Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీద సెటైర్స్ వేసిన ఆలీ … ఏమన్నారంటే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీద సెటైర్స్ వేసిన ఆలీ … ఏమన్నారంటే

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,6:30 pm

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలలో ఆలీ కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలీ మంచి స్నేహితులైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేత అయితే ఆలీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ నుంచి ఆలీ పదవి పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆలీ ప్రతిపక్ష పార్టీ అయిన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఆలీ అన్నారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని ఆలీ చెప్పుకొచ్చారు.

2019 ఎన్నికల్లో వైసీపీకి 151 కోట్లు వచ్చాయని, ప్రజలేమి ఊరికే ఓట్లు వేయలేదని ఆలీ కామెంట్స్ చేశారు. ప్రజలు జగన్ నమ్మారని, ఆయన చేతిలో రాష్ట్రం బాగుంటుందని ప్రజలు అనుకున్నారని, అందుకే గెలిపించాలని ఆలీ అన్నారు. రాజధాని ఏది అయినా అభివృద్ధి మాత్రం అన్ని చోట్ల జరుగుతుందని ఆలీ పేర్కొన్నారు. షూటింగ్ కోసం విశాఖకు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్లు, బీచ్లు బాగున్నాయని, విశాఖలో ఎలాంటి అభివృద్ధి లేని సమయంలో కూడా షూటింగ్ లు జరిగాయని విశాఖను అభివృద్ధి చేస్తే ఇతర భాషల సినిమాల షూటింగులు సైతం విశాఖలో జరుగుతాయని ఆలీ కామెంట్స్ చేశారు.

ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్ ఏమాత్రం అర్థం లేదని ఆలీ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై ఆలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పదవి దక్కిన అధికారంతో వైసీపీ పార్టీకి సపోర్టుగా ఆలీ ఇలా మాట్లాడుతున్నారు అని కొందరు అంటున్నారు. ఈ కామెంట్ల వలన ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఆలీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎంతో మంచి ఫ్రెండ్స్ అయినా పవన్ కళ్యాణ్ ఆలీ పార్టీల వలన తమ మధ్య దూరం పెంచుకుంటున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది