Holi : హోలీ సంబరాలలో సినీ తార‌ల‌ ఫోటోస్‌..!

Authored By vamana sai | The Telugu News | Updated on : 30 March 2021, 9:48 pm

Holi :హోలీ పండుగ అంటే ప్రతీ ఒక్కరికీ ఎంతో ఇష్టమైనది అని ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. జీతం ఎప్పుడు రంగులమయం కావాలని కోరుకుంటూ చిన్నా పెద్దా.. పేద ధనిక, కులం, మతం అన్న బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ.

Tollywood celebrities are in holi celebrations

Tollywood celebrities are in holi celebrations

ఒకప్పుడు హోలీ పండుగ అనేది నార్త్ ఇండియన్స్ కల్చర్ మాత్రమే అని భావించేవారు. కానీ రాను రానూ ప్రతీ ఒక్కరు ఈ హోలీ పండుగను జరుపుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ ఏడాది హోలీ పండుగను రెండు రోజులు జరుపుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సినీ తారలంతా తమ కుటుంబాలతో కలిసి ఎంతో ఉత్సాహంగా హోలీ సంబరాలను జరుపుకున్నారు.

Tollywood celebrities are in holi celebrations

Tollywood celebrities are in holi celebrations

టాలీవుడ్ స్టార్స్ తో పాటు బుల్లితెర యాంకర్స్ కూడా హోలీ సంబరాలను అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. అంతేకాదు ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో అభిమానులకి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ తాజా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood celebrities are in holi celebrations

Tollywood celebrities are in holi celebrations

Holi Jr Ntr : హోలీ పండుగ సంబరాలలో తారక్ ఫ్యామిలీ …

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి.. పిల్లలతో తన నివాసంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాడు. తారక్ ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఏమాత్రం ఖాళీ దొరికినా కుటుంబంతో కలిసి గడపడానికి ఇష్టపడతాడు. అలాగే ఈసారి హోలీ పండుగను బాగా జరుపుకున్నారు.

Tollywood celebrities are in holi celebrations

Jr Ntr Holi

Holi Allu Arjun : రంగుల్లో ముద్దైన అల్లు అర్జున్ – స్నేహ ఫ్యామిలీ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహలత రెడ్డి ఎంత అన్యోన్యంగా ఉంటారో వారిని బయట పబ్లిక్ ఫంక్షన్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. అల్లు అర్జున్ సినిమాల ప్రభావం ఫ్యామిలీ మీద అసలు పడనీయడు. సినిమా షూటింగ్ అయిపోయిందంటే మరుక్షణం ఇంటి ధ్యాస తప్ప మరొకటి ఉండదు. అల్లు అర్జున్ – స్నేహలని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. కాగా తాజాగా హోలీ పండుగని అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నాడు.

Tollywood celebrities are in holi celebrations

Allu Arjun Tollywood celebrities are in holi celebrations

Holi kajal aggarwal :  పెళ్ళి తర్వాత భర్త కిచ్లుతో మొదటి హోలీ జరుపుకున్న చందమామ..

చందమామ కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30న స్నేహితుడు గౌతం కిచ్లు ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత మాల్దీవుల్లో గ్రాండ్ గా హనీమూన్ సెలబ్రేట్ చేసుకున్న కాజల్ ఆ తర్వాత నుంచి ఆచార్య..మోసగాళ్ళు..ముంబై సాగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతోంది. కాగా ఇటీవల పెళ్ళి తర్వాత మొదటిసారి వచ్చిన హోలి పండుగనో భర్తతో కలిసి ఘనంగా జరుపుకుంది. కొత్త జీవితం ఎంతో కలర్ ఫుల్ గా సాగాలని కోరుకుంది.

Tollywood celebrities are in holi celebrations

Kajal Tollywood celebrities are in holi celebrations

Holi Anasuaya : బుల్లితెర యాంకర్స్ కూడా హోలీ సంబరాలలో మునిగిన వేళ..

బుల్లితెర పాపులర్ యాంకర్స్ అనసూయ భరద్వాజ్ తన భర్త .. పిల్లలతో కలిసి హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే శ్రీముఖి..మరో యాంకర్ వర్షిణి సౌందరాజన్ హోలీ సంబరాలను జరుపుకున్నారు.

Tollywood celebrities are in holi celebrations

Anasuya Tollywood celebrities are in holi celebrations

వీరే కాదు.. ఆర్ ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్ పుత్..కంచె భామ ప్రగ్యా జైస్వాల్..సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ సహా పలువురు సినిమా తారలంతా హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ హోలీ పండుగను జరుపుకోవడం సర్వాత్రా ఆసక్తిని కలిగించింది.

vamana sai

No bio available for this author.

  1. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  2. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  3. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  4. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  5. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  6. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  7. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp