
Viral Video : సినీ ఫక్కీ టైపులో కళ్లల్లో కారం చల్లి పెళ్లి కూతురు కిడ్నాప్‌కి యత్నం
సినిమాలో జరిగే కొన్ని సంఘటనలు రియల్ లైఫ్‌లో జరగడం మనం చాలా సార్లు చూశాం. వాటిని చూసి ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోతుంటారు.తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యపరచింది. కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిప్లొమా చదివాడు. అదే సమయంలో కర్నూలు జిల్లా చాలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన గంగవరం స్నేహతో అతనికి పరిచయం అయింది. వారిద్దరి పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. అయితే చదువు తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు భావించారు. కాకపోతే పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారా అని వారిలో భయం ఉండేది..
అయితే ఏప్రిల్ 13న విజయవాడలోని దుర్గగుడిలో నందు-స్నేహ పెళ్లి చేసుకోవాలని భావించారు.అనంతరం వెంకటనందు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో బంధువుల సమక్షంలో ఈ నెల 21 న ఆదివారం ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకుంటున్నామని వధువు తల్లిదండ్రులకు మెసేజ్ పంపారు. అంతేకాకుండా అడ్రెస్ కూడా పంపింది పెళ్లి కూతురు. అయితే ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బంధువులు ఫంక్షన్ హాల్ వచ్చి నానా రచ్చ చేసి ఆమెని తీసుకెళ్లారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ నడిచింది. వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లికొడుకు, వాళ్ల బంధువులపై కారం చల్లారు. స్నేహను అపహరించేందు కు ప్రయత్నించారు.
Viral Video : సినీ ఫక్కీ టైపులో కళ్లల్లో కారం చల్లి పెళ్లి కూతురు కిడ్నాప్‌కి యత్నం
పెళ్లికొడుకు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ క్రమంలో నందుతో సహా, బంధువులకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం వధువును బలవంతంగా అక్కడ నుంచి ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న కారులో ఎక్కించి వధువుని స్వగ్రామానికి తీసుకెళ్లారు.ఈ విషయంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సినీ ఫక్కీలో ఈ ఘటన జరగడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.