Allu Arjun : చిరంజీవి ఇంటికి వెళ్ల‌ని అల్లు అర్జున్.. గొడ‌వ మరీ పెద్ద‌ది చేయాల‌నుకుంటున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : చిరంజీవి ఇంటికి వెళ్ల‌ని అల్లు అర్జున్.. గొడ‌వ మరీ పెద్ద‌ది చేయాల‌నుకుంటున్నాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,12:54 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : చిరంజీవి ఇంటికి వెళ్ల‌ని అల్లు అర్జున్.. గొడ‌వ మరీ పెద్ద‌ది చేయాల‌నుకుంటున్నాడా..!

Allu Arjun : గ‌త కొద్ది రోజులుగా అల్లు- మెగా ఫ్యామిలీల మ‌ధ్య అంత కోల్డ్ వార్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేస్తున్న పనులు ఆస‌క్తిక‌రంగా మారాయి. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ ని కలవడానికి రామ్ చరణ్, అతని తల్లి సురేఖ పిఠాపురం బయలుదేరి వెళ్లారు. అదే రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో నంధ్యాల బయలుదేరి వెళ్లారు. ఎందుకంటే తన స్నేహితుడు శిల్ప రవికిశోర్ చంద్ర రెడ్డి పిలవకపోయినా, తను వెళ్లి అతనికి ఎన్నికల్లో గెలిపించడానికి అని చెప్పారు. స్నేహితుడి కోసం అతను చెయ్యాల్సిన పనే చేశారు. కానీ వెళ్లిన టైమింగే సరైనది కాదు అని మెగా అభిమానాలు అంటున్నారు.

Allu Arjun : ఎందుకు మిస్ అయ్యారు..

తన సమీప బంధువు పవన్ కళ్యాణ్ ని ముందుగా కలిసి, తన సంఘీభావం తెలిపి ఆ తరువాత నంధ్యాల స్నేహితుడి కోసం వెళితే బాగుండేది. కానీ అల్లు అర్జున్ ఆలా చెయ్యలేదు. అదీ కాకుండా, రామ్ చరణ్, అతని తల్లి సురేఖమ్మ పవన్ కళ్యాణ్ ని కలవటానికి వెళ్లిన రోజే అల్లు అర్జున్ వెళ్లడం. ఇవన్నీ పెద్ద వివాదాలకు తయారీ తీసింది అప్పుడు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేశారు అప్పుడు, ఎన్నిక ఫలితాలు ప్రకటించిన తరువాత కూడా అర్జున్ ని ట్రోల్ చేశారు. నంధ్యాలలో తన స్నేహితుడు ఘోరంగా ఓడిపోవటంతో బ‌న్నీని దారుణంగానే ట్రోల్ చేశారు. అయితే ప‌వ‌న్ గెలుపు త‌ర్వాత అల్లు అర్జున్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్‌ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రజలకు సేవ చేయడంలో మీరు పడే శ్రమ, మీ అంకితభావం, నిబద్ధత ఎప్పుడూ హార్ట్‌ టచింగ్‌గా ఉంటాయి. మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అంటూ హీరో అల్లు అర్జున్‌ ట్వీట్‌ పెట్టారు.

Allu Arjun చిరంజీవి ఇంటికి వెళ్ల‌ని అల్లు అర్జున్ గొడ‌వ మరీ పెద్ద‌ది చేయాల‌నుకుంటున్నాడా

Allu Arjun : చిరంజీవి ఇంటికి వెళ్ల‌ని అల్లు అర్జున్.. గొడ‌వ మరీ పెద్ద‌ది చేయాల‌నుకుంటున్నాడా..!

గెలిచిన తరువాత తీరిక లేకుండా అభిమానులతో, తరువాత ఢిల్లీ వెళ్లి అక్కడ కాబోయే ప్రధానమంత్రి మోదీతో, జాతీయ నాయకులతో ఎడతెరిపి సమావేశాలు నిర్వహించారు. ఇంత బిజీ సమయంలోనూ తన తల్లి, అన్నయ్య, వదినలు ఆశీర్వాదం తీసుకునేందుకు అన్నయ్య ఇంటికి వెళ్లారు. చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో వెళ్లారు, తనయుడు అకిరా నందన్ ని కూడా తీసుకువెళ్లారు. చిరంజీవి ఇంట్లో కేవలం కొణిదెల కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. చిరంజీవి, అతని సోదరుడు నాగబాబు, చిరంజీవి సోదరీమణులు, వారి కుటుంబ సభ్యులు అందరూ వున్నారు. కాని అల్లు కుటుంబం మొత్తం మిస్ అయింది. అల్లు అర్జున్ మొహం చెల్లకే రాలేదని కొందరు అంటున్నారు, కొందరేమో ఏ మొహం పెట్టుకొని వెళతాడు అని అంటున్నారు. ఏది ఏమైన బ‌న్నీ చేస్తున్న ప‌నుల వ‌ల‌నే మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతుంద‌నే టాక్ న‌డుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది