Punarnavi Bhupalam Family Friends Video Viral
Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. సినిమాలు చేసినా కూడా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత పునర్నవి ఇమేజ్ మారిపోయింది. అంతకు ముందు పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు వంటి చిత్రాల్లో పునర్నవి నటించింది. అయితే ఆమెకు మాత్రం బిగ్ బాస్ షోనే ఎక్కువగా పేరు తీసుకొచ్చింది. బిగ్ బాస్ మూడో సీజన్ ఇంట్లో పునర్నవి అడుగు పెట్టింది. మొదట్లో అంతగా ఫేమస్ అవ్వలేదు. కానీ రాహుల్ పునర్నవి ట్రాక్ ఎప్పుడైతే వర్కవుట్ అవుతూ వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇద్దరి పేర్లు నెట్టింట్లో మార్మోగిపోయాయి.
ఈ ఇద్దరి ప్రేమ, స్నేహం మీద ఎన్నెన్నో వార్తలు వచ్చాయి.బయటకు వచ్చాక వారి క్రేజ్ చూసుకుని వారే ఫిదా అయ్యారు. అయితే అవన్నీ బిగ్ బాస్ ఇంటి వరకే అని రాహుల్, పునర్నవిలు తేల్చి చెప్పారు. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక.. ఈ ఇద్దరికి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వచ్చాయి. తామిద్దరం మంచిస్నేహితులమేనని, ఇలా ఎప్పుడూ పెళ్లి గురించి అడిగితే.. తమ పర్సనల్ జీవితాలకు ఇబ్బందిగా ఉంటుందని రాహుల్ సుతిమెత్తంగా స్పందించేవాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు దూరంగానే ఉంటున్నారు.
Punarnavi Bhupalam Family Friends Video Viral
అయితే పునర్నవి మాత్రం ఇప్పుడు విదేశాల్లో ఉంది. తన ఉన్నత చదువుల కోసం అక్కడేఉంటుంది. అయితే తాజాగా పునర్నవి ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనిపించింది. నాలుగేళ్ల తరువాత ఇలా నా ఫ్యామిలీ వచ్చిందటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో తన చేతిలో పిల్లాడు ఉండటం, ఇద్దరు పిల్లలతో అలా నడుచుకుంటూ వెళ్లడంతో జనాలు ఆశ్చర్యపోతోన్నారు. ఏంటి పునర్నవికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారా?అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు తన ఫ్రెండ్ ఫ్యామిలీ అని తెలుస్తోంది.
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్లు లేదా రైమ్లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.