Karthika Deepam 2 Today 06 March 2026 Episode: బిడ్డ ప్రాణాలా? దీప ప్రాణాలా? జ్యోత్స్నకు డాక్టర్ హారిక దిమ్మతిరిగే కౌంటర్.. గుండెలు పిండేసే ట్విస్ట్!

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 6 March 2026, 8:42 am

Karthika Deepam 2 Today 06 March 2026 Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ ప్రేక్షకులను అడుగడుగునా ఉత్కంఠకు గురిచేస్తోంది. రోజుకో కొత్త మలుపుతో, ఎమోషనల్ సీన్స్‌తో కట్టిపడేస్తోంది. ముఖ్యంగా మార్చి 6వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా సాగింది. డాక్టర్ హారికను కలిసి నిజాలు రాబట్టాలని చూసిన జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మరోవైపు దీప, ఆమె కడుపులోని బిడ్డ ప్రాణాల గురించి కార్తీక్ చెప్పిన నిజం కాంచనతో పాటు ఇంట్లో వాళ్లందరినీ కుదిపేసింది.

Karthika Deepam 2 Today 06 March 2026 Episode: బిడ్డ ప్రాణాలా? దీప ప్రాణాలా? జ్యోత్స్నకు డాక్టర్ హారిక దిమ్మతిరిగే కౌంటర్.. గుండెలు పిండేసే ట్విస్ట్!

Karthika Deepam 2 Today 06 March 2026 Episode: బిడ్డ ప్రాణాలా? దీప ప్రాణాలా? జ్యోత్స్నకు డాక్టర్ హారిక దిమ్మతిరిగే కౌంటర్.. గుండెలు పిండేసే ట్విస్ట్!

Karthika Deepam 2 Today 06 March 2026 Episode ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే: జ్యోత్స్నకు డాక్టర్ హారిక కౌంటర్

కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఎపిసోడ్ ప్రారంభంలో.. జ్యోత్స్న నేరుగా డాక్టర్ హారికను కలవడానికి వెళుతుంది. తన తల్లి కాంచనకు తానే బోన్ మ్యారో డొనేట్ చేయాలని, అసలు ఈ ప్రొసీజర్ ఎప్పుడు మొదలుపెడతారని అడుగుతుంది. అయితే, జ్యోత్స్న కుట్రలు ముందే తెలిసిన డాక్టర్ హారిక.. జ్యోత్స్నతో రివర్స్ మైండ్ గేమ్ ఆడుతుంది. “ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే.. ఫేక్ ఎప్పుడూ ఫేక్” అంటూ పరోక్షంగా జ్యోత్స్న నిజమైన కూతురు కాదన్న విషయాన్ని ఎత్తి చూపుతుంది. ఫేక్‌ను ఒరిజినల్ అని ఎంత నమ్మించినా.. కొంతమంది నమ్ముతున్నట్లు నటిస్తారని, అది కేవలం సరైన సమయం కోసమేనని హారిక చెప్పడంతో జ్యోత్స్న మైండ్ బ్లాక్ అవుతుంది. తన రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం వెనుక ఏదో పెద్ద డ్రామా జరుగుతోందని జ్యోత్స్నకు క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా, గర్భవతులు బోన్ మ్యారో ఇవ్వొచ్చా? అని జ్యోత్స్న అడిగిన ప్రశ్నకు హారిక షాక్ అవుతుంది. డాక్టర్ సమాధానం చెప్పకుండా అక్కడినుంచి వెళ్లిపోవడంతో, ఈ గేమ్ వెనుక ఎవరున్నారో తేల్చుకోవాలని జ్యోత్స్న ఫిక్స్ అవుతుంది.

Karthika Deepam 2 Today 06 March 2026 Episode తల్లీబిడ్డల్లో ఒకరికే అవకాశం.. కాంచన ఆగ్రహం

ఇంట్లో వాతావరణం అంతా తీవ్ర విషాదంగా మారుతుంది. దీప వల్ల బిడ్డకు, బిడ్డ వల్ల దీపకు.. ఇద్దరికీ ప్రాణాపాయం ఉందని, ఇద్దరిలో ఒకరినే కాపాడుకునే పరిస్థితి ఉందని కార్తీక్ బాంబ్ పేలుస్తాడు. ఈ మాట విన్న కాంచన గుండె పగిలినంత పనవుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ దీప చేసిన పనులే కారణమని కాంచన తీవ్రంగా మండిపడుతుంది. “నా మాట వినకుండా ఆరోజు పుట్టింటికి పనికి వెళ్లింది. నేను ఎంత చెప్పినా వినకుండా తలపొగరుతో వ్యవహరించింది. ఈ దీప నాకు ఏ ఆనందాన్నీ మిగల్చలేదు” అంటూ కాంచన కన్నీరుమున్నీరు అవుతుంది. ఎంత ఖర్చయినా ఇద్దరినీ కాపాడుకుందామని శివన్నారాయణ అంటే.. డబ్బుతో చేయగలిగేది ఏమీ లేదని దశరథ్ నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. ఇదే సమయంలో అనసూయ మాట్లాడుతూ.. “దీపకు జీవితంలో ఏ చిన్న ఆనందం వచ్చినా అది దూరమైపోతుంది. దీని జాతకమే అంత” అంటూ బాధపడుతుంది. దీపను అందరూ తప్పుబట్టడం చూసి దశరథ్ తట్టుకోలేకపోతాడు. “ఏ తల్లైనా తన బిడ్డను దూరం చేసుకోవాలని అనుకుంటుందా? దాన్ని ఎవరూ అర్థం చేసుకోరా?” అంటూ దీపకు సపోర్ట్‌గా మాట్లాడతాడు.

దీప ఉన్నా లేనట్టే.. గుండెను పిండేసే సీన్

ఆసుపత్రికి వెళ్లే ముందు దీప.. కాంచన ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె కాళ్ల దగ్గర కూర్చుంటుంది. కానీ కాంచన మనసు కరగదు. “నా మాట వినకపోవడం వల్లే దీప ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఒకవేళ బిడ్డకు ఏమైనా జరిగితే.. నేను దీపను నా జీవితంలో క్షమించను. నా వరకు దీప అనే మనిషి ఉన్నా లేనట్లే” అని కాంచన చాలా కఠినంగా చెబుతుంది. ఆ మాటలకు దీప గుండె ముక్కలవుతుంది. అయినా సరే, కాంచన తన చేతిని తన తలపై పెట్టుకుని తానే ఆశీర్వదించుకుంటుంది. దీపను ఆసుపత్రికి తీసుకెళ్లే బాధ్యతను కాంచన.. దశరథ్ చేతుల్లో పెడుతుంది. “నా కోడలిని నీ కూతురు అనుకో. నా బిడ్డ కోసం ఇక్కడ చాలా ప్రాణాలు ఎదురుచూస్తున్నాయి. ఆ డాక్టర్‌తో మాట్లాడి బిడ్డను కాపాడు” అని ఎమోషనల్ అవుతుంది కాంచన. నలుగురు ఆసుపత్రికి వెళుతున్నారు, ఎంతమంది తిరిగి వస్తారో తెలియదని ఆమె ఏడుస్తుంటే చూసే ప్రేక్షకుల కళ్లు కూడా చెమరుస్తాయి.

అంతా దేవుడి రాతే.. కార్తీక్ ఓదార్పు

ఆసుపత్రికి వెళ్లే దారిలో దశరథ్ చాలా కుమిలిపోయి ఏడుస్తుంటాడు. అందరూ బిడ్డ గురించే ఆలోచిస్తున్నారు కానీ దీప గురించి ఆలోచించడం లేదని బాధపడతాడు. అప్పుడు కార్తీక్.. దశరథ్‌ను ఓదారుస్తాడు. “వాళ్లందరికీ నిజం తెలియక అలా బాధపడుతున్నారు. రేపు దీప.. సుమిత్ర అత్త కూతురే అని తెలిశాక ఇదంతా దేవుడు రాసిన రాత అని సరిపెట్టుకుంటారు. రేపు జనాభా లెక్కల వాళ్లు వస్తే.. నాకు ఒక్కతే కూతురు.. శౌర్య అని సగర్వంగా చెబుతాను” అని కార్తీక్ అభయం ఇస్తాడు. దీంతో ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఆసుపత్రిలో దీప ప్రాణాలు నిలుస్తాయా? లేక బిడ్డను కాపాడుకుంటారా? జ్యోత్స్న వేస్తున్న ప్లాన్స్ ఎలా బెడిసికొట్టనున్నాయి అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి