Viral Video : వావ్.. సూపర్ ఆంటీ.. 60 ఏళ్ల వయసులో చీర కట్టి జిమ్ లో కసరత్తులు.. బిత్తరపోతున్న నెటిజన్లు వీడియో..!
Viral Video : 60 ఏళ్ల వయసులో ఉన్నవాళ్లు ఏం చేస్తారు చెప్పండి. కూర్చొంటే నిలుచోలేరు.. నిలిచుంటే కూర్చోలేదు.. ఇంకొందరైతే మంచానికే పరిమితం అవుతారు. వెనకటికి అంటే 100 సంవత్సరాలు బతికేవారు కానీ.. ఈ జనరేషన్ లో 60 బతికితే గొప్పే. అంతే కదా.. 50 ఏళ్లకే అన్ని రోగాలు మీదపడుతున్నాయి. ఇక కేవలం మందుల మీదనే బతకాల్సి వస్తుంది. అందుకే.. 50 ఏళ్లు దాటితే ఇక ఎప్పుడు ఏ జరిగేది ఎవ్వరూ ఊహించలేరు.
కానీ.. ఈ ఆంటి చూడండి… తనకు సుమారు 60 ఏళ్ల వయసు ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా.. ఇంట్లో కృష్ణా రామా అనుకుంటూ కూర్చోకుండా జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తోంది. తన కసరత్తులను చూసే యువకులే షాక్ అవ్వాలి. చీర కట్టుకొని ఆ ఆంటీ చేసిన కసరత్తుల వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. తనకు నాలుగేళ్ల క్రితమే మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయట. తన మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు
aunty workouts in gym video goes viral
Viral Video : నాలుగేళ్ల క్రితమే తనకు మోకాళ్ల నొప్పులు
తన కొడుకుకే చెందిన జిమ్ లో రోజూ కసరత్తులు చేస్తోందట. తను కసరత్తులు చేయడం ప్రారంభించినప్పటి నుంచి తనకు మోకాళ్ల నొప్పులు కూడా తగ్గాయట. అందుకే ప్రతిరోజూ చీర కట్టుకునే జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తుందట. తను కసరత్తులు చేయడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వావ్.. సూపర్బ్.. అదరగొట్టేశావు అమ్మ. నువ్వు గ్రేట్. ఈ వయసులోనూ జిమ్ కు వెళ్తూ యూత్ కు స్ఫూర్తినిస్తున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
