Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 6 Nov Monday Episode Highlights : రత్నప్రభ కోర్టు నోటీసు పంపిస్తే.. వాళ్ల కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వెళ్లి షాకిచ్చిన తులసి.. కంపెనీలను తన పేరు మీదికి మార్చుకుంటుందా?

Intinti Gruhalakshmi 6 Nov Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 6 నవంబర్ 2023, 1094 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య వాళ్ల అమ్మ తులసిని అందరూ అనుమానిస్తారు. తులసి ఆంటి దగ్గర ఎలాంటి క్లూ లేకున్నా ఎలా దివ్య ఎక్కడ ఉందో ఎలా కనుక్కుంది అంటూ అడుగుతుంది జాను. దీంతో ఏంటి విక్రమ్ ఇది.. జానుకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది అని ప్రశ్నిస్తుంది. మా అమ్మను నువ్వు అనుమానిస్తున్నావా అంటుంది. నాకు సమాధానం చెప్పడం వచ్చు కానీ.. మొహం మీద కొట్టినట్టు చెబుతాను. దానికి వాళ్లు ఫీల్ అవడం, వాళ్లు ఫీల్ అయ్యారని నువ్వు ఫీల్ అవడం, నువ్వు ఫీల్ అయ్యావని ఆ తర్వాత నేను ఫీల్ అవ్వడం అవసరమా.. వాళ్లకు నువ్వే సమాధానం చెప్పు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య. దీంతో విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. జాను.. నీకు తెలిసి నీ మనసులో పుట్టిన డౌట్స్ కావు ఇవి. ఎవరో రెచ్చగొడితే అడుగుతున్నావు. వెళ్లి తులసి అత్తతో కొన్ని రోజులు కలిసి ఉండు. అత్తయ్య మంచితనం ఏంటో తెలిసి వస్తుంది. అప్పుడు గానీ ఇలాంటి ప్రశ్నలు అడగవు అంటాడు విక్రమ్. మీరు అడిగే ప్రశ్నలు తప్పు కాకపోవచ్చు కానీ.. అడిగే విధానం తప్పు, అడిగే సమయం తప్పు అని అంటాడు విక్రమ్.

మరోవైపు రత్నప్రభ లీగల్ నోటీసులు పంపిస్తుంది. ఆ లెటర్ చూసి తులసి, నందు షాక్ అవుతారు. వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. హనీని వాళ్ల ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లారని రత్నప్రభ కేసు వేసింది. దానికి సంబంధించిన కోర్టు నోటీసులు అని చెబుతాడు. బెదిరించి ఏం చేయలేకపోయారు. అందుకే కేసు వేసి భయపెడదాం అనుకుంటున్నారు అని అంటుంది తులసి. మనం న్యాయ పోరాటం చేద్దాం. వెనక్కి తగ్గే అవకాశమే లేదు అని అంటుంది తులసి. మంచి లాయర్ ను చూడండి అని నందుకు చెబుతుంది తులసి. ఎందుకు తనను రెచ్చగొట్టడం అంటాడు నందు. తను కాల్ చేస్తుంటే కనీసం తన ప్లాన్ ఏంటో తెలుస్తుంది. అందుకే తను ఎందుకు కాల్ చేస్తుందో తెలుసుకుంటాను అని అంటాడు నందు. వచ్చే బోర్డ్ మీటింగ్ కల్లా కంపెనీ మొత్తం రత్న వాళ్ల చేతుల్లోకి వెళ్తుందట అంటాడు నందు. హనీ విషయంలో కేసు ఓడినా గెలిచినా మన ప్రయత్నం మనం చేద్దాం. కోర్టులో ఫైట్ చేద్దాం. కాకపోతే వాళ్ల ఆస్తి జోలికి, బిజినెస్ జోలికి వెళ్లొద్దు అంటాడు నందు. దీంతో అది సామ్రాట్ ది. వాళ్లకు హక్కు లేదు అంటుంది తులసి. మనం వాళ్ల జోలికి వెళ్లకుండా ఉందాం అంటాడు నందు.

Intinti Gruhalakshmi 6 Nov Monday Episode Highlights : దివ్యను ఓదార్చిన విక్రమ్

మనిద్దరి మధ్య  చిచ్చు పెట్టి మనల్ని విడగొట్టే వరకు జాను ఇక్కడే ఉంటుంది. ఇది పక్కా. రాసిపెట్టుకో అంటుంది దివ్య. దీంతో తను ఇదివరకు జాను కాదు. చాలా మారిపోయింది అంటాడు విక్రమ్. మారలేదు.. బుద్ధి మారి ఉంటే మా అమ్మ గురించి వంకరగా మాట్లాడటం ఎందుకు. నా కిడ్నాప్ అమ్మ చేయించిన డ్రామా అని తన ఉద్దేశమా? నీకు అలాగే అనిపిస్తోందా? అంటుంది దివ్య. అందుకే జానును సమర్థిస్తున్నావా అంటుంది.

నీ మాటలు ప్రవర్తన అలాగే ఉన్నాయి. నాకు కూడా నీ మీద అనుమానంగానే ఉంది అంటూ అక్కడికి ప్రత్యక్షం అవుతాడు తాతయ్య. దివ్య గురించి ఆలోచించు అంటాడు. ఇప్పుడు నేను చేస్తున్నది ఇదే కదా అంటాడు విక్రమ్. దీంతో ఇక్కడ కాదు.. తలుపులు మూసి బతిమిలాడుకో అంటాడు. కొన్ని రోజులు హనీమూన్ కి వెళ్లిరండి అంటాడు తాతయ్య.

మరోవైపు బోర్డు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. తన వ్యాపారాన్ని త్యాగం చేసి ముందుకు వచ్చారు ధనుంజయ్ గారు అని చెబుతుంది లాస్య. రిజల్యూషన్ పాస్ చేయడం మంచిది అని బోర్డు మెంబర్స్ తో చెబుతుంది లాస్య. దీంతో ఇంకో ముఖ్యమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రావాలి అంటారు. చూస్తే నందు, తులసి ఇద్దరూ వస్తారు. దీంతో ధనుంజయ్ ఆ ప్లేస్ లో నుంచి లేస్తాడు. తులసి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్లేస్ లో కూర్చుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.

Recent Posts

Naga Chaitanya Sobhita Dhulipala : మీడియాకి గుడ్ న్యూస్ చెప్పిన శోభిత‌.. పెళ్లై ఆరు నెల‌లు కాక‌ముందే ప్ర‌గ్నెంటా..?

Naga Chaitanya Sobhita Dhulipala : స‌మంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైత‌న్య.. శోభితని వివాహం చేసుకున్న విష‌యం…

10 minutes ago

Chanakyaniti : ఆ విషయంలో అస్సలు సిగ్గు పడొద్దు… ఒకవేళ పడితే తప్పదు భారీ నష్టం, మీ ఊహకే వదిలేస్తున్నా… అంటున్న చాణిక్య…?

Chanakyaniti : సాధార్నంగా కొన్ని విషయాలలో మహిళలే ఎక్కువగా సిగ్గు పడుతుంటారు. కానీ చాణిక్య నీతిలో చాణిక్యుడు స్త్రీలే కాదు,పురుషులు…

1 hour ago

Pan India Star : పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు..ఇప్పుడు గేట్ ముందు వాచ్ మెన్ గా మారాడు

Pan India Star  : సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కడం ఒక అదృష్టం. అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత సక్సెస్ ఉన్నంతకాలం…

2 hours ago

Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ కంటే పాకిస్తాన్…

3 hours ago

CM Revanth Reddy : కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ మాములు సెటైర్లు వెయ్యలేదుగా..!!

CM Revanth Reddy : తెలంగాణ Telangna CM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ…

4 hours ago

Horse Gram : మీరు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే… వీటిని తింటే చాలు ఆరోగ్యం రేసుగుర్రమేనట…?

Horse Gram : నిత్యం ఆరోగ్యంగా Health ఉండాలని ఎవరు కోరుకోరు. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరిక. కానీ ప్రస్తుత…

6 hours ago

Shahid Afridi : రక్తం మ‌రిగే వ్యాఖ్యలు చేసిన షాహిద్ ఆఫ్రిది.. భార‌తీయులు ఆగ్ర‌హం..!

Shahid Afridi : పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మంది అమాయక భారతీయుల మర‌ణాన్ని ఇంకా ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.…

7 hours ago