
Viral Video 28 year old young woman who married a 61 year old man
Viral Video : పెళ్లి అనేది మగ, ఆడవారి జీవితంలో కీలక ఘట్టం అంటారు. అందుకోసం చాలా పెద్ద ప్రాసెస్ నడుస్తుంది. అబ్బాయి, అమ్మాయికి సరైన జోడిని వెతకటం, జాతకాలు కలిసాయో లేదో చూడటం..కట్నకానుకలు ఇలా పెద్ద తతంగమే నడుస్తుంది. ఈ రోజుల్లో అయితే కొందరు లవ్ మ్యారేజ్‌కు జై కొడుతున్నారు. కొన్ని పెళ్లిళ్లను చూస్తే మాత్రం ఒక్కోసారి చాలా వింతగా అనిపిస్తుంటుంది.ఎందుకంటే వరుడికి, వధువుకు అస్సలు సెట్ కాదు. కానీ వీరికి పెళ్లి జరుగుతుంది. సంతోషంగా ఉంటుంటారు. ఇదంతా ఎలా సాధ్యమంటే అదంతా విధి రాత అని పెద్దలు సెలవిస్తుంటారు. తాజాగా జరిగిన పెళ్లిని చూస్తే నిజంగానే విధి రాతను నమ్మని వారు కూడా నమ్మేలా ఉంటుంది. 61 ఏళ్ల ముసలాడిని పెళ్లాడిన 28 ఏళ్ల యువతి
అసలు విషయం ఏంటంటే..తమిళనాడుకు చెందిన ఓ 61 ఏళ్ల వృద్ధుడిని ఓ 28 ఏళ్ల యువతి పెళ్ళాడింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి వీడియో చూసిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. అంత మంచి యువతి ఇవాలో రేపో టపా కట్టే ముసలాడిని పెళ్లాడటం ఏంటని ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఫ్రాన్స్‌లో నివసించే ఆ వృద్ధుడు కొద్దిరోజుల కిందట పుదుచ్చేరిలోని చుట్టాలను కలిసేందుకు తమిళనాడుకు వచ్చాడు. ఈ సందర్బంగా తాను అక్కడ ఒంటరిగా ఉంటున్నానని.. తనకు సాయం చేసేవారు ఎవరూ లేక ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు.
Viral Video 28 year old young woman who married a 61 year old man
తనకు ఓ తోడు కావాలని వారితో చెప్పాడట.. దీంతో వారు ఆ వ్యక్తికి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పుదుచ్చేరిలో నివాసముంటున్న ఓ 28 ఏళ్ల యువతి అతగాడిని పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పింది. దీంతో వీరిద్దరికి ‘మనక్కుల వినాయగర్’ టెంపుల్లో వివాహం జరిపించారు బంధువులు.కొన్ని రోజులు పుదుచ్చేరిలో ఉన్నాక వీరు ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్తారట.. అందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇదిలాఉంటే తనను పెళ్లి చేసుకున్నందుకు గాను పెళ్లికూతురి కుటుంబానికి వరుడు రూ. 2.5 కోట్లు ఇచ్చాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.