CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు

 Authored By aruna | The Telugu News | Updated on :2 May 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు

CM Chandrababu Naidu  : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలకు, ప్రజల ఆశలకు నూతన స్పూర్తినిచ్చాయి. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా ఐదు కోట్లమందికి సెంటిమెంట్‌గా అభివర్ణించారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేసిన ఆయన, మళ్లీ అదే విధంగా మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం జరగడం గర్వకారణమన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని నిర్మాణం నిలిచిపోయిందని, రైతులు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu Naidu వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం చంద్రబాబు

CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు

CM Chandrababu Naidu  అమరావతి కేవలం నగరమే కాదు ఐదు కోట్లమంది సెంటిమెంట్‌ – చంద్రబాబు

ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు, భారత్‌ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను గుర్తుచేశారు. పదో స్థానంలో ఉన్న దేశం, ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని, త్వరలో మూడో స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కులగణన నిర్ణయాన్ని మోదీ తీసుకున్న నిర్ణయం గొప్పదిగా అభివర్ణించారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి రెండింటినీ లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిని ప్రపంచంలో గుర్తింపు పొందే భవిష్యత్‌ నగరంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన ఈ పునర్నిర్మాణం, రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశల రేకెత్తిస్తోంది. 5 లక్షలమంది విద్యార్థులు అక్కడ చదువుకునేలా శ్రేష్ఠ విద్యాసంస్థలను తీసుకురావడమే కాక, గ్రీన్ ఎనర్జీ ఆధారంగా కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానం, భోగాపురం ఎయిర్‌పోర్టు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌, రామాయపట్నం పోర్టు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. అమరావతి పునర్నిర్మాణంతో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందినట్టు సీఎం వ్యాఖ్యలు సంకేతంగా నిలిచాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది