Karthika Deepam 2 February 23rd 2026 Episode: జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ పుట్టించిన దశరథ.. దీప కోసం కన్నీరు!

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 February 2026,8:30 am

Karthika Deepam 2 February 23rd 2026 Episode: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న కార్తీకదీపం 2 Karthika Deepam 2 సీరియల్ ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపుకు చేరుకుంది. ఫిబ్రవరి 23వ తేదీన ప్రసారమైన 601వ ఎపిసోడ్ వీక్షకులను ఉద్వేగానికి గురిచేయడమే కాకుండా, రాబోయే ట్విస్టులపై ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా దశరథ ప్రవర్తనలో వచ్చిన మార్పు, జ్యోత్స్న పడుతున్న టెన్షన్ ఈ ఎపిసోడ్‌కే హైలైట్.

Karthika Deepam 2 February 23rd 2026 Episode: జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ పుట్టించిన దశరథ.. దీప కోసం కన్నీరు!

Karthika Deepam 2 February 23rd 2026 Episode: జ్యోత్స్న, పారిజాతం గుండెల్లో దడ పుట్టించిన దశరథ.. దీప కోసం కన్నీరు!

Karthika Deepam 2 February 23rd 2026 Episode జ్యోత్స్న, పారిజాతంల అనుమానం – బయటకు వెళ్లే ప్రయత్నం

ఎపిసోడ్ ప్రారంభంలో, దాస్, దశరథలు కనిపించకపోవడంతో జ్యోత్స్న తీవ్ర ఆందోళనకు లోనవుతుంది. “నేను నీ మనవరాలిని అవునో కాదో తర్వాత సంగతి, ముందు దాస్‌ని ఆపాలి” అంటూ పారిజాతంతో గొడవ పడుతుంది. దీప, కార్తీక్ కూడా డ్యూటీకి రాకపోవడంతో ఏదో పెద్ద జరగబోతోందని జ్యోత్స్న పసిగడుతుంది. శివన్నారాయణ కళ్లు గప్పి బయటకు వెళ్లాలని ప్రయత్నించినా అది సాధ్యపడదు. దీంతో ఇంట్లోనే ఉండి ఏం జరుగుతుందో అని భయంతో ఎదురుచూస్తుంటారు.

Karthika Deepam 2 February 23rd 2026 Episode నిజం తెలుసుకున్న తండ్రి – దీపకు ఘనస్వాగతం

మరోవైపు గుడిలో దాస్ ద్వారా అసలు నిజం తెలుసుకున్న దశరథ, ఆవేశంతో ఉన్న తనను దీప ఆపుతుంది. సుమిత్రకు ఆపరేషన్ జరిగే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పవద్దని దశరథ దగ్గర ఒట్టు వేయించుకుంటుంది. దశరథ మనసు మారుతుంది, తనను ఇన్నాళ్లూ మోసం చేసిన దాస్‌ను క్షమిస్తాడు. అనంతరం దీప, కార్తీక్‌లతో కలిసి ఇంటికి వస్తాడు. కారు దిగుతున్న దీపకు దశరథ స్వయంగా డోర్ తీసి స్వాగతం పలకడం చూసి జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. “నా నిజమైన బిడ్డ నా ఇంట్లో పెట్టబోయే తొలి అడుగు ఇది” అని దశరథ మనసులో అనుకుంటూ దీపను సాదరంగా ఆహ్వానిస్తాడు.

జ్యోత్స్నపై దశరథ పరోక్ష విమర్శలు

దశరథ ముఖంలో కనిపిస్తున్న మార్పును చూసి జ్యోత్స్న వణికిపోతుంది. దశరథ తన పిన్ని పారిజాతాన్ని పిలిచి, “నా కూతురికి ఎర్రనీళ్లు (దిష్టి నీళ్లు) తీసుకురా” అని ఆర్డర్ వేస్తాడు. పారిజాతం జ్యోత్స్న కోసం అనుకుంటే, దశరథ మాత్రం దీప, కార్తీక్‌ల వైపు చూపిస్తాడు. శివన్నారాయణ కూడా ఈ మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా, నానమ్మ కంటే కన్నతల్లితో దిష్టి తీయించడం మేలని చెప్పి, సుమిత్రను పిలిపించి దీపకు దిష్టి తీయిస్తాడు. తన కన్నబిడ్డ అని తెలియకపోయినా సుమిత్ర ఎంతో ప్రేమగా దీపకు దిష్టి తీయడం, అది చూసి దశరథ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను కదిలిస్తుంది.

స్వీట్స్ ట్విస్ట్.. దాస్ ఎంట్రీపై ఉత్కంఠ!

పారిజాతంను స్వీట్స్ తీసుకురమ్మని చెప్పిన దశరథ, “నా కూతురికే స్వీట్ పెట్టు” అని అంటాడు. పారిజాతం కన్‌ఫ్యూజ్ అయి ఎవరికి పెట్టాలని అడిగితే, “నా ప్రాణాలను కాపాడుతున్న నా కన్నకూతురికే పెట్టు” అని బదులిస్తాడు. చివరకు జ్యోత్స్న నోట్లో స్వీట్ పెట్టినా, ఆయన మాటలు మాత్రం దీపను ఉద్దేశించినవే అని జ్యోత్స్న గ్రహిస్తుంది.

“దాస్ కూడా మన ఇంటికే వస్తున్నాడు” అని దశరథ చెప్పిన మాటతో జ్యోత్స్న, పారిజాతంలకు చమటలు పడతాయి. దాస్ వచ్చి నిజాన్ని అందరి ముందు బయటపెడితే తమ పరిస్థితి ఏంటని వారు వణికిపోతారు.

దీప-కార్తీక్ ఎమోషనల్ బాండింగ్

ఇంటి లోపల, దీప తన తండ్రికి నిజం తెలిసిందన్న ఆనందంతో కార్తీక్‌ను హత్తుకుంటుంది. “నాన్న ఈరోజు నాకు దేవుడిలా కనిపించారు” అంటూ తండ్రి ప్రేమను తలుచుకుని మురిసిపోతుంది. అయితే, తన కడుపులో ఉన్న బిడ్డను వదులుకుని తల్లిని కాపాడుకోవాలన్న రహస్యం తండ్రికి తెలిస్తే తట్టుకోలేరని కార్తీక్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తుంది. తల్లి ప్రాణం నిలవాలంటే ఈ త్యాగం తప్పదని కార్తీక్ ఆమెను ఓదారుస్తాడు. రాబోయే ఎపిసోడ్‌లో దాస్ అడుగుపెడితే జ్యోత్స్న నాటకం ముగుస్తుందా? లేదా దీప వేసిన ఒట్టు కోసం దశరథ మౌనంగా ఉంటాడా? అన్నది వేచి చూడాలి.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి