
Rains : మంట కలిసిన మానవత్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!
Rains : ఈ రోజుల్లో మనిషి ప్రాణాల కన్నా కూడా డబ్బుకే చాలా మంది విలువ ఇస్తున్నారు. మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా కొందరు దురాశ వలన మానవత్వాన్ని మరిచిపోతున్నారు. మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే దురాశపరుడి వల్ల ఓ వ్యక్తి గంగా నదిలో మునిగి, ప్రాణాలు కోల్పోయారు. కాపాడేందుకు 10వేలు డిమాండ్ చేశాడు ఓ గజ ఈతగాడు.. ఇందుకు అంగీకరించిన బాధితుడు బంధువులు ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేశారు. కానీ, మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు సమయం పట్టింది. డబ్బులు ముడితేనే మనిషిని కాపాడేది అని ఆ గజ ఈతగాడు తేల్చి చెప్పాడు. ఇంతలోనే నదిలో పడ్డ వ్యక్తి వరద ఉధృతికి కనిపించకుండా కొట్టుకుపోయాడు. ఈ విషాద సంఘటన యూపీలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్ ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అనుకోకుండా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు.అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్ కాశ్యప్ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ, అందుకోసం డబ్బు డిమాండ్ చేశాడు. ఆన్‌లైన్‌లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను బాధితుడిని కాపాడబోనని చెప్పాడు.
Rains : మంట కలిసిన మానవత్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!
సదరు అధికారి సింగ్ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు సునీల్ వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. గల్లంతైన సింగ్ కోసం డైవర్లు బోటులో వెతికారు. అయితే, మృతదేహం లభ్యం కాలేదని, గాలింపు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే గజ ఈతగాడి గురించి తెలుసుకున్న వారంతా కూడా ఆయనని తెగ తిట్టిపోస్తున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.