Karthika Deepam 2 March 21st 2026 Episode : కన్నబిడ్డను కోల్పోయి దీప కడుపుకోత.. జ్యోత్స్నకు కార్తీక్ మాస్ వార్నింగ్, నిజాన్ని బట్టబయలు చేయబోయిన దశరథ్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 March 2026,9:02 am

Karthika Deepam 2 March 21st 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 Serial రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుమిత్ర ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటం, అదే సమయంలో దీప తన కడుపులోని బిడ్డను కోల్పోవడం వీక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇక ఈరోజు (మార్చి 21) ఎపిసోడ్‌లో ఎన్నో ఊహించని పరిణామాలు, ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. కార్తీక్ ఇచ్చిన వార్నింగ్, దశరథ్ పడుతున్న మదనమే ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Karthika Deepam 2 March 21st 2026 Episode : కన్నబిడ్డను కోల్పోయి దీప కడుపుకోత.. జ్యోత్స్నకు కార్తీక్ మాస్ వార్నింగ్, నిజాన్ని బట్టబయలు చేయబోయిన దశరథ్!

Karthika Deepam 2 March 21st 2026 Episode : కన్నబిడ్డను కోల్పోయి దీప కడుపుకోత.. జ్యోత్స్నకు కార్తీక్ మాస్ వార్నింగ్, నిజాన్ని బట్టబయలు చేయబోయిన దశరథ్!

Karthika Deepam 2 March 21st 2026 Episode బిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న దీప.. ఓదార్చిన కార్తీక్

కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ అత్యంత భావోద్వేగంగా ప్రారంభమైంది. తన తల్లి సుమిత్ర ప్రాణాలను నిలబెట్టే క్రమంలో దీపకు చిన్న ఆపరేషన్ జరిగి కడుపులోని బిడ్డను కోల్పోతుంది. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక దీప ఒంటరిగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్.. దీపను చూసి చలించిపోతాడు. దీపను ఎలాగైనా ఓదార్చాలని ప్రయత్నిస్తాడు. “ఇక ఆ బొమ్మ అవసరం లేదు దీపా.. కొందరితో మనకు రుణం పుట్టుకతోనే తీరిపోతుంది. కానీ మన బిడ్డకు మాత్రం పుట్టకముందే ఆ రుణం తీరిపోయింది. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయ్” అని గుండెలు పిండేసేలా కార్తీక్ ఓదారుస్తాడు. కార్తీక్ మాటలకు దీప మరింత ఎమోషనల్ అవుతుంది.

Karthika Deepam 2 March 21st 2026 Episode పారిజాతం పచ్చి అబద్ధాలు.. భ్రమలో జ్యోత్స్న

మరోవైపు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న జ్యోత్స్న దగ్గరకు పారిజాతం వెళ్తుంది. జ్యోత్స్న ఎలా ఉందో పలకరిస్తుంది. తనకు అంతా అయోమయంగా ఉందని, తనకు ఆపరేషన్ ఎందుకు చేశారని జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్రకు నువ్వే సొంత కూతురివి కాబట్టి నీకే ఆపరేషన్ చేశారని పారిజాతం మభ్యపెడుతుంది. వెంటనే జ్యోత్స్న.. “దీప ఎక్కడ ఉంది? అసలు హాస్పిటల్‌కు వచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కడ ఉన్నావ్? దీప ఆపరేషన్ రూమ్ వైపు వచ్చిందా?” అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నిజం చెబితే జ్యోత్స్న తట్టుకోలేదని, తనను ఉతికి ఆరేస్తుందని భయపడిన పారిజాతం పచ్చి అబద్ధాలు ఆడుతుంది. “నేను దీప రూమ్ ముందే కాపలా ఉన్నాను. అది ఎక్కడికీ వెళ్లలేదు. ఇటు వైపు అస్సలు రాలేదు” అని చెబుతుంది. దీంతో జ్యోత్స్న.. దీప రాలేదంటే తనకే ఆపరేషన్ జరిగిందని, తానే సుమిత్ర నిజమైన కూతురిని అని తనలో తాను మురిసిపోతుంది. బావ వచ్చాడా అని జ్యోత్స్న అడగగా.. “కార్తీక్ వచ్చాడు. నన్నేమీ అనలేదు కానీ, శౌర్య దొరికిందని మాత్రం చిన్న హింట్ ఇచ్చాడు” అని పారిజాతం చెబుతుంది. దాంతో వాళ్ల ప్లాన్ బెడిసికొట్టిందని జ్యోత్స్న గ్రహిస్తుంది.

జ్యోత్స్న, పారిజాతాలకు కార్తీక్ మాస్ సెటైర్లు.. స్వీట్ వార్నింగ్!

ఇదే సమయంలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న, పారిజాతాలను చూసి తనదైన శైలిలో సెటైర్లు పేలుస్తాడు. “పెద్ద మేడమ్ గారు తల్లి కోసం చేసిన త్యాగాన్ని మీడియా ముందు పెట్టి ఘనంగా సన్మానించాలని ఉంది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక తల్లి కోసం కన్నకూతురు చేసిన త్యాగం అని పెద్ద హెడ్డింగ్స్ పెట్టి నాలుగైదు పేజీల ఆర్టికల్స్ రాయించేస్తాను. అరగంట పాటు నీ గొప్పదనం గురించి ప్రసంగం కూడా ఇస్తాను” అని కార్తీక్ వ్యంగ్యంగా అంటాడు. దీంతో జ్యోత్స్న, పారిజాతాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. “ఒక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. శౌర్య నా కూతురు! నా కూతురిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు చేసే ప్రతి కుట్రకు నా దగ్గర కౌంటర్లు రెడీగా ఉంటాయి. త్వరగా కోలుకోండి.. పరిగెత్తడానికి మీకు ఓపిక ఉండాలి కదా” అని వారికి చెమటలు పట్టేలా స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.

సుమిత్ర సేఫ్.. దీపను నిందించిన పారిజాతం

ఇక డాక్టర్ హారిక వచ్చి కుటుంబ సభ్యులందరికీ ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. సుమిత్ర గారు సేఫ్ అని, ఆమెకు ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతుంది. దశరథ గారి కూతురు చేసిన త్యాగం వల్లే ఆమెకు ప్రాణదానం జరిగిందని అంటుంది. ఇదంతా విన్న పారిజాతం.. జ్యోత్స్ననే సుమిత్రను కాపాడిందని సంబరపడుతుంది. దీప ఎక్కడ ఉందని దశరథ అడగగా.. పారిజాతం వెంటనే ఫైర్ అవుతుంది. “ప్రాణాలు కాపాడిన జ్యోత్స్నను వదిలేసి ఆ దీప గురించి ఎందుకు అడుగుతున్నావ్?” అని విరుచుకుపడుతుంది. దీపకు కూడా ఆపరేషన్ జరిగిందని కార్తీక్ చెప్పగా.. “కడుపులో బిడ్డను మోయలేక కావాలనే దించేసుకున్న ఆ రౌడీ ముఖం చూడటం కూడా పాపమే” అని పారిజాతం నోరు పారేసుకుంటుంది. ఈ మాటలకు దశరథ, దాస్ తీవ్ర ఆగ్రహానికి గురవుతారు. శివన్నారాయణ వాళ్లను శాంతింపజేస్తాడు. “తప్పొప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. లేదంటే ఇప్పుడే తాతయ్య ముందు శౌర్య కిడ్నాప్ టాపిక్ తీసి అన్నీ తేల్చుకుందామా?” అని కార్తీక్ అనడంతో పారిజాతం భయపడి సైలెంట్ అయిపోతుంది.

దీపను చూసి కన్నీరుమున్నీరైన దశరథ్.. తాతయ్యకు అనుమానం!

ఎవరి మాటలు పట్టించుకోకుండా దశరథ్ తిన్నగా దీప ఉన్న గదిలోకి వెళ్తాడు. దీపను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాడు. “నీ తల్లిని నువ్వు కాపాడుకున్నావు.. కానీ నీ తండ్రిగా నీ బిడ్డను నేను కాపాడుకోలేకపోయాను” అని మనసులో కుమిలిపోతాడు. సుమిత్ర బతికిందంటే అది కేవలం దీప త్యాగం వల్లే అని, ఏ కూతురైనా ఇలాంటి త్యాగం చేస్తుందా అని బాధపడతాడు. దశరథ్ మాటలకు కార్తీక్.. “ఏది ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ దేవుడికే తెలుసు మావయ్య.. అంతటితో సరిపెట్టుకోవాలి” అని చెబుతాడు. అయితే దశరథ్ ప్రవర్తనను మొదటి నుంచి గమనిస్తున్న శివన్నారాయణకు తీవ్ర అనుమానం వస్తుంది. అక్కడికి వచ్చి.. “నువ్వు ఎందుకు ఇలా తప్పు చేసిన వాడిలా మాట్లాడుతున్నావ్? వీళ్లేదో ప్రాణం వదిలేయడానికి వచ్చినట్లు నీ ప్రవర్తన ఏంటి?” అని నిలదీస్తాడు. “కొన్ని త్యాగాలు గుర్తింపుకు నోచుకోవు నాన్న” అని దశరథ్ గట్టిగా అంటాడు. మావయ్య ఎమోషన్‌లో నిజం ఎక్కడ బయటపెట్టేస్తాడో అని కార్తీక్ భయపడతాడు.

స్పృహలోకి వచ్చిన సుమిత్ర.. అబద్ధం చెప్పిన కార్తీక్

ఇంతలో నర్స్ వచ్చి సుమిత్రకు స్పృహ వచ్చిందని చెప్పడంతో అందరూ అక్కడికి పరుగులు తీస్తారు. కళ్లు తెరిచిన వెంటనే సుమిత్ర.. “నేను బతికేశాను. నా కూతురే నన్ను కాపాడింది. నా జ్యోత్స్న ఎలా ఉంది?” అని అడుగుతుంది. దీప పరిస్థితి ఎలా ఉందని కూడా అడుగుతుంది. అయితే దీపకు బిడ్డ పోయిన విషయాన్ని కార్తీక్ దాచేస్తాడు. సుమిత్రకు నిజం తెలిసి తట్టుకోలేదని, అంతా బాగుందని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి జ్యోత్స్నను ఎటూ కదలనివ్వకండి అని చెప్పడంతో అందరూ జ్యోత్స్నను చూసేందుకు వెళ్తారు.

తరువాయి భాగంలో ఏం జరగబోతోంది?

దీప చేసిన త్యాగం సుమిత్రకు ఎప్పుడు తెలుస్తుంది? తన కూతురు జ్యోత్స్న కాదని, దీప అని తెలిసినప్పుడు సుమిత్ర ఎలా రియాక్ట్ అవుతుంది? జ్యోత్స్న, పారిజాతాల కిడ్నాప్ నాటకాన్ని కార్తీక్ అందరి ముందు ఎలా బయటపెట్టబోతున్నాడు? ఈ ఆసక్తికరమైన అంశాలు రాబోయే ఎపిసోడ్లలో ఉత్కంఠను రేకెత్తించనున్నాయి.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి