Viral Video : నేటి కాలంలో చాలామంది చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా జీవితంలో మరియు వారి కుటుంబంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎదురుకోలేక మానసిక ఒత్తిడికి లోనై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో వారికి చావే పరిష్కారంగా కనిపిస్తుంది. కానీ మరికొందరు మాత్రం జీవితం వారికి ఎన్ని పరీక్షలు తీసుకువచ్చిన సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటారు. అలాంటి వారిలో తల్లిదండ్రులు ముందుంటారు అని చెప్పాలి. అయితే అలాంటిదే తాజాగా జరిగిన దృశ్యం అమ్మ ప్రేమకు నిదర్శనంగా మారింది. 10వ తరగతి చదువుతున్న తన కుమారుడు నడవలేని పరిస్థితిలో ఉండడంతో తన కుమారుని తల్లి ఎత్తుకొని 10వ తరగతి పరీక్షలు రాయించడానికి తీసుకువచ్చింది. మనసు చల్లించే ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే..
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో చించోలి అనే గ్రామంలో పద్మ అనే మహిళ నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు చరణ్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పద్మ కుమారుడు చరణ్ కి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్లు పూర్తిగా పడిపోయాయి. అంతేకాక చరణ్ పుట్టిన సంవత్సరానికి పద్మ తన భర్తను కూడా కోల్పోయింది. ఈ విధంగా తన భర్త మరణం , బిడ్డ అంగవైకల్యంతో పద్మ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. అయిన తన బిడ్డే తన ప్రపంచంగా భావించిన పద్మ చరణ్ ను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తుంది. ఆమె స్థానికంగా బీడీలు చుడుతూ తన బిడ్డ బాగోలు చూసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా పద్మ కష్టపడుతూ చరణ్ ను పెద్దవాడిని చేసింది. అంతేగాక తన కొడుకును బాగా చదివించాలని కోరికతో చదివించడం మొదలుపెట్టింది. ఆ విధంగా చరణ్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అయితే తాజాగా 10వ తరగతి పరీక్షలు రావడంతో స్వయంగా పద్మ రోజు తన చేతులతో కొడుకును మోస్తూ పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి పరీక్షలు రాయిస్తోంది.
అయితే గతంలో చరణ్ తన తాత సహాయంతో పాఠశాలకు వెళ్ళగా ప్రస్తుతం ఆయనకు వయసు మీద పడడంతో సహకరించడం లేదు. దీంతో తల్లి పద్మ తన కుమారుడు చరణ్ ను ఆటోలో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి చేతులపై ఎత్తుకొని పరీక్ష కేంద్రంలోకి తీసుకువెళ్తుంది. అయితే దివ్యాంగులకు కేటాయించిన స్కైబ్ విద్యార్థి సహకారంతో ప్రస్తుతం చరణ్ పరీక్షలు రాస్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. దీంతో నేటిజన్స్ పద్మమ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ ప్రేమ అంటే ఇదే కదా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అసలైన పోరాట యోధురాలు నువ్వే అంటూ కొనియాడుతున్నారు. మరి ఈ మాతృమూర్తి పద్మమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.