Home » News » The Wife Leave Husband And Left With Her Boyfriend
News

Wife : అప్పు చేసి చదివిస్తే.. చివరికి భర్తనే వదిలేసి ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య..!

Authored By
aruna
The Telugu News | Published on: October 7, 2023, 12:00 pm
Advertisement

Wife : పెళ్లంటే నూరేళ్ళ పంట అని అంటారు. కానీ ఇప్పుడు మారిన కాలంలో అలా కనిపించడం లేదు. దాంపత్య జీవితానికి విలువ అనేది లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య గౌరవం ఉండడం లేదు. భార్య భర్తలలో ఎవరో ఒకరు తప్పు తప్పుడు దారిలో పోతూ ఇద్దరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ భార్య చేసిన నిర్వాకం చూసి భర్త షాక్ అయిపోయాడు. ఆమెను ఎంతో కష్టపడి చదివిస్తే చివరికి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. దీంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Advertisement

జార్ఖండ్ కు చెందిన టింకు, ప్రియలు 2020లో పెళ్లి చేసుకున్నారు. టింకు కూలీ పనికి వెళ్తూ ఉండేవాడు. ప్రియకు ఎప్పటినుంచో నర్సింగ్ చేయాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని తన భర్తతో చెబుతుంది. దీంతో భర్త తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే కష్టపడి అయినా సరే తన భార్యను చదివించాలని అందుకు సరే అంటాడు. అయితే టింకు తన భార్యను చదివించాలని ఓ సంస్థ నుంచి 2.5 లక్షల లోన్ తీసుకున్నాడు. తన సంపాదన సరిపోకపోవడంతో పిజ్జాలు కూడా డెలివరీ చేసేవాడు. అంతేకాకుండా తన భార్యను హై క్లాస్ సిటీలో హాస్టల్ లో ఉంచి చదివించాడు.

The wife leave husband and left with her boyfriend

Advertisement

అయితే ప్రియా నర్సింగ్ చేస్తున్న క్రమంలో దిల్ కుష్ అనే వ్యక్తిని ప్రేమించింది. దీంతో భర్తను వదిలేసి అతడితో ఢిల్లీకి వెళ్లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తాను పెళ్లి చేసుకున్న ఫోటోలను ఇతరుల మొబైల్ ద్వారా తన భర్త టింకూకు పంపింది. దీంతో టింకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను అంత కష్టపడి చదివిస్తే ఆమె వేరే వాడితో వెళ్లిపోవడంతో టింకు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో టింకు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. తన భార్య కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పాడు. తన భార్య వేరే వాడిని పెళ్లి చేసుకోవడం కంటే అప్పుల బాధలో మునిగిపోయాను అని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి