karthika Deepam 2 Today Episode 2026 July 21 : దీపకు జ్యోత్స్న థ్యాంక్స్.. సూరజ్ ప్లాన్‌తో భారీ ట్విస్ట్!
karthika Deepam 2 Today Episode 2026 July 21 స్టార్ మా కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‌లో దీప-జ్యోత్స్న కలిసి పోటీలో విజయం సాధించారు. సూరజ్ ప్లాన్‌తో శివన్నారాయణ గెలుపొందగా, జ్యోత్స్నలో భారీ మార్పు కనిపించింది. పూర్తి ఎపిసోడ్ హైలైట్స్ తెలుసుకోండి.
karthika Deepam 2 Today Episode 2026 July 21 : Karthika Deepam 2, కార్తీక దీపం 2 సీరియల్‌లో జూలై 20 ఎపిసోడ్ భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, అనూహ్య ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకాలం ఒకరినొకరు ప్రత్యర్థులుగా చూసుకున్న దీప Deepa, జ్యోత్స్న Jyothsna ఒకే లక్ష్యం కోసం చేతులు కలపడం ఈ ఎపిసోడ్‌లో అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. మరోవైపు సూరజ్ (Suraj) వేసిన వ్యూహం విజయవంతమై శివన్నారాయణ గౌరవాన్ని కాపాడింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే “ఈ గెలుపు నా కంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తుంది” అంటూ దీప, జ్యోత్స్నతో చేయి కలపమని చెబుతుంది. మొదట ఆశ్చర్యపోయిన జ్యోత్స్న చివరకు దీప మాట నమ్మి చేతులు కలుపుతుంది. ఈ సన్నివేశాన్ని గమనించిన సూరజ్, “వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా మారుతుంది” అని మనసులో అనుకుంటాడు. మరోవైపు కార్తీక్ కూడా దీప ఏదో పెద్ద నిర్ణయం తీసుకుందని గ్రహిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంటలను వేగంగా పూర్తి చేయడం ప్రారంభిస్తారు. దీప వంట చేస్తుంటే, జ్యోత్స్న ప్రతి పనిలో సహకరిస్తుంది. ఇంతకాలం శత్రువులుగా కనిపించిన ఇద్దరూ ఒక జట్టుగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
karthika Deepam 2 Today Episode 2026 July 21 : దీపకు జ్యోత్స్న థ్యాంక్స్.. సూరజ్ ప్లాన్‌తో భారీ ట్విస్ట్!
karthika Deepam 2 Today Episode 2026 July 21 పారిజాతానికి శివన్నారాయణ గట్టి హెచ్చరిక
పోటీ జరుగుతున్న సమయంలో పారిజాతం, సూరజ్‌తో మాట్లాడుతున్నానని భావించి దీప, జ్యోత్స్నలను విమర్శిస్తూ మాట్లాడుతుంది. కానీ అక్కడ నిలబడి ఉన్నది శివన్నారాయణ అని తెలుసుకున్న వెంటనే ఆమె షాక్‌కు గురవుతుంది. ఆమె మాటలతో తీవ్రంగా కోపగించిన శివన్నారాయణ, “ఇంటికి వెళ్లాక నీ సంగతి చూస్తాను. ఈ పోటీలో ఏ చిన్న తప్పు జరిగినా నేను మాత్రమే ఇంటికి వస్తాను.. నువ్వు కాదు” అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు . ఈ సన్నివేశం కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచుతుంది. చివరి ఐదు నిమిషాల్లో కూడా దీప తన వేగాన్ని తగ్గించకుండా స్వీట్‌ను సిద్ధం చేస్తుంది. అనంతరం జడ్జీలు రెండు రెస్టారెంట్ల వంటకాలను రుచి చూసి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.జ్యోత్స్న రెస్టారెంట్ విజేతగా నిలిచిందని ప్రకటించడంతో శివన్నారాయణ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. బహుమతిని మాలిని చేతుల మీదుగా అందజేయగా, దీప-జ్యోత్స్న ఇద్దరూ కలిసి స్టేజ్‌పైకి వెళ్లి అవార్డు అందుకుంటారు. అక్కడే దీప చేసిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తాయి. “ఈ విజయంలో అసలు క్రెడిట్ జ్యోత్స్నకే చెందుతుంది. నేను వంట చేసినా, ఆమె సహకారం లేకపోతే సమయానికి పూర్తి చేసేదాన్ని కాదు” అంటూ అందరి ముందు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెబుతుంది.ఆ మాటలు విన్న జ్యోత్స్న కూడా కదిలిపోతుంది.
శివన్నారాయణ భావోద్వేగం.. మాలినికి స్ట్రాంగ్ కౌంటర్
జ్యోత్స్న బహుమతిని తీసుకెళ్లి శివన్నారాయణ చేతిలో పెట్టడంతో ఆయన కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. “నా మనవరాలు నన్ను గర్వపడేలా చేసింది” అంటూ సుమిత్రతో ఆనందం పంచుకుంటాడు. అదే సమయంలో మాలినిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “నువ్వు మా షెఫ్‌ను కొనకపోయి ఉంటే, నా చుట్టూ ఉన్నవాళ్లంతా నిజంగా నావాళ్లేనని నేను నమ్మేవాడిని. కానీ నువ్వు చేసిన పని నాకు నిజాన్ని చూపించింది” అంటూ కౌంటర్ ఇస్తాడు. దక్షిణామూర్తి కూడా శివన్నారాయణ వంటలో ఉన్న ప్రతిభను గుర్తు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పోటీ ముగిసిన తర్వాత సూరజ్, జ్యోత్స్నతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. “ఈరోజు నీ ముఖంలో నిజమైన ఆనందాన్ని చూశాను. నువ్వు గెలిచావు.. కానీ మోసం చేసి కాదు, నిజాయితీతో గెలిచావు” అని చెబుతాడు. దానికి జ్యోత్స్న కోపంగా స్పందిస్తూ.. “దీపను పోటీలోకి దింపి నన్ను భావోద్వేగాలకు గురిచేశావు. నన్ను ఒక వలలోకి తీసుకెళ్లావు” అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. అయితే సూరజ్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. “నీ తాత ఎన్నాళ్ల తర్వాత నీతో ప్రేమగా మాట్లాడాడు? నీ అమ్మ నిన్ను చివరిసారి ఎప్పుడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది? ఈ గెలుపు నీకు కుటుంబాన్ని తిరిగి ఇచ్చింది” అని చెబుతాడు. ఈ మాటలు జ్యోత్స్నను ఆలోచనలో పడేస్తాయి.
దీప-జ్యోత్స్నపై శివన్నారాయణ ప్రశంసలు
ఇంటికి వచ్చిన తర్వాత శివన్నారాయణ ఇద్దరు మనవరాళ్లకు సుమిత్ర చేత దిష్టి తీయిస్తాడు. “ఈ విజయం మీ ఇద్దరిదీ. దీప, జ్యోత్స్న కలిసి మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టారు” అంటూ ప్రశంసిస్తాడు. సూరజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, అందరి కోసం పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తాడు. అయితే జ్యోత్స్న మాత్రం ఇంకా పూర్తిగా మారలేదు. సూరజ్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె వెనకాల వెళ్లిన సూరజ్, నిజాయితీతో గెలిచిన ఆనందం ఎంత గొప్పదో మరోసారి వివరించడానికి ప్రయత్నిస్తాడు. జ్యోత్స్న మాత్రం “ఇప్పుడే నీతో వాదించే మూడ్‌లో లేను” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక్కడితో Karthika Deepam 2 July 20 Episode ముగుస్తుంది. రాబోయే ఎపిసోడ్‌లో జ్యోత్స్న నిజంగానే మారుతుందా? లేక మరోసారి దీపకు వ్యతిరేకంగా మారుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.







