Viral Video : ఈ వీడియో చూస్తే న‌వ్వాపుకోలేరు.. ఊరికే అనలేదు కోతి చేష్టలని.. వీడియో వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఈ వీడియో చూస్తే న‌వ్వాపుకోలేరు.. ఊరికే అనలేదు కోతి చేష్టలని.. వీడియో వైరల్!

Viral Video : కోతులు గురించి తెలియని వారుండరు. వాటి చేష్టలు చాలా వింతగా ఉంటాయి. అందుకే ఎవరైనా వింతగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే వారిని కూడా కోతి చేష్టలతో పోలుస్తారు. కోతులు ఎక్కువగా అడవుల్లో సంచరిస్తుంటాయి. అడువుల్లో దొరికే పండ్లను తింటూ జీవనం సాగిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో అడవుల నరికివేత తీవ్రతరం కావడంతో తినేందుకు ఆహారం దొరక్క అవి గుంపులుగుంపులుగా నగరంలోకి వలస వస్తున్నాయి. మన దేశంలో అయితే ప్రధానంగా కోతులు ఆలయాల వద్ద దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 January 2022,7:00 am

Viral Video : కోతులు గురించి తెలియని వారుండరు. వాటి చేష్టలు చాలా వింతగా ఉంటాయి. అందుకే ఎవరైనా వింతగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే వారిని కూడా కోతి చేష్టలతో పోలుస్తారు. కోతులు ఎక్కువగా అడవుల్లో సంచరిస్తుంటాయి. అడువుల్లో దొరికే పండ్లను తింటూ జీవనం సాగిస్తుంటాయి. ఈ మధ్యకాలంలో అడవుల నరికివేత తీవ్రతరం కావడంతో తినేందుకు ఆహారం దొరక్క అవి గుంపులుగుంపులుగా నగరంలోకి వలస వస్తున్నాయి. మన దేశంలో అయితే ప్రధానంగా కోతులు ఆలయాల వద్ద దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే ఇండియాలోని ఆలయాలు ఎక్కువగా కొండ ప్రాంతాలు, అడవును ఆనుకుని ఉంటుంటాయి. దీంతో వానరాలు కూడా ఆహారం కోసం అక్కడకు వస్తుంటాయి.

Viral Video : ఈ వానరం చేష్టలు చూస్తే నవ్వు ఆగదు

సాధారణంగా కోతుల్లో సంతానం త్వరగా అభివృద్ధి జరుగుతుంది. దీంతో వాటి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు అడువులకు పరిమితైన వనరాలు నగరాల్లోకి వస్తుండటంతో సాధారణ ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. జంతు ప్రదర్శనలో ఉండే కోతులు కొంత కుదురుగా ఉంటాయి. అదే అడవుల నుంచి ఇళ్లలోకి వచ్చే కోతులు అల్లరల్లరి చేస్తుంటాయి. సందడి చేయడంతో పాటు నానా రభస చేస్తుంటాయి. ఆహారం కోసం అన్ని వెతుకుంటాయి. మనుషులు ఏదైనా వస్తువులు తీసుకుని వెళ్తుంటే ఆహారం అనుకుని వెంటపడి మరీ బ్యాగులు లాక్కుంటాయి. ఇవ్వకపోతే మీదపడి మరీ దాడి చేస్తుంటాయి. దీనంతటికీ వాటి ఆకలే కారణమని కొందరుఅంటుంటారు.

Viral Video the monkey actions video viral

Viral Video the monkey actions video viral

వానరాలకు కడుపునిండా ఆాహారం దొరికితే ఎవరి జోలికి వెళ్లవని, హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటాయి. సంతోషంగా ఆడుకుంటుంటాయి. చెట్ల కొమ్మలపై గంతులేస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి. ఒక్కోసారి కోతులు చేసే పనులు మనందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఇళ్లలోకి వస్తున్న కోతులు పిల్లులు, కుక్క పిల్లలను తమ వెంట ఉంచుకుని వాటిని తమ పిల్లలుగా భావించి చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియోలు చాలా వరకు వైరల్ అయ్యాయి. తాజాగా ఓ వీడియో ఓ కోతి డల్‌గా ఉండగా.. మరో వానరం ఆపిల్ తింటూ దాని కళ్లలోకి చూస్తుంటుంది. ఆపిల్ కావాలా అన్నట్టు చేతితో చూపిస్తూ మళ్లీ అదే తింటుంది. ఎదురుంగా ఉన్న వానరం మాత్రం అలిగినట్టు దీనగా మొహం వాలేసి చూస్తుంటుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నెటిజన్లు దీనిని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది