Drunk Man : మత్తెక్కేదాకా తాగడం.. ఆ తర్వాత తింగరి పనులు చెయ్యడం.. మందుబాబులకు సహజమే. ఎక్కిన కిక్ దిగదు, హ్యాంగోవర్ వదలదు. మైండ్ సరిగా పనిచెయ్యదు. దాంతో.. వాళ్లు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఆంధ్రప్రదేశ్.. మన్యం జిల్లా, పాలకొండ మండలంలోని ఎం.సింగిపురంలో ఓ మందుబాబు చేసిన పని దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.మద్యం మత్తులో అతను కరెంటు స్తంభం ఎక్కడాన్ని కొందరు దూరం నుంచి చూశారు. వాళ్లు పరుగులు పెట్టి స్తంభం దగ్గరకు వెళ్లేసరికి అతను పై దాకా వెళ్లిపోవడం చూసి అందరు హడలెత్తిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు షాకయ్యారు.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఆ వెంటనే కిందకు దిగమని వెంకన్నకు నచ్చజెప్పారు. తాను మాత్రం కిందకు దిగనని మొండికేశాడు. కొద్దిసేపు స్థానికులు బతిమాలడంతో కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంకు చెందిన యజ్జల వెంకన్నకు మద్యం అలవాటు ఉంది. ఇంకేముందు లిక్కర్ షాపుకెళ్లి ఫుల్‌గా తాగేశాడు.. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా ఓ విద్యుత్ స్తంభం దగ్గరకు వెళ్లాడు.
కాసేపు మేఘాల్లో తేలుతున్నట్లు అటూ ఇటూ ఊగాడు. అక్కడి నుంచి కింద పడతాడేమో అని అంతా టెన్షన్ పడ్డారు. అతన్ని కిందకు దిగమని కేకలు పెట్టారు. ఎవరు ఎంత అరిచినా అటు నుంచి స్పందన లేదు. మత్తు ఎక్కేసింది మరి. నానా తిప్పలుపడి, అతన్ని జాగ్రత్తగా కిందికి తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో స్థానికులను మెచ్చుకోవాలి. వాళ్లు అతన్ని 2 విధాలుగా కాపాడారు. ఒకటి కరెంటు సప్లై ఆపేశారు. రెండు.. తీగలపై నుంచి కింద పడకుండా.. కిందకు తెచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏ చిన్న తేడా వచ్చినా.. అతని ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..
Buttermilk : మానసిక స్థితిని సరి చేసుకోవడం కోసం ప్రతిరోజు గ్లాస్ మజ్జిగను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక…
Anushka : అందాల భామ అనుష్క శెట్టి ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇస్తుంది. బాహుబలి Bahubali, భాగమతి తర్వాత…
Oolong Tea : ప్రస్తుతం డయాబెటిక్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఐ సి ఎం ఆర్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే…
Telangana High Court : నిరుద్యోగ యువతకు శుభవార్త. తాజాగా Telangana తెలంగాణ రాష్ట్రంలోని న్యాయశాఖ మంత్రిత్వ శాఖ మరియు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే…
Sreeleela అందాల భామ శ్రీలీల ఎక్కడ కనిపించినా సరే అదో రకమైన మెరుపులు వస్తుంటాయి. తన సినిమాల్లో అదిరిపోయే డ్యాన్స్…
Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు…
Hyderabad Water Supply : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు Hyderabad Water…
This website uses cookies.