India vs Australia Final 2023 : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. పెళ్లిలో వరుడు ఏం చేసాడో చూడండి..!
India vs Australia Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం దేశమంతటా ఎంతో ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ తుది పోరుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు అభిమానులు అహ్మదాబాద్ కు భారీ ఎత్తున పోటెత్తారు. ఇక ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుడు వరల్డ్ కప్ మిస్ కాకూడదని ఇలా ప్లాన్ చేశాడు.
హైదరాబాదీలకు క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ షామీర్ పేట పరిధిలోని తూకుంటకు చెందిన పూజ, నాగరాజుకు ఈరోజు కీసర పరిధిలోని చీర్యాల గుడి సమీపంలో కన్వెన్షన్ హాల్లో పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లికి వచ్చిన వారు మ్యాచ్ మిస్ అవుతారని పెళ్లి కొడుకు ఏకంగా పెళ్లిలోనే స్క్రీన్ పై లైవ్ మ్యాచ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా అటు పెళ్లి ఇటు మ్యాచ్ తిలకిస్తున్నారు.
ఆ పెళ్ళికి వెళ్ళిన ఒకతను దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త ఇలా నెట్టింటా వైరల్ గా మారింది. భారత్ ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టాలని ఆశిస్తున్నారు. ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వెళ్లారు. విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి అహ్మదాబాద్ వెళ్లారు. భారత అభిమానులు భారీగా రావడంతో నరేంద్ర మోడీ స్టేడియం బ్లూ సీ గా మారింది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ ఆస్ట్రేలియాలు పోటీ పడుతుండడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.