Free Cab Services : మందు బాబులకు ఫ్రీ క్యాబ్.. తెలంగాణా ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సూపర్ ప్లాన్..!
ప్రధానాంశాలు:
Free Cab Services : మందు బాబులకు ఫ్రీ క్యాబ్.. తెలంగాణా ఫోర్ వీలర్స్ అసోసియేషన్ సూపర్ ప్లాన్..!
Free Cab Services : కొత్త సంవత్సరం సందర్భంగా కచ్చితంగా అందరు పార్టీ మూడ్ లో ఉంటారు. సిటీల్లో తాగి రోడ్ల మీద యాక్సిడెంట్స్ చేస్తుంటారు. న్యూ ఇయర్ వేడుకల్లో తాగే వారి కోసస్మ్ హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధి లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు తెలంగాణా ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మెంబర్స్. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నారు.
Free Cab Services హైదరాబాద్ నగర పరిధిలోనే 500 కార్లు..
9177624678 నంబర్‌కి కాల్ చేసిన వారికి ఫ్రీ క్యాబ్ సర్వీస్ అందిస్తామని అన్నారు. దాదాపు హైదరాబాద్ నగర పరిధిలోనే 500 కార్లు, 250 బైక్ సర్వీస్ లు ఏర్పాటు చేస్తున్నట్టు అసోసియేషన్ మెంబర్స్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను నివారించేందుకే ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తమ వంతు బాధ్యతగా ఈ సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఏది ఏమైనా ఇది చాలా గొప్ప కార్యక్రమమని చెప్పొచ్చు. దీని వల్ల ఎవరు కూడా తాగి డ్రైవ్ చేసే అవకాశం ఉండదు. అవసరమైన వారు తప్పనిసరిగా ఈ ఫ్రీ క్యాబ్ సర్వీసులను వాడుకోవాలని చెబుతున్నారు. Free Cab Services, Drunken People, This Night