Karthika Deepam 2 Today Episode September 5th : కార్తీక దీపం 2 : జ్యోత్స్న-సూరజ్ ప్రేమపై క్లారిటీ.. షాక్‌లో మాలిని!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: September 5, 2026, 3:00 pm
  •  Karthika Deepam 2 Today Episode September 5th కార్తీక దీపం 2 సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్లో ఊహించని భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సూరజ్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం జ్యోత్స్న జీవితంలోకి వచ్చాడనే నిజం

Karthika Deepam 2 Today Episode September 5th : కార్తీక దీపం 2 సెప్టెంబర్ 5వ తేదీ ఎపిసోడ్లో ఊహించని భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సూరజ్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం జ్యోత్స్న జీవితంలోకి వచ్చాడనే నిజం ఇప్పటికే బయటపడింది. అయితే తాజాగా కార్తీక్‌తో జరిగిన సంభాషణలో సూరజ్ తన మనసులో దాచుకున్న బాధను బయటపెట్టడంతో కథ మరింత కీలక మలుపు తిరిగింది. మరోవైపు సూరజ్ నిజంగానే జ్యోత్స్నను ప్రేమిస్తున్నాడా? కృష్ణమూర్తి బాబాయి మరణం వెనుక అసలు నిజం ఏంటి? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి.

Karthika Deepam 2 Today Episode September 5th : కార్తీక దీపం 2 : జ్యోత్స్న-సూరజ్ ప్రేమపై క్లారిటీ.. షాక్‌లో మాలిని!

Karthika Deepam 2 Today Episode September 5th : కార్తీక దీపం 2 : జ్యోత్స్న-సూరజ్ ప్రేమపై క్లారిటీ.. షాక్‌లో మాలిని!

Karthika Deepam 2 Today Episode September 5th జ్యోత్స్నను ప్రేమించలేదని చెప్పిన సూరజ్

గత ఎపిసోడ్‌లో జ్యోత్స్న.. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవడానికే సూరజ్ తన జీవితంలోకి వచ్చాడా? తన మనసుతో ఆటలాడాడా? అని నిలదీస్తుంది. అందుకు సూరజ్ అవునని సమాధానం ఇస్తాడు. తాను ప్రేమించలేదని తన కళ్లలోకి చూస్తూ చెప్పాలని జ్యోత్స్న అడుగుతుంది. అప్పుడు సూరజ్.. తన కుటుంబానికి ఏం జరిగిందో జ్యోత్స్నకు పూర్తిగా తెలుసని, అన్నీ తెలిసి కూడా ఆ ప్రశ్న అడుగుతున్నావా అని ప్రశ్నిస్తాడు. అంతేకాదు, “మా అమ్మ శత్రువులు నా శత్రువులే అని చెప్పావు కదా?” అంటూ గుర్తు చేస్తాడు. సూరజ్ అనే వ్యక్తి తన జీవితంలోకి రాకముందు ఎలా ఉండేదో అలాగే ఉండాలని, తనకు నచ్చినట్లు తాను జీవిస్తానని, జ్యోత్స్న కూడా తనకు నచ్చినట్లు జీవించాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక దీప, కార్తీక్‌లు దక్షిణామూర్తి ఇంటికి రావడంతో దక్షిణామూర్తి, మాలినిలు ఒక్కసారిగా షాక్ అవుతారు. తమ అత్తను చావు అంచుల వరకు తీసుకెళ్లే పరిస్థితి మీ వల్లే వచ్చిందని కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే కూతురి గురించి దక్షిణామూర్తి బాధపడుతుండటంతో కార్తీక్ మరింత భావోద్వేగానికి లోనవుతాడు.తమ అత్తపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి తన మరదలి జీవితాన్ని నాశనం చేయవద్దని కార్తీక్ వేడుకుంటాడు. మీకు అంత కోపం ఉంటే తామే మీ ఇంట్లో ఉంటామని, మీకు సేవ చేస్తామని, తమపై ఉన్న పగను తమపైనే తీర్చుకోవాలని దీప కూడా చెబుతుంది. దీంతో మాలిని.. సుమిత్ర విషయంలో ప్రతిసారీ అడ్డుగా వస్తున్నావంటూ దీపపై మండిపడుతుంది.మరోవైపు జ్యోత్స్నతో దాస్ మాట్లాడుతూ వెంటనే దక్షిణామూర్తి ఇంటికి వెళ్లి ఆమె తన కూతురేనని చెబుతానని అంటాడు. కానీ జ్యోత్స్న మాత్రం సుమిత్ర కూతురిననే కారణంతోనే తనను ప్రేమించాడని, ఇప్పుడు తాను సుమిత్ర కూతురు కాదని తెలిస్తే తన ముఖం కూడా చూడడని అంటుంది. సూరజ్ తనను మోసం చేసినా అతను చాలా మంచివాడని జ్యోత్స్న చెప్పడం గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.

Karthika Deepam 2 Today Episode September 5th ఇక సెప్టెంబర్ 5న ప్రసారమైన 771వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ సూరజ్‌ను నేరుగా నిలదీస్తాడు. “నిన్ను నమ్మినందుకు థ్యాంక్స్ చెప్పేలా చేసి చివరికి మమ్మల్నే ఇరికించావు. నీపై నాకు ఎన్నోసార్లు అనుమానం వచ్చింది. కానీ నువ్వు జెంటిల్మెన్ అనుకునేలా చేశావు. ఎవరో ఒక డ్రామా ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి నాలుగేళ్లుగా సూరజ్‌ను నేనే పెంచానని చెప్పించావు. నువ్వు మాలిని కొడుకువని తెలియగానే ఆ పెద్దాయన జంప్ అయ్యాడు. నువ్వు ఇచ్చిన ట్విస్ట్‌కు మా తలలు తిరిగిపోయాయి. ఒక మనిషిని నమ్మించడానికి ఇంతలా దిగజారిపోతావా?” అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అందుకు సూరజ్.. తాను చేస్తున్నదంతా తన తల్లి చెప్పిన దారిలోనే నడుస్తూ చేశానని చెబుతాడు. అయితే తన కుటుంబాన్ని దూరం చేసిందీ, పరిస్థితులను ఇంత దూరం తీసుకొచ్చిందీ వారి వల్లేనని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేస్తాడు.

జ్యోత్స్న జీవితానికి న్యాయం చేయమన్న కార్తీక్

జ్యోత్స్న సూరజ్‌ను ఇప్పటికీ మరిచిపోలేకపోతోందని కార్తీక్ చెబుతాడు. తమ అత్త తన కూతురి జీవితం నాశనమైపోయిందని ఏడుస్తోందని, కుటుంబం మొత్తం బాధలో ఉందని వివరిస్తాడు. జ్యోత్స్న జీవితానికి న్యాయం చేయాలని సూరజ్‌ను కోరుతాడు.దానికి సూరజ్.. పెళ్లి ఎందుకు ఆగిపోయిందో అర్థం చేసుకోలేనంత అమాయకుడు కార్తీక్ కాదని, తాను ఇదంతా కేవలం తన తల్లి కోసమే చేశానని చెబుతాడు. దీంతో కార్తీక్ తీవ్రంగా స్పందిస్తాడు.“ప్రతీకారం పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని నమ్మించి మోసం చేయడాన్ని మగతనం అనుకుంటున్నావా? దానికి ఏదైనా గోల్డ్ మెడల్ వస్తుందా?” అని ప్రశ్నిస్తాడు. తన తండ్రి కారణంగా సూరజ్ తల్లి కాళ్లు పోయాయని, అదే విధంగా సూరజ్ తండ్రి చనిపోవడానికి తమ అత్తే కారణమని భావించి అతను జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేశాడని గుర్తుచేస్తాడు.

అయితే సూరజ్ తండ్రి కారణంగా తన తల్లి కాలు కోల్పోయినందుకు తాము ఏం చేయాలని కార్తీక్ ఎదురు ప్రశ్నిస్తాడు.సూరజ్ కూడా తన బాధను అంతే తీవ్రంగా బయటపెడతాడు. తమ మావయ్య దశథర అసలు తమ అత్త జీవితంలోకి రాకపోయి ఉంటే, దక్షిణామూర్తి చూసిన సంబంధమే ఆమె చేసుకునేదని, అందరూ సంతోషంగా ఉండేవారని చెబుతాడు. తమ అత్త మనసును మార్చింది దశథరేనని, ఆమెను పెళ్లి చేసుకున్నది కూడా అతడేనని, చివరికి తమ అత్తను తమకే శత్రువుగా మార్చింది కూడా అతడేనని అంటాడు.సంబంధం వద్దని చెప్పిన కారణంతో తమ అత్త తమను వదిలేసి దశథరతో వెళ్లిపోయిందని, ఆ రోజు తమ కుటుంబం పడిన బాధ ఎవరికీ కనిపించలేదని సూరజ్ ఆవేదన వ్యక్తం చేస్తాడు.“కాళ్లు పోయిన తల్లి నీ కళ్లముందే ఉందని సంతోషించు. కానీ నేను తండ్రినే కోల్పోయాను. మా జీవితాల్లో ఎలాంటి వెలుగు లేదు” అని సూరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

తండ్రిని కోల్పోయిన బాధను గుర్తుచేసుకున్న సూరజ్

ఆ ప్రమాదం చేసిన వ్యక్తి మీ అమ్మ పేరు చెప్పినా, నాన్న పేరు చెప్పినా తాము నిజమని నమ్మేవాళ్లమని సూరజ్ చెబుతాడు. కానీ అన్యాయంగా తమ అత్త తన తండ్రిపై కేసు పెట్టిందని, ఆ అవమానాన్ని తట్టుకోలేక తన తండ్రి చనిపోయాడని వివరిస్తాడు. నడవలేక చక్రాల కుర్చీకే పరిమితమైన తన తండ్రి ఎంత బాధతో జీవించాడో తాను చూశానని, భర్తను కోల్పోయి ఎలాంటి సంతోషానికి నోచుకోకుండా తన కోసం మాత్రమే బతికిన తల్లిని కూడా కళ్లారా చూశానని సూరజ్ చెబుతాడు. “ఇక్కడ నష్టం రెండు వైపులా జరిగింది. నీకు ఒక మనిషి మిగిలాడు. నాకు మాత్రం నా తండ్రి అస్తికలు మిగిలాయి. తండ్రి లేకుండా ఒక పిల్లాడు పెరిగితే ఆ బాల్యం ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే ఊహించుకో” అంటూ సూరజ్ కంటతడి పెట్టడం ఎపిసోడ్‌లో అత్యంత ఎమోషనల్ సీన్‌గా నిలుస్తుంది. తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని తన తల్లి చెప్పిందని సూరజ్ అంటాడు. తన తండ్రిని తన నుంచి దూరం చేసే హక్కు సుమిత్ర అత్తకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తాడు. ఆమె తన తండ్రిని వదిలేసిందని, అందుకు తన తండ్రిని తన నుంచి దూరం చేయడం సరైందా అని నిలదీస్తాడు.

కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, ఇంకెన్ని సౌకర్యాలు ఉన్నా తనకు సంతోషం రాలేదని చెబుతాడు. తన నాన్న బతికుంటే బాగుండేదని అనుకోని రోజు లేదని, జీవితాంతం ఎదురుచూసినా తన తండ్రి తిరిగి రాడని బాధపడతాడు. తాను కడుపులో ఉన్నప్పుడే తన నాన్నను కోల్పోయానని, ఇకపై తమ కోసం ఎవరూ రావద్దని సూరజ్ తేల్చి చెబుతాడు. అదే సమయంలో తన తల్లి కాళ్లు పోయినప్పుడు తాను కేవలం నెలల పిల్లాడినని గుర్తుచేస్తాడు. కార్తీక్ తన తల్లి కోసం ఎలా బతికాడో, తాను కూడా తన తల్లి కోసమే బతికానని చెబుతాడు. ఇద్దరి జీవితాల్లోనూ బాధ ఒకేలా ఉందని అంటాడు.

సూరజ్ మనసులో జ్యోత్స్న ఉందా?

అయితే కార్తీక్ మాత్రం సూరజ్‌ను పూర్తిగా తప్పుబట్టడు. “మమ్మల్ని మోసం చేశావంటే నువ్వు మోసగాడివి కావు. నువ్వు ఉన్నావని తెలియని తండ్రికి మాత్రం మంచి కొడుకువి” అని చెబుతాడు. అసలు నిజానిజాలు ఏంటో ఎవరికీ పూర్తిగా తెలియదని అంటాడు. సూరజ్ కూడా జ్యోత్స్నను ప్రేమించాడని కార్తీక్ భావిస్తాడు. నిజంగా మోసం చేయాలనుకుంటే జ్యోత్స్న మెడలో తాళి కట్టి ఆమెను ఈ ఇంటికి తీసుకొచ్చి నరకం చూపించేవాడివని చెబుతాడు. అలా చేసి ఉంటే తమ అత్త గుండె పగిలి చనిపోయేదని అంటాడు. కానీ సూరజ్ అలా చేయాలని ఎప్పుడూ అనుకోలేదని కార్తీక్ స్పష్టం చేస్తాడు. జ్యోత్స్న కూడా సూరజ్‌ను వదులుకోలేదని, సూరజ్ కూడా జ్యోత్స్నను పూర్తిగా వదులుకోలేడని అంటాడు. తల్లిదండ్రులను అంతగా ప్రేమించే సూరజ్.. జ్యోత్స్నను మోసం చేయాలని నిజంగా అనుకోడని కార్తీక్ చెబుతాడు. జ్యోత్స్న ఇప్పటికీ ఔట్‌హౌస్‌లోనే తిరుగుతోందని, వారి ప్రేమే చివరకు వారిద్దరినీ కలుపుతుందని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తాన్ని సూరజ్ తల్లి వినడం చూసి అతను షాక్ అవుతాడు. కార్తీక్ మాటలు విన్న తర్వాత సూరజ్ నిజంగానే జ్యోత్స్నను ప్రేమించాడని మాలినికి కూడా అర్థమవుతున్నట్లుగా పరిస్థితి మారుతుంది.

కృష్ణమూర్తి మరణంపై కార్తీక్‌కు కొత్త అనుమానం

ఇదే సమయంలో కార్తీక్‌కు మరో కీలకమైన అనుమానం వస్తుంది. కృష్ణమూర్తి బాబాయి చనిపోవడానికి సుమిత్ర అత్త కారణం కాకపోవచ్చని, భయంతోనే ఆయన చనిపోయి ఉండొచ్చని కార్తీక్ ఆలోచిస్తాడు. అయితే ఆ భయం ఎందుకు వచ్చిందనే ప్రశ్న అతడిని వెంటాడుతుంది. లారీ పంపనప్పుడు అదే విషయాన్ని ధైర్యంగా తన చెల్లికి చెప్పి ఉంటే సరిపోయేదని భావిస్తాడు. సూరజ్ తండ్రి చావుకు శివన్నారాయణ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని సూరజ్‌ను నమ్మించగలిగితే, జ్యోత్స్న-సూరజ్ పెళ్లి మళ్లీ జరిగే అవకాశం ఉందని కార్తీక్ చెబుతాడు. అదే సమయంలో మాలిని పిన్నితో చాలా జాగ్రత్తగా ఉండాలని కార్తీక్, దీపలు నిర్ణయించుకుంటారు.కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత మాలిని సూరజ్‌ను ప్రశ్నిస్తుంది. “కార్తీక్ చెప్పినట్లు నువ్వు నిజంగానే జ్యోత్స్నను ప్రేమిస్తున్నావా?” అని అడుగుతుంది. దానికి సూరజ్.. బయట నుంచి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందని, తన కొడుకు మనసు తనకు తెలియదా అని తల్లిని ప్రశ్నిస్తాడు.తాను తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకున్నానని, ఇకపై తమ కోసం తాము బతకాలని చెబుతాడు. కార్తీక్ చాలా తెలివిగా తమ ఇంటి గుమ్మంలో ఒక నీడను వదిలేసి వెళ్లాడని సూరజ్ అంటాడు. అయితే తన కొడుకు మనసులో నిజంగా జ్యోత్స్న ఉందా? లేదా? అనే సందేహంలో మాలిని పడుతుంది.

జ్యోత్స్న జీవితాన్ని మార్చేసిన పాత తప్పు

మరోవైపు దాస్ పారిజాతంతో మాట్లాడుతూ గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటాడు. తన కూతురు జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలిగా ఉంటేనే ఆమె జీవితం బాగుంటుందని భావించి అప్పట్లో బిడ్డలను మార్చేశారని చెబుతాడు.తాను చంపాలని అనుకున్న బిడ్డ కుబేర దగ్గర పెరిగి చివరకు ఈ ఇంటికే చేరి కార్తీక్ భార్యగా మారిందని గుర్తుచేస్తాడు. దీప జీవితం కూడా బాగానే సాగుతోందని అంటాడు. శివన్నారాయణ గారి మనవరాలిగా జ్యోత్స్న జీవితం ఆకాశదీపంలా వెలుగుతుందని అనుకున్నామని, కానీ అదే నిర్ణయం చివరకు జ్యోత్స్న జీవితానికి శాపంగా మారిందని బాధపడతాడు.జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురు కాకపోయి ఉంటే ఈరోజు ఆమెకు ఈ పరిస్థితి వచ్చేది కాదని దాస్ అంటాడు. తాము బిడ్డలను మార్చకపోయి ఉంటే తన కూతురు ఈపాటికి ఇద్దరు పిల్లలకు తల్లి అయి, భర్తతో హాయిగా కాపురం చేసుకునేదని ఆవేదన చెందుతాడు.“పాపం చేశాం.. ఇప్పుడు నా కూతురు ఆ పాపాన్ని భరిస్తోంది” అంటూ దాస్ బాధపడతాడు. ఎంత ప్రయత్నించినా జ్యోత్స్న మనసులోంచి సూరజ్‌ను చెరిపేయలేమని పారిజాతంతో చెబుతాడు.ఇలా కార్తీక దీపం 2 సెప్టెంబర్ 5 ఎపిసోడ్ సూరజ్, జ్యోత్స్న ప్రేమతో పాటు రెండు కుటుంబాల గతం, తల్లిదండ్రుల బాధ, ప్రతీకారం, పాత రహస్యాల చుట్టూ సాగింది. ముఖ్యంగా సూరజ్ కన్నీళ్లు పెట్టుకున్న సన్నివేశం, కృష్ణమూర్తి మరణంపై కార్తీక్‌కు వచ్చిన కొత్త అనుమానం కథను మరో కీలక మలుపు వైపు తీసుకెళ్లాయి. ఇక జ్యోత్స్న-సూరజ్ మళ్లీ కలుస్తారా? సూరజ్ తండ్రి మరణం వెనుక అసలు నిజం బయటపడుతుందా? అనేది తదుపరి ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా మారనుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp