Ambati Rambabu : భోగి వేడుకల్లో మరోసారి పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ చేసిన అంబటి రాంబాబు .. వైరల్ వీడియో..!!
ప్రధానాంశాలు:
Ambati Rambabu : భోగి వేడుకల్లో మరోసారి పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ చేసిన అంబటి రాంబాబు .. వైరల్ వీడియో..!!
Ambati Rambabu : రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాలలో ప్రజలు వేకువ జామున లేచి భోగిమంటలు వేశారు. మంటల చుట్టు ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతుంది. సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను జరిపారు. ఇందులో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు డాన్సులు వేసి సందడి చేశారు. గిరిజన మహిళలతో పాటు పలువురితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసి ప్రజలను సందడి చేశారు.
గతేడాది కూడా అంబటి రాంబాబు ఇలాగే స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంబటి రాంబాబు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంజారా మహిళలతో కలిసి ఆయన భోగి పండుగను సంతోషంగా జరిపారు. ఇక అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అడ్డ పంచె కట్టుకొని సాంప్రదాయ బద్ధంగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరూ కలిసి భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేశారు.
తెలుగు స్వర్ణయగం సంక్రాంతి సంకల్పం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చాక అమరావతి బంగారు రాజధానిగా నిర్మించుకుందామని చెప్పారు. జై అమరావతి జై ఆంధ్ర అని నినాదంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు. నిరుద్యోగం పెరిగిపోయింది అని అన్నారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్తు చీకటే అని వ్యాఖ్యానించారు. దీంతో కొందరు పండగ రోజు కూడా ఇవి విమర్శలు చేయడం అవసరమా అని అంటున్నారు. మరికొందరు పండుగ రోజు అయిన సంతోషంగా గడపవచ్చు కదా ఇలా అధికార పార్టీపై విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని అంటున్నారు.