
#image_title
Marriage : బంధుమిత్రుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఓ పేళ్లి వేడుక జరుగుతుంది. కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరూ నవ దంపతులను ఆశీర్వదించేందుకు పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి పీటలపై వరుడు వధువు కూర్చుని ఉన్నారు. పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా మరికొద్ది సేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టబోతున్నాడు. ఇంతలోనే సినిమా లెవల్ లో పెళ్లి ఆపండి అంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి సినిమా కథ చెబుతున్నాడు అనుకుంటున్నారా..?అసలు కాదండి ఇది రియల్ స్టోరీ.. అవును మీరు వింటున్నది నిజమే. అయితే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వరుడు తనని మోసం చేసి మరో యువతుతో పెళ్లి చేసుకుంటున్నాడని ఓ యువతి వరుడుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిలవని పెళ్లికి పోలీసులు అతిథులుగా రావాల్సి వచ్చింది. దీంతో వధువు తల్లిదండ్రులు బంధుమిత్రులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ల కోటకు చెందిన మహేంద్ర నాయుడుకి కర్నూల్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇక వీరి పెళ్లి ముహూర్తం ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటలకు బ్రహ్మగుండం క్షేత్రంలో చేయాలి అనుకున్నారు. అయితే పెళ్లి పొద్దున్నే కావడంతో కుటుంబ సభ్యులంతా రాత్రికి అక్కడికి చేరుకున్నారు. ఇక పొద్దు పొద్దున్నే పెళ్లి తతంగం అంతా ప్రారంభమైంది. మరి కాసేపట్లో వరుడు మహేంద్ర నాయుడు వధువు మెడలో తాళి కట్టబోతున్నాడు అనంగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోయింది. అయితే వరుడు మహేంద్ర నాయుడు ఓ అమ్మాయిని మోసం చేశాడని ఫిర్యాదు ఇవ్వడం, అంతేకాక వారిద్దరు దిగిన ఫోటోలను పోలీసులకు చూపించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ బాధితురాలు ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి వాసి అని తెలుస్తోంది. ఇక బాధితురాలు చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాకు గతంలోనే పెళ్లయింది.
పెళ్లయిన 6 నెలలకే మనస్పర్దాల కారణంగా భర్తతో విడిపోయాను. ఆ సమయంలోనే మహేంద్ర నాయుడు నాకు ఇన్-స్టా లో పరిచయం అయ్యాడు. అతను వైజాగ్ లో పని చేసేవాడు. మేమిద్దరం గత ఆరేళ్లుగా రిలేషన్ లో కొనసాగుతున్నాము. అయితే కొన్ని గొడవలు కారణంగా నేను అతడిని దూరం పెట్టాను. ఆ సమయంలో మహేంద్ర నాయుడు నేను నిన్నే ప్రేమించాను, నువ్వు లేకపోతే నేనులేను ,నువ్వంటే ప్రాణం, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ నా ఫ్యామిలీ దగ్గరికి కూడా వచ్చి చెప్పాడు. అతని మాటలు నిజమేనని నేను నమ్మాను. నాకు తల్లిదండ్రులు కూడా లేరు. అయితే నా దగ్గరకు ఈనెల 19న వస్తానని చెప్పిన మహేంద్ర నాయుడు రాలేదు. నాకు డౌట్ వచ్చి వేరే వాళ్ళను ఆరా తీస్తే అతనికి పెళ్లి కుదిరింది అని తెలిసింది. ఏం చేయాలో దిక్కు తోచక వెంటనే పోలీసులను ఆశ్రయించినట్లుగా బాధితురాలు తెలియజేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కర్నూల్ పోలీసులు పెళ్లిని ఆపేశారు. అయితే బాధితురాలతో మహేంద్ర నాయుడు దిగిన ఫోటోలను ప్రూఫ్స్ గా ఆమె అందరికీ చూపించింది. అంతేకాక పలుసార్లు అబార్షన్ కూడా చేపించుకున్నట్లుగా ఆమె తెలియజేసింది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.