Viral News : ఏపీలో నాలుగు నెలల పాప ప్రపంచ రికార్డు సాధించింది. నందిగామ కు చెందిన ఓ చిన్నారి నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తుంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గుర్తించి వరల్డ్ రికార్డు సాధించింది. పాప కంటి చూపు మెరుగుపరచడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టిన తల్లి తన కుమార్తె ఆ కార్డులను శ్రద్ధగా చూస్తుండడానికి గమనించి మరింత శిక్షణ ఇచ్చింది. నాలుగు నెలల వయసున్న చిన్నారులు తమ దగ్గర ఉన్న వస్తువులను చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. చేతులను నోట్లో పెట్టుకోవాలని చూస్తుంటారు. కొత్త వాటిని చూసినప్పుడు ఎక్సైట్మెంట్ చూపిస్తారు.
తల్లిదండ్రులను గుర్తించి వారు కనిపించినప్పుడు కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు కోపం వచ్చినప్పుడు ఏడుస్తారు. నోటితో చిన్న చిన్న శబ్దాలు చేయడం మొదలు పెడతారు. కానీ కృష్ణాజిల్లా నందిగామ కు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య మాత్రం పక్షులు, కూరగాయలు, జంతువులు ఇలా 120 రకాల ఫోటోలను గుర్తించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కైవల్య తల్లి హేమ తమ బిడ్డ ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ పంపింది. మొత్తం 120 అంశాలను నాలుగు నెలల చిన్నారి గుర్తించడం ఒక రికార్డు అని నోబెల్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంస పత్రం తో పాటు పతకాన్ని కూడా పంపించింది.
వాస్తవానికి పాప కంటి చూపు మెరుగుపరిచే ఉద్దేశంతో ఆమె తల్లి బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు ఉన్న కార్డులను చూపించడం మొదలు పెట్టింది. ఆన్లైన్లో ఫ్లాష్ కార్డులను కొనుగోలు చేసినా ఆమె వాటిని చూపిస్తున్నప్పుడు కైవల్య నిశితంగా గమనిస్తుందని గ్రహించింది. కార్డును చూపిస్తూ దానిపై ఉన్న బొమ్మ పేరు చెప్పిన హేమ కొద్ది రోజుల తర్వాత రెండు కార్డులు చూపించి అందులోని ఒక చిత్రం పేరు చెబితే కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కూతురికి ఇలా కార్డులను మార్చి మార్చి చూపేది. అలా కైపల్య కార్డులను గుర్తుపట్టేది. కైవల్య తల్లిదండ్రులు హైదరాబాదులో ఉద్యోగం చేస్తుంటారు. పాప తండ్రి చల్లగుండ్ల రమేష్ క్వెస్ట్ గ్లోబల్ అనే కంపెనీల హార్డ్వేర్ ఉద్యోగిగా చేస్తున్నారు. తల్లి హేమ కాగ్నిజంట్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.