
Two girls beaten by on the road
ప్రస్తుత సమాజంలో ఉన్న అమ్మాయిలు చాలా స్పీడ్ గా ఉన్నారు. మగవాళ్లకు పోటీగా చాలా రంగాలలో రాణిస్తూ ఉన్నారు. చదువులలో మరియు ఉద్యోగాలలో… మగవాళ్ళని మించి మరి సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు సమాజంలో పరిస్థితి వేరు ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి వేరు. ఇదే సమయంలో కొన్ని విషయాలలో అబ్బాయిలు మాదిరిగా అమ్మాయిలు తయారవుతున్నారు. నేరాలు మరియు ఘోరాల్లో సైతం అబ్బాయిలతో పోటీపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెట్రో రైల్లో కిస్ పెట్టుకోవటం నుంచి.. ఒకరిపై మరొకరు పిడుగులు గుద్దుకునే వరకు అబ్బాయిలతో పోటీ పడుతున్నారు.
తాజాగా ఈ రకంగానే రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్ యాగ్నిక్ రోడ్డుపైన ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాహనాలు ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో జరిగిన గొడవ ఇద్దరు కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఒకపక్క గొడవ జరుగుతూ ఉండగానే చుట్టుపక్కల దుకాణంలో ఉన్న వ్యాపారుల సైతం తమ వ్యాపారం పక్కనపెట్టి అమ్మాయిలను ఆపకుండా ఆ గొడవని చూస్తూ ఆసక్తిగా తిలకించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ గొడవలో టీ షర్టులు లాగేసుకుని… ఒకరు ముఖం మీద మరొకరు గోర్లతో రక్కేసుకుంటూ తన దారుణంగా కొట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఓ యువకుడు ఆపేందుకు ప్రయత్నించగా.. అమ్మాయిలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా… చాలా దారుణంగా దాడి చేసుకున్నారు.
Two girls beaten by on the road
గొడవ జరుగుతుండగా జనాల్లో ఓ వ్యక్తి అమ్మాయిలు కొట్టుకునే సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ట్రాఫిక్ జామ్ కావటంతో అక్కడ ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు రావటంతో అమ్మాయిలు సైలెంట్ అయ్యారు. ఇద్దరమ్మాయిలని పోలీసులు అదుపులోకి.. తీసుకొని మందలించినట్లు సమాచారం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.