Viral Video : బ్లూటూత్ కొరికిందని ఎలుకను ఫ్యాన్ కు కట్టేసిన క్లాస్ పీకుతున్న వ్యక్తి.. వీడియో వైరల్..!
Viral Video : ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు ఎక్కడ ఏం జరిగినా సరే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క వీడియో నెట్టింట్లో ముందుగా ప్రత్యక్షం అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు అయితే తమ వీడియోలు వైరల్ అయ్యేందుకు కూడా కొన్ని విధాలుగా క్రియేట్ చేస్తున్నారు. ఆ వీడియోలకు నెట్టింట్లో విపరీతమైన వ్యూస్ కూడా వస్తుంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే ఓ ఎలకను ఓ వ్యక్తి టేబుల్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. వాస్తవానికి ప్రతి ఇంట్లో ఎలకలు అనేవి కామన్ గానే ఉంటాయి. పైగా అవి పాడు చేయడం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎలుకలు ఇంట్లో ఉండే బియ్యం, ఇతర పప్పులు, తినే ఆహార పదార్థాలను పాడు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు జనరేషన్ మారుతోంది.
ఇంట్లో వివిధ రకాల ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచితే వాటిని కూడా పాడు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చార్జింగ్ వైర్లు, కేబుల్ వైర్లను కొరికేయడం కూడా మనం ఈ నడుమ ఎక్కువగానే చూస్తున్నాం.అవి ఎందుకు కొరుకుతున్నాయో.. వాటిని కొరికితే ఏం వస్తుందో కూడా తెలియదు. కానీ అవి కొరికి పాడు చేయడం మాత్రం కామన్ అయిపోయిందనే చెప్పుకోవాలి. కాగా ఈ నడుమ ఇలా ఎలుకలను పట్టుకునేందుకు కూడా చాలా కొత్త వస్తువులు వచ్చాయి. అందులో చూసుకుంటే ఎలుకల బోన్ తో పాటు ఎలుకల బిస్కెట్లు కూడా వచ్చాయి. వాటిని ఉపయోగించి సదరు ఎలుకలను పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కావట్లేదు. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఓ ఎలుకను పట్టుకున్నాడు. దాన్ని ఎలా పట్టుకున్నాడో తెలియదు గానీ.. దాన్ని పట్టుకుని ఓ టేబుల్ ఫ్యాన్ కు వేలాడదీశాడు.
Viral Video : బ్లూటూత్ కొరికిందని ఎలుకను ఫ్యాన్ కు కట్టేసిన క్లాస్ పీకుతున్న వ్యక్తి.. వీడియో వైరల్..!
ఇందులో అతను ఎలుకను కొన్ని ప్రశ్నలు కూడా వేశాడండోయ్. నా బ్లూటూత్ వైర్ ను ఎందుకు కొరికావ్.. కొరికితే నీకు ఏం వస్తుంది.. నువ్వు ఇంట్లో ఉన్న పప్పులు, ఉల్లిగడ్డల్లాంటికి కొరికినా నేను పట్టించుకోలేదు. పోనీలే నీ కడుపు నిండుతుంది కదా అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు రూ.2వేల బ్లూటూత్ వైర్ ను ఎందుకు కొరికావో చెప్పు అంటూ ఆ ఎలుకమీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన ప్రశ్నలకు ఆ ఎలుక కూడా మౌనంగానే చూస్తూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యొం మీరు కూడా చూసేయండి.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.