Jabardasth Faima Gets Married : జబర్దస్త్ ఫైమా పెళ్లి.. 9 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాఫ్.. ప్రియుడు ప్రవీణ్‌తో ఏడడుగులు!
ప్రధానాంశాలు:
Jabardasth Faima Gets Married : జబర్దస్త్ ఫైమా పెళ్లి.. 9 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాఫ్.. ప్రియుడు ప్రవీణ్‌తో ఏడడుగులు!
Jabardasth Faima Gets Married : బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన కమెడియన్, నటి జబర్దస్త్ ఫైమా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫైమా.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు కొనసాగిన ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంటూ ప్రియుడు ప్రవీణ్ నాయక్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ శుభవార్తను స్వయంగా ఫైమానే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అడ్డంకులు, విమర్శలు, అపార్థాలను ఎదుర్కొన్న ఈ జంట చివరకు ఒక్కటవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పటాస్ షో ద్వారా బుల్లితెరలో అడుగుపెట్టిన ఫైమా, తన ప్రత్యేకమైన కామెడీతో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, బిగ్‌బాస్ వంటి ప్రముఖ షోల ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
Jabardasth Faima Gets Married : జబర్దస్త్ ఫైమా పెళ్లి.. 9 ఏళ్ల ప్రేమకు ఫుల్ స్టాఫ్.. ప్రియుడు ప్రవీణ్‌తో ఏడడుగులు!
అయితే తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటపెట్టని ఫైమా.. కొంతకాలంగా ప్రవీణ్ నాయక్‌తో ప్రేమలో ఉన్న విషయం అభిమానులకు తెలిసిందే. వీరిద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ, తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.కుటుంబ, సామాజిక ఒత్తిళ్లు, విమర్శలు, నెగిటివ్ కామెంట్లు ఇలా అనేక సవాళ్లు ఎదురైనా.. ప్రేమపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగారు. చివరకు అన్ని అడ్డంకులను దాటుకుని సాదాసీదా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ ద్వారా జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
Jabardasth Faima Gets Married పెళ్లి అనంతరం ఫైమా సోషల్ మీడియాలో చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
“చాలామంది మా ప్రేమను అనుమానించారు. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించారు. అయినా ప్రేమే మమ్మల్ని బలంగా నిలబెట్టింది. ఎన్నో కష్టాలు, వేల కారణాలు ఉన్నా.. ప్రతి రోజూ ఒకరినొకరం ఎంచుకున్నాం. ఇప్పుడు భార్యాభర్తలమయ్యాం” అని ఫైమా పేర్కొంది. ఈ పోస్ట్‌కు ఆమె #FinallyMarried, #9YearsOfLove, #AgainstAllOdds, #ForeverStartsNow వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పెళ్లి వీడియో.. శుభాకాంక్షల వెల్లువ ఫైమా పంచుకున్న పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఫైమా.. ఎంతో సింపుల్‌గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. వీడియో విడుదలైన వెంటనే పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నటి శ్రీ సత్య హార్ట్, కిస్ ఎమోజీలతో పాటు “Congratulations” అంటూ కామెంట్ చేయగా, అదిరెడ్డి, అరియానా గ్లోరీ, భాను తదితరులు కూడా ఫైమా-ప్రవీణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “మీ ప్రేమ గెలిచింది”, “నిజమైన ప్రేమకు ఇదే నిదర్శనం”, “ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రేమ కోసం ఓర్పుతో ఎదురుచూసిన ఫైమా
ప్రముఖ టీవీ షోల ద్వారా కెరీర్‌లో విజయవంతమైన ఫైమా, వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ఓర్పుతో వ్యవహరించింది. ప్రేమ కోసం తొమ్మిదేళ్ల పాటు ఎదురుచూసి, చివరకు తన మనసుకు నచ్చిన వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫైమా పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, అభిమానులు ఈ జంట సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. తొమ్మిదేళ్ల ప్రేమను విజయవంతంగా పెళ్లి బంధంగా మార్చుకున్న ఫైమా-ప్రవీణ్ జంటకు సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.







