Home » Adilabad » Girlfriend Commits Suicide After Boyfriend Refuses To Marry
adilabad

ఆరునెళ్ల పాటు ప్రేమించి… చివ‌రికి ఏం జ‌రిగిందంటే ?

Authored By
Tech Desk
The Telugu News | Published on: July 26, 2021, 12:38 pm
Advertisement

బెల్లంప‌ల్లి  : ప్రేమించి, పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆరునెళ్లు స‌హ‌జీవ‌నం చేసిన త‌ర్వాత ప్రియుడు పెళ్లికి నిరాక‌రించ‌డంతో ప్రియురాలు నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హత్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన సంఘ‌ట‌న బెల్లంప‌ల్లి మండ‌లంలో చోటు చేసుకుంది. బెల్లంప‌ల్లి రూర‌ల్ సిఐ కె. జ‌గ‌దీష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మండ‌లంలోని పెర్క‌ప‌ల్లి గ్రామానికి చెందిన పిల్ల‌ల ప్రియాంక హైద‌రాబాద్‌లో న‌ర్సింగ్ చ‌దువుతోంది.

Advertisement

బెల్లంపల్లి పరిధిలోని రండ‌గంబాల బ‌స్తీకి చెందిన కందుల ప్రేమ్ కుమార్ పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించాడు. ప్రియాంక‌తో ఆరు నెళ్లుగా స‌హ‌జీవ‌నం చేశాడు.

Advertisement

చివ‌రికి ప్రేమ్ కుమార్ పెళ్లికి నిరాక‌రించ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన ప్రియాంక ఇంటివ‌ద్ద నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ప్రియాంక‌ను వెంట‌నే బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి