Karthika Deepam 2 Today 5 March 2026 Episode : బిడ్డను వద్దనుకున్న దీప.. కాంచన ఫైర్, కార్తీక్ షాకింగ్ ట్విస్ట్!

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 5 March 2026, 8:30 am

Karthika Deepam 2 Today 5 March 2026 Episode : త్రినేత్ర.న్యూస్ : స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 రోజురోజుకూ ఊహించని మలుపులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీప, కార్తీక్ ల జీవితంలో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలు ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నేటి మార్చి 5 ఎపిసోడ్ లో దీప తన కడుపులోని బిడ్డను వదులుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఇంట్లో పెద్ద దుమారమే రేపుతుంది. దీపను అందరూ తప్పుబట్టడం, కార్తీక్ వాళ్లందరికీ ఇచ్చే కౌంటర్ ఈరోజు ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచాయి.

Karthika Deepam 2 Today 5 March 2026 Episode : బిడ్డను వద్దనుకున్న దీప.. కాంచన ఫైర్, కార్తీక్ షాకింగ్ ట్విస్ట్!

Karthika Deepam 2 Today 5 March 2026 Episode : బిడ్డను వద్దనుకున్న దీప.. కాంచన ఫైర్, కార్తీక్ షాకింగ్ ట్విస్ట్!

Karthika Deepam 2 Today 5 March 2026 Episode కార్తీక్ అబద్ధాలు.. అడ్డంగా బుక్ చేసిన శివన్నారాయణ

ఎపిసోడ్ ప్రారంభంలో.. దీప కడుపుతో ఉంది కదా, కొన్ని రోజులు సరదాగా బయటకు వెళ్లి తిరిగొద్దామని అనుకుంటున్నాం అని తన తల్లి కాంచనతో చెబుతాడు కార్తీక్. కానీ కాంచన ఆ మాటలను నమ్మదు, “నువ్వు నాతో అబద్ధం చెబుతున్నావు రా” అని నిలదీస్తుంది. కార్తీక్ కవర్ చేసే ప్రయత్నం చేస్తుండగా, అక్కడికి ఎంట్రీ ఇచ్చిన శివన్నారాయణ కార్తీక్ ను అడ్డంగా బుక్ చేస్తాడు. “నా భార్యకు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, ఇంటి నుంచి కదలకూడదు, ఆమెకు సేవలు చేయడానికి నేను ఇంట్లోనే ఉండాలి కాబట్టి లీవ్ పెట్టాను అని నాతో చెప్పావు.. మరి ఇప్పుడు ఎక్కడికి బయల్దేరారు?” అని శివన్నారాయణ అడగడంతో కార్తీక్, దీప ఇద్దరూ షాక్ అవుతారు. వెంటనే తేరుకున్న కార్తీక్.. “ఇంటి దగ్గరే ఉందామనుకున్నాం, కానీ కడుపుతో ఉన్న మనిషికి నచ్చిన ప్లేస్ కు తీసుకెళ్తే మంచిదని ఫ్రెండ్ చెప్పాడు” అని మరో అబద్ధం చెబుతాడు.

Karthika Deepam 2 Today 5 March 2026 Episode బాంబ్ పేల్చిన కాంచన.. దీపపై తీవ్ర విమర్శలు

కార్తీక్ అబద్ధాలు విన్న కాంచన ఇక ఆపులేక అసలు నిజం బయటపెడుతుంది. “నువ్వు దీపను తీసుకెళ్తుంది విహారయాత్రకు కాదు, హాస్పిటల్ కి.. నిజమా కాదా?” అని అడుగుతుంది. కార్తీక్ అవునని ఒప్పుకోవడంతో ఇంట్లో వాళ్ళంతా అవాక్కవుతారు. ఇది కార్తీక్ తప్పు కాదు, వాడి భార్య దీప తప్పే అని కాంచన ఫైర్ అవుతుంది. “నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయడం నీకు ఇష్టం లేదు. ఇంకో బిడ్డ పుడితే నీ మొదటి కూతురు శౌర్యను ఎక్కడ సరిగ్గా చూసుకోలేవో అన్న భయంతోనే ఈ బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటున్నావు. అందుకు నా కొడుకుని కూడా ఒప్పించావు” అంటూ కాంచన కన్నీరుమున్నీరుగా విరుచుకుపడుతుంది. “మేము ఏ ఆశలు పెట్టుకునేవాళ్లం కాదు, ఆ బిడ్డ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

స్వార్థపరురాలివి అంటూ అనసూయ ఫైర్

కాంచన మాటలకు గొంతు కలుపుతుంది అనసూయ. “కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందని మీ అత్తయ్యకు చెప్పు దీప” అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండటంతో.. “నువ్వు పెద్ద స్వార్థపరురాలివి. అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసిన ఈ కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చినా తక్కువే. అలాంటిది బిడ్డను ఇవ్వలేవా?” అంటూ దీపను నానా మాటలు అంటుంది. దీప ఎంతైనా పరాయి మనిషి కదా, అలాగే ఆలోచిస్తుంది అని కాంచన కూడా దెప్పిపొడుస్తుంది.

నిజం చెప్పబోయిన దశరథ.. అడ్డుకున్న కార్తీక్

దీప పడుతున్న మాటలు వినలేక దశరథ అసలు నిజం (దీప తన బిడ్డను త్యాగం చేస్తుంది అనే విషయం) చెప్పబోతాడు. “దీపను ఇంకొక్క మాట అనడానికి వీల్లేదు.. నేను నిజం చెబుతాను” అని దశరథ అంటుండగా కార్తీక్ అడ్డుపడతాడు. “ఏ అర్హత ఉందని నా భార్య గురించి మాట్లాడుతున్నావు? నా భార్య గురించి మాట్లాడే హక్కు నాకే ఉంది” అని కార్తీక్ అంటాడు. దీనికి శివన్నారాయణ కౌంటర్ ఇస్తూ, “నువ్వు అర్హతల గురించి మాట్లాడితే నేను అధికారాల గురించి మాట్లాడతా.. నీ తల్లిని కన్న తండ్రిగా నాకు ఆ హక్కు ఉంది, అసలు బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నారు?” అని నిలదీస్తాడు. శ్రీధర్ కూడా దీపను తప్పుబడతాడు. “నువ్వు గర్భవతి అని తెలిశాకే నిన్ను నా కోడలిగా ఒప్పుకున్నాను, ఇప్పుడు ఆ బిడ్డను వదిలించుకుంటే నువ్వు మాట తప్పినట్లే” అని శ్రీధర్ అనడంతో దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది.

స్వప్నకు కాశీ దిమ్మతిరిగే కౌంటర్

మరోవైపు సబ్ ప్లాట్ లో.. కాశీ, స్వప్నల మధ్య ఎమోషనల్ సీన్ నడుస్తుంది. డివోర్స్ పేపర్స్ పై సంతకాలు చేసిన తర్వాత స్వప్న పొగరుగా మాట్లాడుతూ, “మనం విడిపోయాం కదా.. డ్రైవర్ కొన్ని అలవాట్లు మార్చుకోవాలి” అని అంటుంది. దీనికి కాశీ బదులిస్తూ, “పొందినప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడే దేని విలువ తెలుస్తుంది. నేను చచ్చేవరకు ఎదురుచూస్తా. ఒక మనిషికి ఒకే ప్రేమ ఉంటుంది. ఈ జన్మకి తనే నా ప్రేయసి” అని గట్టి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఈ మాటలు స్వప్నను ఆలోచనలో పడేస్తాయి.

దీప సీక్రెట్ తెలుసుకున్న జ్యోత్స్న

ఇంట్లో జరుగుతున్న పరిణామాలను పారిజాతం జ్యోత్స్నకు చేరవేస్తుంది. దీప తన బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటుందని, దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉందని, దానికి దశరథకు కూడా సంబంధం ఉందని జ్యోత్స్న చెవిలో ఊదుతుంది. వెంటనే జ్యోత్స్న, ఒకవేళ దీప బోన్ మ్యారో ట్రీట్మెంట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అయిందా అన్న అనుమానంతో హాస్పిటల్ కు బయల్దేరుతుంది.

చివర్లో కార్తీక్ షాకింగ్ ట్విస్ట్

మళ్లీ మెయిన్ సీన్ కు వస్తే.. అందరూ దీపను నిలదీస్తుండటంతో కాంచన, “నువ్వే సమాధానం చెప్పు దీప” అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ కల్పించుకుని తన తల్లి కాంచనను ఉద్దేశించి ఒక షాకింగ్ ప్రశ్న అడుగుతాడు. “దీప మాట్లాడదు అమ్మా.. తల్లి ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు.. ఈ రెండింటిలో ఎవరో ఒకరి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావమ్మా?” అని అడుగుతాడు. ఈ ఊహించని ప్రశ్నకు కాంచనతో సహా అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు.

ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. మరి కార్తీక్ అడిగిన ప్రశ్నకు కాంచన ఏం సమాధానం చెబుతుంది? దీప చేస్తున్న త్యాగం ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా? జ్యోత్స్న హాస్పిటల్ లో నిజం తెలుసుకుంటుందా? తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి