
mother returning home after conducting the funeral Video
Viral Video : సమాజంలో రకరకాల సంఘటనలు అందరిని విబ్రాంతికి గురిచేస్తాయి. ముఖ్యంగా మనసుకు దగ్గరైన వాళ్ళు చనిపోయి మళ్లీ తిరిగి వస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. అటువంటి సంఘటన తాజాగా ఒకటి జరిగింది. తన తల్లి చనిపోయింది అని తెలిసిన ఒక కొడుకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే అనుకోని విధంగా తన తల్లి… ఇంట్లో ప్రత్యక్షమయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరువల్లూరు జిల్లా..సెల్ తైకర్ గ్రామానికి చెందిన సొకమల్ కు ముగ్గురు కొడుకులు. అయితే ఆమె ప్రస్తుతం సెల్ టైకర్ కండ్రికలోని చిన్న కొడుకు దగ్గర ఉంటుంది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం సొకమల్ కు ఉంటున్న చిన్న కొడుకు ఇంటి వద్ద ఎదురింటి మహిళతో గొడవ ఏర్పడింది.
ఈ గొడవలో సొకమల్ స్వల్పంగా గాయపడటం జరిగింది. అయితే ఇంత జరిగినా కొడుకు ఏమి స్పందించకపోవడంతో అలిగి చెన్నైలో ఉంటున్న పెద్ద కొడుకు వద్దకు వెళ్ళిపోయింది. అయితే ఆమె ఇంటి నుండి బయటకు వెళ్తున్న సమయంలో ఒంటిపై ఎలాంటి దుస్తులు అయితే వేసుకోవడం జరిగిందో అదే రంగు దుస్తులతో పుట్లూరు రైల్వే ట్రాక్ పై వృద్ధురాలి శవం గుర్తు తెలియని రీతిలో కనిపించింది. దీంతో మృతి చెందిన వృద్ధురాలు సొకమల్ గా భావించిన ఆమె చిన్న కొడుకు రైల్వే స్టేషన్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి బంధువులకు సమాచారాన్ని అందించి అంత్యక్రియలు నిర్వహించారు.
mother returning home after conducting the funeral Video
ఈ క్రమంలో చెన్నైలో ఉన్న పెద్ద అన్నయ్యకు సమాచారం అందించడానికి ప్రయత్నాలు చేయగా… ఇద్దరి మధ్య అప్పటికే గొడవలు ఉండటంతో.. పెద్దన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మే 28వ తారీకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కాగా సొకమల్ సోమవారం ఉదయం చిన్న కొడుకు శరవన్ ఇంటి ముందుకు రావడంతో… అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సొకమల్ ప్రాణాలతో వచ్చారని తెలియటంతో జనం పెద్ద ఎత్తున గుమ్మి గూడారు. ఈ క్రమంలో తల్లి ఇంటికి రావడంతో కొడుకులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి అంతకుముందు జరిగిన విషయాన్ని కూడా వివరించారు.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.