Ambati Rambabu : తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు… రఘు రామ కృష్ణం రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అంబాటి రాంబాబు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rambabu : తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు… రఘు రామ కృష్ణం రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అంబాటి రాంబాబు…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ambati Rambabu : తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు... రఘు రామ కృష్ణం రాజు గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అంబాటి రాంబాబు...!

Ambati Rambabu : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారికి వైయస్ జగన్ టికెట్ రాకుండా చేశారని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అయితే గత కొంతకాలంగా ఈ వార్తలు పై ఆంధ్ర రాష్ట్రంలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైసీపీ నాయకుడు అంబాటి రాంబాబు ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంబటి రాంబాబును ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఓ ప్రశ్న అడగడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ రఘురామకృష్ణం రాజు గారికి జగన్ టికెట్ రాకుండా చేశారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

Ambati Rambabu ఎవరు తీసుకున్న గోతిలో వారే..

దీనిపై మీ స్పందన ఏంటని అడగడం జరిగింది. ఇక ఈ ప్రశ్నకు అంబాటి రాంబాబు సమాధానం ఇస్తూ….ఇన్మూరల్ గా పనిచేసే వ్యక్తిని ఎప్పుడూ ఎవరూ కూడా నమ్మరని తెలియజేశారు. ఎందుకు ఇన్మూరల్ అంటున్నాను అంటే…నువ్వు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచావు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తిడతాను అంటాడు. చివరికి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంబటి రాంబాబు తెలియజేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడీతో మాట్లాడి ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేశారని అంటున్నారు. అసలు ఇదేం ఆరోపణ. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని సైతం ఇన్ఫ్లెన్స్ చేయగలరని చెబుతున్నారా.

చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ఫ్లెన్స్ చేసి ఉండొచ్చు కదా అంటూ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ మరి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు జగన్ గారా చంద్రబాబు గారా అని అడిగారు. దీనికి అంబటి రాంబాబు సమాధానం ఇస్తూ ఇతను వైసీపీలో గెలిచి వైసీపీ పార్టీని తిడుతున్నారు కదా రేపు బీజెపీ పార్టీలో గెలిచి బీజెపీని కూడా తిడతాడేమో అని అధిష్టానమే అతనికి టికెట్ ఇవ్వలేదు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు.ఇది ఇలా ఉండగా రఘురామకృష్ణ రాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకుడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నామినేషన్ టికెట్ దక్కించుకోలేక 2014లో వైసీపీ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం 2019 మార్చిలో వైసీపీ పార్టీలోకి మళ్ళీ తిరిగి చేరారు. ఇక 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది