Karthika Deepam 2 Today Episode April 16th : లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌.. తండ్రి శ్రీ‌ధ‌ర్ ఇచ్చిన హింట్‌తో మేల్కొన్న కార్తీక్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 Today Episode April 16th : లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌.. తండ్రి శ్రీ‌ధ‌ర్ ఇచ్చిన హింట్‌తో మేల్కొన్న కార్తీక్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :17 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Karthika Deepam-2 Serial : లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌.. తండ్రి శ్రీ‌ధ‌ర్ ఇచ్చిన హింట్‌తో మేల్కొన్న కార్తీక్‌

Karthika Deepam 2 Today Episode April 16th : కార్తీక దీపం-2 సీరియ‌ల్‌లో ఈ రోజు (ఏప్రిల్ 17) ఏం జ‌రిగిందో తెలుసుకుందాం. దీప‌కు యావ‌జ్జీవ శిక్ష త‌ప్ప‌ద‌ని కార్తీక్‌తో అంటాడు శ్రీధ‌ర్‌. ద‌శ‌ర‌థ్‌ను దీప కాల్చింది అన‌డానికి బ‌ల‌మైన సాక్ష్యాలు ఉన్నాయ‌ని చెబుతాడు. ఇక‌ దీప జైలు నుంచి బ‌ట‌య‌కు రావ‌డం క‌ష్ట‌మ‌ని, మీ అంద‌రూ వ‌దిలేయాల్సింది న‌న్ను కాదు దీప‌ను అని అంటాడు శ్రీధ‌ర్‌. శౌర్య‌ను అనాథ‌శ్ర‌మంలో చేర్పిద్దాం. మ‌న‌మంతా మంచి ఇళ్లు తీసుకుని ఉందాం. ఆ త‌ర్వాత నీ పెళ్లి అని కార్తీక్‌తో అంటాడు శ్రీధ‌ర్‌. అక్క‌డితో ఆగ‌క‌పోతే నీ పెళ్లి నేను చేస్తా అని తండ్రికి గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తాడు కార్తీక్‌. ఇక్క‌డి నుంచి వెళ్ల‌క‌పోతే చీపురు క‌ట్ట తిర‌గేయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తాడు. వీళ్లు మార‌రు. ద‌శ‌ర‌థ్ లేవ‌డు. దీపకు యావ‌జ్జీవ శిక్ష గ్యారెంటీ అని శ్రీధ‌ర్ చెప్పి అక్క‌డినుంచి వెళ్లిపోతాడు.

Karthika Deepam 2 Serial లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌ తండ్రి శ్రీ‌ధ‌ర్ ఇచ్చిన హింట్‌తో మేల్కొన్న కార్తీక్‌

Karthika Deepam-2 Serial : లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌.. తండ్రి శ్రీ‌ధ‌ర్ ఇచ్చిన హింట్‌తో మేల్కొన్న కార్తీక్‌

భ‌ర్త అన్న మాట‌లు నిజ‌మేనా కొడుకును అడుగుతుంది కాంచ‌న‌. మ‌న ద‌గ్గ‌ర మంచి లాయ‌ర్ లేడ‌ని ప‌నికొచ్చే మాట ఒక్క‌టి తండ్రి అన్నాడ‌ని కార్తీక్ బ‌దులిస్తాడు. దాంతో రెస్టారెంట్ ఓన‌ర్ స‌త్య‌రాజ్‌కు ఫోన్ చేసి లాయ‌ర్ విష‌యంలో సాయం అడుగుతాడు కార్తీక్‌. స‌త్య‌రాజ్ ద్వారా లాయ‌ర్ క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌ను క‌లుస్తాడు కార్తీక్‌. త‌న క‌థ‌తో పాటు దీప త‌న జీవితంలోకి ఎలా వ‌చ్చిందో క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌కు వివ‌రిస్తాడు కార్తీక్‌. దీప‌తో మాట్లాడ‌టానికి పోలీస్ స్టేష‌న్‌కు బ‌యల్దేరుతాడు క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌. అపోజిట్ లాయ‌ర్ ఎంత పెద్ద‌వాడు అయినా న్యాయం కోసం పోరాడుదామ‌ని క‌ళ్యాణ్ ప్ర‌సాద్ చెబుతాడు.

Karthika Deepam 2 Today Episode April 16th లాయ‌ర్ భ‌గ‌వాన్‌దాస్‌తో క‌లిసి జోత్స్న కొత్త ప్లాన్‌

దీప‌కు శిక్ష ప‌డేందుకు త‌మ ఫ్యామిలీ లాయ‌ర్ భ‌గ‌వాన్ దాస్‌తో క‌లిసి జ్యోత్స్న‌ కొత్త ప్లాన్ వేస్తుంది. తాను సృష్టించిన దొంగ సాక్ష్యాలు లాయ‌ర్‌కు చూపిస్తుంది. ఆ సాక్ష్యాల ఆధారంగా దీప‌కు మూడు, నాలుగేళ్లు జైలు శిక్ష ప‌డొచ్చ‌ని భ‌గ‌దాస్ దాస్ అంటాడు. ఆ శిక్ష స‌రిపోద‌ని, దీపకు యావ‌జ్జీవ శిక్ష ప‌డాల‌ని జ్యోత్స్న అంటుంది. ప్రీ ప్లాన్‌డ్ క‌దా అని భ‌గ‌వాన్‌ సంశ‌యిస్తాడు. యావ‌జ్జీవ శిక్ష ప‌డేందుకు ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు అయినా ఇస్తాన‌ని, ఎస్ఐ కూడా మ‌న‌వాడేన‌ని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న చెప్పిన‌ట్లే చేస్తాన‌ని లాయ‌ర్ భ‌గ‌వాస్ దాస్ అంటాడు.

దీప‌తో మాట్లాడ‌టానికి పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తాడు లాయ‌ర్‌ క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌. నీ గురించి కార్తీక్ చెప్పిన మాట‌ల్లో నిజాయితీ క‌నిపించింద‌ని, అదే నిజాయితీ నీ మాట‌ల్లో క‌నిపిస్తే ఈ కేసును నేను వాదిస్తాన‌ని దీప‌తో చెబుతాడు క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌. ఏం అడిగినా చెబుతాన‌ని దీప బ‌దులిస్తుంది.

మీరు ఒక ప‌థ‌కం ప్ర‌కారం కార్తీక్‌కు భార్య కావాల‌ని అనుకొని జ్యోత్స్న‌ను మోసం చేసి కార్తీక్ చేత తాళి క‌ట్టించుకున్నారు. జ్యోత్స్న నిల‌దీయ‌డంతో ఆ మ‌నిషిని అడ్డు తొల‌గించుకోవాల‌ని గ‌న్ తో షూట్ చేశావు. కానీ జ్యోత్స్న త‌ప్పించుకోవ‌డంతో ద‌శ‌ర‌థ్‌ను కాల్చేశావు…ఇది నిజ‌మా అబ‌ద్దామా అని దీప‌ను అడుగుతాడు క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌. లాయ‌ర్ మాట‌ల‌తో దీప షాక‌వుతుంది. ఇలా అడుగుతున్నారేంటి అని అంటుంది. దీప గురించి తాను అన్ని నిజాలు చెప్పాను క‌దా అని కార్తీక్ అంటాడు. రేపు కోర్టులో లాయ‌ర్ దీప‌ను ఇదే ప్ర‌శ్న అడిగితే ఇలాగే స‌మాధానం చెబుతారా…లేదంటే దీప బ‌దులు మీరు మాట్లాడుతారా అని కార్తీక్‌తో అంటాడు క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌.

నా పెళ్లి నా ప్ర‌మేయం లేకుండానే జ‌రిగింద‌ని దీప అంటుంది. జ్యోత్స్న త‌న‌పై ఎలా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనుకుందో వివ‌రిస్తుంది దీప‌. ఆ రోజు ఏం జ‌రిగిందో క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌కు చెబుతుంది. దీప మాట‌లు విన్న క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌… మీరు ఏ త‌ప్పు చేయ‌లేదు. కానీ ఆ నిజాన్ని నిరూపించ‌డం కొంచెం క‌ష్ట‌మేన‌ని అంటాడు.

పోలీస్ స్టేష‌న్‌లో ఉన్న దీప‌ను క‌ల‌వ‌డానికి జ్యోత్స్న వ‌స్తుంది. దీప‌తో క‌ళ్యాణ్ ప్ర‌సాద్ మాట్లాడ‌టం గ‌మ‌నిస్తుంది. త‌ర్వాత క‌ళ్యాణ్ ప్ర‌సాద్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకుంటుంది. త‌న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌కు చెప్పి నేర‌స్తురాల‌ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటుంది జ్యోత్స్న‌. ఏది నిజం, ఎవ‌రు దోషి అన్న‌ది కోర్టు నిర్ణ‌యిస్తుంద‌ని, న్యాయం గెలుస్తుంద‌ని చెప్పి జ్యోత్స్న‌కు షాకిస్తాడు క‌ళ్యాణ్ ప్ర‌సాద్‌.

దీప‌తో మాట్లాడేందుకు కార్తీక్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ల‌గా అదే స‌మ‌యంలో జోత్స్న అక్క‌డికి వ‌స్తుంది. నీదేనా ప్రేమ‌, వ్యాత్స‌ల్సం అంటూ వారిపై రివ‌ర్స్ ఎటాక్ చేస్తుంది. మీరు మాత్ర‌మే మ‌నుషులు.. మా డాడీకి ఏం జ‌రిగినా నిన్ను మాత్రం వ‌దిలిపెట్ట‌న‌ని దీప‌కు జ్యోత్స్న వార్నింగ్ ఇస్తుంది. జ్యోత్స్న మాట‌ల‌తో దీప కోపం ప‌ట్ట‌లేక జ్యోత్స్న పీక ప‌ట్టుకుంటుంది. నొప్పితో విల‌విల‌లాడిన జ్యోత్స్న త‌న‌ను వ‌ద‌ల‌మ‌ని బ‌తిమిలాడుతుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగుస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది