Vishnu priya dance video
Vishnu priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో కి యాంకరింగ్ చేసి ఫుల్ ఫేమస్ అయింది. బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ బ్యూటీకి బుల్లితెరపై యాంకరింగ్ అవకాశాలు రాలేదని చెప్పాలి. కానీ అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్స్ లలో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల సీరియల్ నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్ ద్వారా విష్ణుప్రియ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఇక విష్ణు ప్రియ అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఇక ఆమధ్య సీనియర్ నటుడు చక్రవర్తితో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఇకపోతే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది.
అయితే తాజాగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. సాహో సినిమాలోని ఐటమ్ సాంగ్కు విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఎల్లో కలర్ శారీలో టెంప్ట్ చేసేలా విష్ణు ప్రియ డాన్స్ చేసింది. ఈ వీడియో పై నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అబ్బ విష్ణు ప్రియ ఏమన్నా డాన్స్ చేసిందా అని కొందరు, విష్ణు ప్రియ నా మజాకా అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా అవకాశాల కోసం ఏమో కానీ విష్ణు ప్రియ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.