Viral Video : కోతులు గురించి తెలియని వారుండరు. వాటి చేష్టలు చాలా వింతగా ఉంటాయి. అందుకే ఎవరైనా వింతగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే వారిని కూడా కోతి చేష్టలతో పోలుస్తారు. కోతులు ఎక్కువగా అడవుల్లో సంచరిస్తుంటాయి. అడువుల్లో దొరికే పండ్లను తింటూ జీవనం సాగిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో అడవుల నరికివేత తీవ్రతరం కావడంతో తినేందుకు ఆహారం దొరక్క అవి గుంపులుగుంపులుగా నగరంలోకి వలస వస్తున్నాయి. మన దేశంలో అయితే ప్రధానంగా కోతులు ఆలయాల వద్ద దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే ఇండియాలోని ఆలయాలు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవును ఆనుకుని ఉంటుంటాయి. దీంతో వానరాలు కూడా ఆహారం కోసం అక్కడకు వస్తుంటాయి.
సాధారణంగా కోతుల్లో సంతానం త్వరగా అభివృద్ధి జరుగుతుంది. దీంతో వాటి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు అడువులకు పరిమితైన వనరాలు నగరాల్లోకి వస్తుండటంతో సాధారణ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. జంతు ప్రదర్శనలో ఉండే కోతులు కొంత కుదురుగా ఉంటాయి. అదే అడవుల నుంచి ఇళ్లలోకి వచ్చే కోతులు అల్లరల్లరి చేస్తుంటాయి. సందడి చేయడంతో పాటు నానా రభస చేస్తుంటాయి. ఆహారం కోసం అన్ని వెతుకుంటాయి. మనుషులు ఏదైనా వస్తువులు తీసుకుని వెళ్తుంటే ఆహారం అనుకుని వెంటపడి మరీ బ్యాగులు లాక్కుంటాయి. ఇవ్వకపోతే మీదపడి మరీ దాడి చేస్తుంటాయి. దీనంతటికీ వాటి ఆకలే కారణమని కొందరుఅంటుంటారు.
వానరాలకు కడుపునిండా ఆాహారం దొరికితే ఎవరి జోలికి వెళ్లవని, హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటాయి. సంతోషంగా ఆడుకుంటుంటాయి. చెట్ల కొమ్మలపై గంతులేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి. ఒక్కోసారి కోతులు చేసే పనులు మనందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఇళ్లలోకి వస్తున్న కోతులు పిల్లులు, కుక్క పిల్లలను తమ వెంట ఉంచుకుని వాటిని తమ పిల్లలుగా భావించి చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు చాలా వరకు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ వీడియో ఓ కోతి డల్‌గా ఉండగా.. మరో వానరం ఆపిల్ తింటూ దాని కళ్లలోకి చూస్తుంటుంది. ఆపిల్ కావాలా అన్నట్టు చేతితో చూపిస్తూ మళ్లీ అదే తింటుంది. ఎదురుంగా ఉన్న వానరం మాత్రం అలిగినట్టు దీనగా మొహం వాలేసి చూస్తుంటుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నెటిజన్లు దీనిని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.