YS Jagan Mohan Reddy Schemes : జగనన్న వసతి, విద్యా దీవెన వలన తన జీవితం మారిపోయిందంటూ ఎమోషనల్ అయిన ఓ స్టూడెంట్..
ప్రధానాంశాలు:
Y. S. Jaganmohan reddy schemes : జగనన్న వసతి, విద్యా దీవెన వలన తన జీవితం మారిపోయిందంటూ ఎమోషనల్ అయిన ఓ స్టూడెంట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఓడి, విద్యా దీవెన పథకాలని అమలు చేశారు. ఈ పథకం వలన విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు.
YS Jagan Mohan Reddy Schemes : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఓడి, విద్యా దీవెన పథకాలని అమలు చేశారు. ఈ పథకం వలన విద్యార్థులు చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా వారి చదువుకు ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకాన్ని విడతలవారీగా విద్యార్థులకు అందిస్తున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలోనే జగనన్న అందిస్తున్న విద్యా దీవెన పథకం వలన తన జీవితం మారిపోయింది అంటూ ఒక స్టూడెంట్ ఎమోషనల్ అయిపోయారు. విద్యా దీవెన సదస్సులో ఓ మీడియాతో మాట్లాడిన ఆ విద్యార్థిని కొంతమంది తల్లులు పిల్లలని చదివించలేక మధ్యలోనే చదువును ఆపేస్తుంటారు. కానీ జగనన్న పెట్టిన అమ్మఒడి, విద్యా దీవెన పథకం వలన ఎంతోమంది చదువుకుంటున్నారు…
కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఆడపిల్లలకి వెంటనే పెళ్లిళ్లు చేస్తారు. కానీ జగనన్న విద్యా దీవెన వలన ఆడపిల్లలంతా చదువుకుంటున్నారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం చాలామంది సంతకాల కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. సచివాలయంలో కాస్ట్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే వాలంటీర్లు ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తున్నారు. ఇది చాలా బెటర్. జగనన్న మరో ఐదు సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డెవలప్ అవుతుంది. మళ్లీ అధికారంలోకి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రావాలి అని ఆ విద్యార్థిని కోరుకున్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాల వలన స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడ్డాయి. స్టూడెంట్స్ కి ఇంతలా డెవలప్ ఉంటే తర్వాత రోజుల్లో రాష్ట్రానికి కూడా మంచి డెవలప్ ఉంటుంది.
వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలను, మంచి విద్యను అందిస్తున్నాయని, ఇదంతా వై.యస్.జగన్మోహన్ రెడ్డి వలనే అయిందని విద్యార్థినిలు తెలిపారు. అమ్మఒడి, విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ వలన విద్యార్థులకు చాలా అండగా ఉంది. దేశానికి వెన్నెముక రైతు అంటారు. అలాగే దేశానికి యువత కూడా వెన్నెముక లాంటివారే. ఇక జగన్ ప్రభుత్వం ముందుగా యువతను ఎక్కువగా సపోర్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని కూడా బాగా డెవలప్ చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
