ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల దీవెనలతోనే పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినట్లు జగన్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏపీలోని ప్రతీ కుటుంబం, ప్రతీ మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 13,081 పంచాయతీలకుగాను 10,536 పంచాయతీల్లో అనగా 81 శాతం వైసీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏకంగా 75కు 74 చోట్ల అనగా 99 శాతం వైసీపీ అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. ప్రతీ ఎన్నికల్లో సడలని ప్రేమను, అప్యాయతను ప్రజలు పంచుతున్నారన్నారు. ప్రతిపక్షం ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో లేదని విమర్శించారు. వైసీపీ సర్కారును ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ, ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటానని సీఎం జగన్ పేర్కొన్నారు.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.