాట్లాడుతున్నారా? నా కళ్లు కూడా కప్పి నా వెనుక ఈ పని చేయడం ఏంటి. డబ్బు కావాలంటే నన్ను అడగాల్సింది కదా అంటుంది రాజ్యలక్ష్మి. ఈ ఇంట్లో తప్పదు. లేకపోతే ఇలాగే ఉంటుంది. వాడు మంచోడు కాబట్టి ఈ శిక్షతోనే సరిపెట్టాడు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చి ఉంటే అంటూ భయపెడుతుంది రాజ్యలక్ష్మి.
ఇంతలో అక్కడికి వచ్చిన దివ్య.. బాగుంది మీ డిస్కషన్. అక్క, తమ్ముడు ఇద్దరూ సరిపోయారు. మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయొచ్చా? కొడుకును మాయ చేసినట్టు నన్ను మాయ చేయడం కుదరదు అత్తయ్య అంటుంది దివ్య. దీంతో ఏం చేస్తావు అంటే.. నీ అసలు కొడుకు మీ తమ్ముడి ప్లేస్ లో ఉండేలా, మీ మరదలు ప్లేస్ లో మీరు ఉండేలా చేస్తా అంటుంది దివ్య. దీంతో రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది.
మరోవైపు లాస్య కారులో వెళ్తూ రాజుకు ఫోన్ చేస్తుంది. తులసి అంటూ తన క్యాబిన్ లోకి వెళ్తాడు నందు. దీంతో మేడమ్ అను అంటుంది. తనను ముట్టుకోబోగా వద్దు అని వారిస్తుంది. బార్ లో ఎవరితోనో సార్ గొడవ పెట్టుకున్నారట అంటూ రాజు ఆఫీసులో టామ్ టామ్ చేస్తాడు. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.