Pensions : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. అయితే పెన్షన్లు అందుకుంటున్న వారిలో అర్హత లేని వారు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సర్వే చేయించింది. ముఖ్యంగా దివ్యాంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు సేకరించింది.రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడిక్, వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లను తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ప్రభుత్వం ఈ తరహా పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీమ్‌లను నియమించింది. మెడికల్ ఫింఛన్ దారులను వారి ఇంటివద్ద మెడికల్ టీమ్ లు తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు పీజీ వైద్య విద్యార్ధులు రోజుకు 200 మంది లబ్దిదారులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి పెన్షనర్ల పరిశీలన ఉంటుంది. పెన్షనర్లంతా తప్పనిసరిగా వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు హాజరు కాకుంటే పెన్షన్ నిలిచిపోనుంది. చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి తనిఖీ జరుగుతోంది. బోగస్ అని తేలితే వెనువెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
లబ్దిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు. పింఛన్ దారులను తనిఖీ చేసే టీమ్‌లో ఆర్ధోపెడీషియన్, జనరల్ పిజీషియన్, పిహెచ్‌సి మెడికల్ ఆఫీసరు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకొంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా రీ వెరిఫికేషన్ జరుగనుంది. ఈ ప్రక్రియలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరీశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం వీరికి తొలుత నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత పెన్షన్ల రద్దు నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
Shani : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.…
Unilever : భారతదేశంలో హిందుస్తాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ అయిన యూనిలీవర్,…
Sreeleela : చుక్కల చీరలో చుక్కలు అందాలతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల.. ఫోటోస్..!
Donald Trump : భారతదేశం India యొక్క ఇటీవలి స్టాక్ మార్కెట్ గందరగోళం కాస్త సద్దుమణుగుతుండగా పెట్టుబడిదారులు భవిష్యత్తు వైపు…
Pawan Kalyan : ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ TDP పార్టీ నేత…
T Padma Rao Goud : సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.…
Actress : ఇటీవలి కాలంలో చాలా మంది లైంగిక దాడుల గురించి నిర్భయంగా మాట్లాడుతూ తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.…
Venu Swamy : ఇటీవల వేణు స్వామి సంచలనాలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. naga chaitanya నాగ చైతన్య, శోభిత…
This website uses cookies.