Viral Video : కుక్కని టార్చర్ చేస్తున్న కాకి.. పాపం కుక్క తిరిగి ఏమి చేయలేక..
Viral Video : జంతువుల వీడియోలు భళే విచిత్రంగా ఉంటాయి. నిత్యం కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో పక్షులు, పిల్లులు, కుక్కలు, కోతుల వీడియోలు మనం ఎక్కువగా చూస్తుంటాం.. ఈ మధ్యకాలంలో పక్షులు చేసే విచిత్ర పనులు ఎవరో ఒకరు వీడియో తీసి షేర్ చేస్తుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయపెట్టిస్తే మరికొన్ని మానవత్వంతో స్పందించే దృశ్యాలు ఉంటాయి. ఇందులో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. పెంపుడు జంతువులైతే యజమానితో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాగే యజమాని ఏం చేస్తే అదే చేస్తుంటాయి..
అలాగే జంతువులకు కూడా స్నేహగుణం చాలా వరకు ఉంటుంది. ఒక్కోసారి చిన్న పిల్లలు ప్రమాదంలో పడితే వెంటనే రక్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. వాటిలో కూడా మానవత్వం ఉందని నిరూపిస్తుంటాయి. ఇలా ఎన్నో వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న పక్షులు ఒక్కోసారి జంతువులపై దాడి చేస్తుంటాయి. అవి తిరిగి దాడిచేయడానికి ప్రయత్నిస్తే పారిపోతుంటాయి. ఇలాంటిదే ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఒక చిన్న కాకి కుక్కలను తెగ టార్చర్ చేస్తున్నాయి.
Viral Video in Unfortunately, the dog can’t do anything back
భయపెట్టిన వదలకుండా వాటి వెంట పడుతూ పొడుస్తున్నాయి. చూడ్డానికి ఫన్నీగా అనిపించినా వాటిని మాత్రం బాధిస్తున్నాయి. కాకులు దాడి చేస్తుండటంతో నొప్పితో పరిగెడుతున్నాయి. అయినా కూడా వదలకుండా వెంటపడుతుండటం నవ్వుతెప్పిస్తోంది. అలాగే మరో కుక్కని కట్టివేయడం వల్ల దాన్ని వదలకుండా కాకి దాడిచేస్తోంది. పాపం కుక్క తిరిగి దాడి చేయాలని ప్రయత్నించినా కుదరడం లేదు.. ఇలా ఈ వీడియోలో చాలా సంఘటనలు జత చేసి పోస్ట్ చేయగా నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి…
