Viral Video : ఆరేళ్ల కింద‌ట త‌ప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్ర‌మంలో చూసి కంట క‌న్నీరు ఆగ‌లే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఆరేళ్ల కింద‌ట త‌ప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్ర‌మంలో చూసి కంట క‌న్నీరు ఆగ‌లే..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 November 2024,4:02 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : ఆరేళ్ల కింద‌ట త‌ప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్ర‌మంలో చూసి కంట క‌న్నీరు ఆగ‌లే..!

Viral Video : కొన్ని సంఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టిస్తుంటాయి. చాలా ఏళ్ల త‌ర్వాత పిల్ల‌ల‌ని క‌ల‌వ‌డం చూసిన ఆ తండ్రి భావోద్వేగానికి గురి కావ‌డం లేదంటే త‌ప్పిన పోయిన పిల్ల‌ల‌ని చూసి తండ్రి క‌న్నీరు పెట్టుకోవ‌డం వంటివి ఎన్నో జ‌రిగాయి.తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న అంద‌రికి కంట క‌న్నీళ్లు పెట్టించింది.
హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో ఎంతో మంది అనాధలు ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంఖ్య సుమారు 130 వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో బాలయ్య అనే వ్యక్తి తిరుగుతుంటే… అతడిని ఈ ఆశ్రయం నిర్వాహకులు చేరదీసి ఆశ్రయం కల్పించారు.

Viral Video తండ్రిని చూసి ఆనందం..

ఆరేళ్లుగా బాలయ్య అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. బాలయ్య కూతురు దివ్య.. నెల రోజుల కిందట ఆ ఆశ్రమంలో ఉన్నవారికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఆశ్రమం నిర్వాహకులతో.. తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పింది. తాజాగా మళ్లీ దివ్య అదే అశ్రమానికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఊహించని ఘటన జరిగింది. కన్నతండ్రిని గుర్తుపట్టి బాలయ్య కూతురు బాగోద్వేగానికి గురయ్యారు. తండ్రిని హత్తుకొని ఏడ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తండ్రి దొరికినందుకు సంతోషంగా ఉందని దివ్య చెబుతున్నారు.

Viral Video ఆరేళ్ల కింద‌ట త‌ప్పిపోయిన తండ్రి కూతుళ్లు అనాధాశ్ర‌మంలో చూసి కంట క‌న్నీరు ఆగ‌లే

Viral Video : ఆరేళ్ల కింద‌ట త‌ప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్ర‌మంలో చూసి కంట క‌న్నీరు ఆగ‌లే..!

తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్తామని ఆశ్రమ నిర్వాహకులను ఇద్దరు కూతుళ్లు అడిగారు. అయితే… ఈ సందర్భంగా కొన్ని కండిషన్స్ పెట్టిన వారు.. బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఇది చూసి చాలా మంది తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు! ఇలాంటి కూతుళ్లు ఉంటే చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.తమ వెంట ఉన్నపుడు తండ్రి విలువ తెలియదని.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని బాలయ్య కూతుళ్లు కోరుతున్నారు. ఇన్నాళ్లు తమ తండ్రికి ఆశ్రయం ఇచ్చిన మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది