Drunk Man : తాగిన మ‌త్తు బాగా ఎక్కి ఏకంగా క‌రెంట్ తీగ‌ల‌పై ప‌డుకున్న తాగుబోతు..వైర‌ల్ వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drunk Man : తాగిన మ‌త్తు బాగా ఎక్కి ఏకంగా క‌రెంట్ తీగ‌ల‌పై ప‌డుకున్న తాగుబోతు..వైర‌ల్ వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :1 January 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Drunk Man : తాగిన మ‌త్తు బాగా ఎక్కి ఏకంగా క‌రెంట్ తీగ‌ల‌పై ప‌డుకున్న తాగుబోతు

Drunk Man : మత్తెక్కేదాకా తాగడం.. ఆ తర్వాత తింగ‌రి పనులు చెయ్యడం.. మందుబాబులకు సహజమే. ఎక్కిన కిక్ దిగదు, హ్యాంగోవర్ వదలదు. మైండ్ సరిగా పనిచెయ్యదు. దాంతో.. వాళ్లు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఆంధ్రప్రదేశ్.. మన్యం జిల్లా, పాలకొండ మండలంలోని ఎం.సింగిపురంలో ఓ మందుబాబు చేసిన పని దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.మద్యం మత్తులో అతను కరెంటు స్తంభం ఎక్కడాన్ని కొందరు దూరం నుంచి చూశారు. వాళ్లు పరుగులు పెట్టి స్తంభం దగ్గరకు వెళ్లేసరికి అతను పై దాకా వెళ్లిపోవ‌డం చూసి అంద‌రు హ‌డ‌లెత్తిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు షాకయ్యారు.. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Drunk Man తాగిన మ‌త్తు బాగా ఎక్కి ఏకంగా క‌రెంట్ తీగ‌ల‌పై ప‌డుకున్న తాగుబోతువైర‌ల్ వీడియో

Drunk Man : తాగిన మ‌త్తు బాగా ఎక్కి ఏకంగా క‌రెంట్ తీగ‌ల‌పై ప‌డుకున్న తాగుబోతు..వైర‌ల్ వీడియో

Drunk Man మ‌రీ ఇంత కిక్కా..

స్థానికులు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఆ వెంటనే కిందకు దిగమని వెంకన్నకు నచ్చజెప్పారు. తాను మాత్రం కిందకు దిగనని మొండికేశాడు. కొద్దిసేపు స్థానికులు బతిమాలడంతో కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంకు చెందిన యజ్జల వెంకన్నకు మద్యం అలవాటు ఉంది. ఇంకేముందు లిక్కర్ షాపుకెళ్లి ఫుల్‌గా తాగేశాడు.. అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. అక్కడి నుంచి నేరుగా ఓ విద్యుత్ స్తంభం దగ్గరకు వెళ్లాడు.

కాసేపు మేఘాల్లో తేలుతున్నట్లు అటూ ఇటూ ఊగాడు. అక్కడి నుంచి కింద పడతాడేమో అని అంతా టెన్షన్ పడ్డారు. అతన్ని కిందకు దిగమని కేకలు పెట్టారు. ఎవరు ఎంత అరిచినా అటు నుంచి స్పందన లేదు. మత్తు ఎక్కేసింది మరి. నానా తిప్పలుపడి, అతన్ని జాగ్రత్తగా కిందికి తీసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో స్థానికులను మెచ్చుకోవాలి. వాళ్లు అతన్ని 2 విధాలుగా కాపాడారు. ఒకటి కరెంటు సప్లై ఆపేశారు. రెండు.. తీగలపై నుంచి కింద పడకుండా.. కిందకు తెచ్చారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏ చిన్న తేడా వచ్చినా.. అతని ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు..

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది