Viral Video : పాముకి ప‌ట్టుబ‌డితే వీటి ప‌రిస్థితి ఏంటో త‌లుచుకుంటేనే భ‌య‌మేస్తోంది.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పాముకి ప‌ట్టుబ‌డితే వీటి ప‌రిస్థితి ఏంటో త‌లుచుకుంటేనే భ‌య‌మేస్తోంది..

 Authored By mallesh | The Telugu News | Updated on :29 March 2022,7:00 pm

viral video: ప్రతిరోజూ ఇంటర్నెట్ లో ఎన్నో భిన్న ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇవి నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరమైన జంతువులు, ప‌క్షుల‌కు సంబంధించినవే. కొన్ని వీడియోల్లో జంతువులు పోట్లాడ‌టం చూస్తుంటాం. వేటాడ‌ట‌మూ చూస్తూ ఉంటాం. అయితే కొన్ని జంతువులు జాతివైరం మరిచి స్నేహంగా క‌లిసి జీవిస్తుంటాయి. ఇలా చూసిన‌ప్పుడు మూచ్చ‌టేస్తుంటుంది. ఇట్లాంటి వీడియోలు సోషల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఉంటాయి.నాగు పాములు ఎక్కువగా ఎలుకలను తింటాయి. వాటి నివాస ప్రాంతములు చిట్టడవులు, పంట పొలాలు.

కాని మురుగుకాల్వలలో, బొరియలలో ఉండే ఎలుకలను తింటూ అవి ప‌ల్లెటూళ్లు, పట్టణాలలో కూడా క‌నిపిస్తుంటాయి.సాధార‌ణంగా పాములు ఎలుకలు, కప్పలు కనిపిస్తే ఓ ప‌ట్టాన‌ వదలవు. వాటిని మింగ‌కుండా వ‌ద‌ల‌వు. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాయి. పాత పెంకుటిళ్ల చూర్ల‌లో ఎలుక‌ల కోసం పాములు ఎక్కువ‌గా తీరుగుతుంటాయి. ఎలుక‌ల‌ను తింటూ అక్క‌డే క‌ద‌ల‌లేని స్థితిలో ప‌ట్టుబ‌డుతుంటాయి. ఇలా మ‌నం చాల‌నే చూసుంటాం. కానీ ఇక్క‌డ ఎలుక‌లు, ఓ క‌ప్ప పామును ప‌రుపులా మార్చుకుని తిరుగుతున్నాయి.ఈ వీడియోలో పాము ఒక కప్పను, రెండు ఎలుకలను తన వీపు పైన కుర్చోబెట్టుకొని సవారీ చేస్తూ కనిపించింది.

Viral Video in A snake frog two rats

Viral Video in A snake frog two rats

viral video: పాముకి ఎలుక‌లంటే పండ‌గే..

ఒక ప్రాంతంలో భారీ వర్షం కారణంగా, ఒక పాము, ఓ కప్ప, రెండు ఎలుకలు ఓ వాట‌ర్ కంటైనర్‌లో చిక్కుకున్నాయి. పాము కావాలనుకుంటే ఆ కప్పను, ఎలుకలను ఆహారంగా మార్చుకోవచ్చు.. కానీ ఆ పాము కంటైనర్‌లో నిండిన నీటి నుండి కప్ప, ఎలుకలప్రాణాలు రక్షించింది. నీటిలో మునిగి పోకుండా కప్ప, ఎలుకలు పాము వీపుపైకి ఎక్కి కూర్చున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒకేసారి ఎలుకలు, కప్పు చిక్కినప్పటికీ పాము చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప‌లు కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఓ కామెంట్ ప‌డేయండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది