Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : దశరథకు షాకింగ్ నిజం చెప్పిన కార్తీక్.. జ్యోత్స్న నీ కూతురు కాదు.. నా అసలు కూతురు ఎవరు? ప్రశ్నించిన దశరథ

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 February 2026,8:30 am

Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న జ్యోత్స్న పుట్టుక రహస్యం ఎట్టకేలకు బద్దలైంది. ఫిబ్రవరి 19న ప్రసారమైన 598వ ఎపిసోడ్ Episode 598 లో కార్తీక్, దశరథకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అసలు ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : దశరథకు షాకింగ్ నిజం చెప్పిన కార్తీక్.. జ్యోత్స్న నీ కూతురు కాదు.. నా అసలు కూతురు ఎవరు? ప్రశ్నించిన దశరథ

Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : దశరథకు షాకింగ్ నిజం చెప్పిన కార్తీక్.. జ్యోత్స్న నీ కూతురు కాదు.. నా అసలు కూతురు ఎవరు? ప్రశ్నించిన దశరథ

Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : దశరథ నిలదీత.. కార్తీక్ సమాధానం

ఎపిసోడ్ ప్రారంభంలోనే దశరథ, కార్తీక్ ని నిలదీస్తాడు. “అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? అత్తకు ఆపరేషన్ చేయాలంటే జ్యోత్స్న శాంపిల్స్ ఎందుకు సరిపోవు?” అని ప్రశ్నిస్తాడు. దానికి కార్తీక్, “జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదు మామయ్య.. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు కాబట్టి” అని బాంబ్ పేలుస్తాడు. ఈ మాట వినగానే దశరథ షాక్ అవుతాడు. “ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్? నా భార్య ప్రసవించాక బిడ్డను మొదట ఎత్తుకుంది నేనే.. నా కళ్ల ముందే పెరిగింది కదా” అని ఆవేదన వ్యక్తం చేస్తాడు.

Karthika Deepam 2 Today 19 Feb 2026 Episode : బిడ్డల మార్పిడి వెనుక పారిజాతం కుట్ర

దశరథ సందేహాలకు కార్తీక్, దాసులు సమాధానం ఇస్తారు. సుమిత్ర ప్రసవించిన కాసేపటికే ఆసుపత్రిలో బిడ్డలు మారారని, అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావాలనే మార్చారని కార్తీక్ చెప్తాడు. “నీ కూతురు అంతస్తులు దిగి పేదరికంలో పెరిగింది.. వేరే వారి బిడ్డ నీ ఇంట్లో మహారాణిలా పెరిగింది. ఇదంతా చేసింది మరెవరో కాదు, మీ పిన్ని పారిజాతమే” అని కార్తీక్ అసలు నిజం బయటపెడతాడు. శివనారాయణ మీద ఉన్న పగతోనే పారిజాతం ఈ ఘాతుకానికి పాల్పడిందని వివరిస్తాడు.

జ్యోత్స్న అసలు తండ్రి ఎవరు?

జ్యోత్స్న ఎవరి కూతురో కూడా కార్తీక్ బయటపెడతాడు. “జ్యోత్స్న మరెవరో కాదు, మన దాసు మామయ్య కూతురే” అని చెప్పడంతో దశరథతో పాటు అక్కడున్నవారంతా నివ్వెరపోతారు. తన కూతురు చనిపోయిందని పారిజాతం తనను నమ్మించిందని, కళ్యాణికి తనకు పుట్టిన బిడ్డనే జ్యోత్స్నగా పెంచుతున్నారని దాసు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతేకాదు, ఈ నిజం జ్యోత్స్నకు కూడా తెలుసని, అందుకే దాసును చంపడానికి కూడా ప్రయత్నించిందని కార్తీక్ చెప్పడంతో దశరథ కోపంతో రగిలిపోతాడు.

కాశీ – స్వప్నల గొడవ

మరోవైపు శ్రీధర్ ఇంట్లో మరో డ్రామా నడుస్తోంది. కాశీని డ్రైవర్ గా చేర్చుకున్న శ్రీధర్, అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు పిలుస్తాడు. కానీ స్వప్న మాత్రం “డ్రైవర్ తో కలిసి నేను భోజనం చేయను, ఇతను నా భర్త కాదు” అని తెగేసి చెబుతుంది. దీంతో కాశీ నేల మీద కూర్చొని తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు.

నా కూతురు ఎక్కడ?

నిజాలన్నీ విన్న దశరథ, “మరి నా అసలు కూతురు ఎవరు? తను బతికే ఉందా?” అని ఆశగా, ఆవేదనగా అడుగుతాడు. దీనికి కార్తీక్, “నీ కూతురు బతికే ఉంది మామయ్య.. ఇక్కడే ఉంది.. నీ కోసం నీ కూతురిని కూడా తీసుకొచ్చాను” అని చెప్పి దీప వైపు చూపిస్తాడు.

మొత్తానికి ఇన్నాళ్లుగా దాగి ఉన్న నిజం దశరథకు తెలియడంతో కథ కీలక మలుపు తిరిగింది. తన సొంత కూతురు దీప అని తెలిసాక దశరథ, సుమిత్రలు ఎలా రియాక్ట్ అవుతారో, జ్యోత్స్న పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

Advertisement

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి