
Karthika Deepam 2
Karthika Deepam 2 : బుల్లితెరపై కార్తీక దీపం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెగ నచ్చేయడంతో ఇందులోని పాత్రలని కూడా చాలా ఓన్ చేసుకున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం కార్తీక దీపం సీరియల్‌కి పులిస్టాప్ పెట్టిన మేకర్స్ ఇప్పుడు దీనికి సీక్వెల్ ట్రెండ్ తీసుకొస్తున్నారు. కార్తీక దీపం2 మార్చి 25 నుండి ప్రసారం అవుతుండగా, దీనికి సినిమా స్టైల్‌లోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. అయితే కార్తీక దీపంలో డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు, వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్‌కు ,విలన్‌గా మోనిత పాత్ర లో అద్భుతంగా నటించిన శోభా శెట్టి కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే సీక్వెల్‌లో పలు మార్పులు చోటు చేసుకోగా, విలన్ పాత్ర అయిన మోనితగా శోభా శెట్టి కాకుండా మరో అమ్మాయి నటిస్తుంది.
కార్తీక దీపం సీరియల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కార్తీక దీపం నవ వసంతం’లో లేడీ విలన్‌గా గాయత్రి సింహాద్రి ఎంపికయ్యింది. ఆమె ఇప్పటికే పలు సీరియల్స్‌లో నటించింది. అలానే యాంకర్‌గా కూడా బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ‘త్రినయని’ సీరియల్‌లో కసిగా విలనిజం పండించిన గాయత్రి సింహాద్రి.. యాంకర్‌గా సూపర్ ఫ్యామిలీ, జోష్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా చేసింది. ఇక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా గాయత్రి సింహాద్రికి మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 42.9 K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక కార్తీకదీపం 2 సీరియల్ తరవాత.. ఈమె క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లడం ఖాయం అని చెబుతున్నారు. కార్తీక దీపంలో విలన్ పాత్రకి మోనిత అనే పేరు ఫిక్స్ చేయగా, ఇప్పుడు కార్తీక దీపం 2లో జోష్న అనే పేరు విలన్ పాత్రకి ఫిక్స్ చేశారు.
ఇప్పుడు జోష్న పాత్రలో గాయత్ని సింహాద్రి నటిస్తుంది. ఈమె పాత్రకి చాలా మంది ఆకర్షితులం కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక కార్తీక దీపం సీక్వెల్ విషయానికి వస్తే.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన చెల్లమ్మ సీరియల్ కు రీమేక్ గా చేస్తున్నారు. చెల్లమ్మ సీరియల్ వెర్షన్ లో అయితే.. జోష్న కార్తిక్ ను ఇష్టపడుతుంది. కార్తీక్ మాత్రం జోష్నను ఇష్టపడడు. అంటే మళ్ళీ దీపకు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఈ సీరియల్ ఎన్నాళ్లపాటు సాగుతుందో, ఎంత రేటింగ్ సంపాదిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే జోష్న పాత్ర చేస్తున్న గాయత్రి సింహాద్రి చాలా హాట్ కూడా. ఆమె సోషల్ మీడియాలో కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంటుంది.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.